బాబా ఫసియుద్దీన్
బాబా ఫసియుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) డిప్యూటీ మేయర్‌గా 2016 ఫిబ్రవరి 11 నుండి 2021 ఫిబ్రవరి 10 వరకు బాధ్యతలు నిర్వహించాడు.
బాబా ఫసియుద్దీన్ | |||
పదవీ కాలం 2021 ఫిబ్రవరి 10 – ప్రస్తుతం | |||
డిప్యూటీ మేయర్ - హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)
| |||
పదవీ కాలం 2016 ఫిబ్రవరి 11 – 2021 ఫిబ్రవరి 10 | |||
తరువాత | మోతె శ్రీలత రెడ్డి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కుల్చారం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | 1982 జూన్ 7||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | బాబా షర్ఫుద్దీన్, రజియా ఫాతిమా | ||
జీవిత భాగస్వామి | హబీబా సుల్తానా | ||
సంతానం | 2 | ||
నివాసం | బోరబండ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా యూనివర్సిటీ |
రాజకీయ జీవితం మార్చు
బాబా ఫసియుద్దీన్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి విభాగంలో కీలకంగా పనిచేస్తూ టిఆర్ఎస్వీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సకల జనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చి, రైల్‌రోకో, చలోడిల్లీ వంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. బాబా ఫసియుద్దీన్ 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బోరబండ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచి 2016 ఫిబ్రవరి 11న గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టాడు.[1][2] ఆయన 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బోరబండ డివిజన్ రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచాడు.[3]
మూలాలు మార్చు
- ↑ The Hindu (11 February 2016). "Baba Fasiuddin: TRS youth leader to Deputy Mayor" (in Indian English). Retrieved 4 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Janam Sakshi (12 February 2016). "మేయర్, డిప్యూటీ మేయర్ ఏకగ్రీవం". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
- ↑ TV5 News (20 November 2020). "బోరబండ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాబా ఫసియుద్దీన్" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.