మోత్కూరు మండలం

తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం
(మోతుకూరు మండలం నుండి దారిమార్పు చెందింది)

మోత్కూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా లోని మండలం.[1] మోత్కూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 45 కి. మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో ఉంది.ఈ మండలం తుంగతుర్తి నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మోత్కూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, మోత్కూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°27′00″N 79°16′00″E / 17.4500°N 79.2667°E / 17.4500; 79.2667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి జిల్లా
మండల కేంద్రం మోత్కూర్ (యాదాద్రి భువనగిరి జిల్లా)
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,694
 - పురుషులు 27,911
 - స్త్రీలు 27,783
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.56%
 - పురుషులు 67.59%
 - స్త్రీలు 41.42%
పిన్‌కోడ్ 508277

గణాంక వివరాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 55,694 - పురుషులు 27,911 - స్త్రీలు 27,783. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 146 చ.కి.మీ. కాగా, జనాభా 29,845. జనాభాలో పురుషులు 15,010 కాగా, స్త్రీల సంఖ్య 14,835. మండలంలో 7,706 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు

మార్చు

మోత్కూర్ కు ఉత్తర దిశగా గుండాల, దేవరుప్పుల మండలాలు, తూర్పు వైపు అడ్డగూడూర్ మండలం, పశ్చిమ ఆత్మకూరు మండలాలు ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. మోత్కూరు
  2. కొండగడప
  3. సదర్‌షాపూర్
  4. పాటిమట్ల
  5. బిజిలాపూర్
  6. ముశిపట్ల
  7. పనకబండ
  8. పాలడుగు
  9. దత్తప్పగూడ
  10. పొడిచేడు
  11. అనాజిపూర్
  12. దాచారం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు