మోతె శ్రీలత రెడ్డి
మోతె శ్రీలత రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్‌గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది.[2]
మోతె శ్రీలత రెడ్డి | |||
| |||
డిప్యూటీ మేయర్ - హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 11 ఫిబ్రవరి 2021 - ప్రస్తుతం | |||
ముందు | బాబా ఫసియుద్దీన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 మార్చి 1[1] హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | మోతె శోభన్‌రెడ్డి | ||
సంతానం | రాజీవి, శ్రీతేజస్వి | ||
నివాసం | తార్నాక, హైదరాబాద్, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చుమోతె శ్రీలత రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి భార్య. ఆమె 2002లో తార్నాక డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయింది. శ్రీలత రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చి, రైల్‌రోకో, చలోడిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది.[3]
మోతె శ్రీలత రెడ్డి 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తార్నాక డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచి 2021 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టింది.[4] ఆమె 2023 ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 25న గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరింది.[5]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (1 March 2022). "ఘనంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి జన్మదిన వేడుకలు". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ TV9 Telugu (11 February 2021). "వనితలను వరించిన బల్దియా పీఠం.. భాగ్యనగర ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీగా శ్రీలత". Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (12 February 2021). "ఉద్యమ నేపథ్యానికి పట్టం" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ The New Indian Express (22 February 2021). "Gadwal Vijayalaxmi and Srilatha Reddy take charge as Hyderabad Mayor and Deputy Mayor". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
- ↑ Eenadu (25 February 2024). "కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు". Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.