మోదుగ చెట్టును ఆంగ్లంలో ఫ్లేమ్‍ ఆఫ్ ఫారెస్ట్ (Falme of Forest) అంటారు. బుటియ గమ్ ట్రీ (Butea gum tree) అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందినది. ఈచెట్టు వృక్షశాస్తనామం: బుటియ మొనొస్పెర్మ (Butea monosprema).[1]

మోదుగ పూలు

ప్రాంతీయ భాషల్లో పిలిచే పేర్లు[2][3]సవరించు

చెట్టు - నూనెగింజలుసవరించు

ఈమొక్క భారతదేశానికి చెందిన మొక్క. మద్యస్థంగా, కొన్నిచోట్ల గుబురైన పొదవలె పెరిగే, ఆకురాల్చు చెట్టు. సంయుక్త దళాలను కలిగి వుండును. భారతదేశంలో మధ్య, పశ్చిమ ప్రాంతాలలోని ఆకురాల్చుఆడవులలో విస్తరించి ఉంది.[4] పూలు ఫిబ్రవరి-జూన్ నెలల్లో పూయడం మొదల్వవుతుంది. పళ్ళు ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు దిగుబడి ఇస్తాయి. కాయ (Pod)15-20 సెం, మీ. పొడవుండి,2.2-5 సెం.మీ వెడల్పుండును. విత్తనంలో 17-19% వరకు నూనె వుండును. చెట్టు నుండి ఒకకిలో వరకు కాయల దిగుబడి వచ్చును. విత్తనంపైన నున్న పొట్టును తొలగించిన తరువాతనే గింజల నుండి నూనెను తీస్తారు.

నూనెను ఉత్పత్తి చేయుటసవరించు

సేకరించిన గింజల మీది పొట్టు (pod shell) ను డెకార్డికేటరు యంత్రాల ద్వారా తొలగించి తరువాత, కుటీర పరిశ్రమల స్ధాయిలో రోటరి నూనె యంత్రాల ద్వారా లేదా నూనెతీయు ఎక్సుపెల్లరు యంత్రాలలలో ఆడించి నూనె తీయుదురు. కేకులో మిగిలిన నూనెను సాల్వెంట్ఎక్సుట్రాక్షను పరిశ్రమలోని యంత్రాల ద్వారా పొందెదరు. ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను ఉత్పత్తిచేసిన 8-9% వరకు దిగుబడివచ్చును. విత్తనాలను నేరుగా సాల్వెంట్ ప్లాంట్లో ప్రాసెస్ చేసిన 17-18% వరకు రికవరి పొందవచ్చును.

నూనె లక్షణాలుసవరించు

నూనె పసుపురంగులో వుండి, రుచిలేకుండా వుండును. ఈనూనె వేరుశనగ నూనె, నువ్వుల నూనెలకు దగ్గరగా భౌతిక, రసాయనిక గుణాలను కలిగివున్నది.అయినప్పటికి ఈ నూనెను వంటనూనెగా వినియోగించటం లేదు.

మోదుగనూనె భౌతిక లక్షణాలపట్టిక[5][6]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 300Cవద్ద 1.460-1.470
ఐయోడిన్ విలువ 65-85
సపనిఫికెసను విలువ 175-190
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.9-2.0% గరిష్ఠం
టైటరు విలువ0C 45.4
తేమశాతం 0.5% గరిష్ఠం
రంగు ముదురు పసుపు
  • ఐయోడిన్‌విలువ: ప్రయోగశాలలో 100గ్రాములనూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌గ్రాములసంఖ్య. ప్రయోగసమయంలో ఫ్యాటిఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిమ్ విలువ అసంతృప్తఫ్యాటిఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
  • సపొనిఫికెసను విలువ: ఒకగ్రాము నూనెలోని ఫ్యాటిఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్, మి.గ్రాంలలో.
  • అన్‌సపొనిఫియబుల్‌మేటరు: పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు.ఇవి అలిపాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చు పదార్థములు (pigments), రెసినులు.

మోదుగనూనె లోని కొవ్వు ఆమ్లాల శాతం[5][6]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం 21-27
స్టియరిక్ ఆమ్లం 7-9
అరచిడిక్ ఆమ్లం 2.5-6
బెహెనిక్ ఆమ్లం 6-12
లిగ్నొసెరిక్ ఆమ్లం 4.0
ఒలిక్ ఆమ్లం 27-28
లినొలిక్ ఆమ్లం 19-22
గడొలిక్ ఆమ్లం 2.7

నూనె వినియోగంసవరించు

  • ప్రస్తుతం ఈ నూనె సబ్బులను తయారుచేయుటకు మాత్రమే ఉపయుక్తం.[6]
  • నూనెతీసిన కేకును సేంద్రియ ఎరువుగా వాడోచ్చును.
  • కీళ్ళ వాపునకు మర్దన నూనెగా ఉపయోగిస్తారు.[7]

ఇవికూడా చూడండిసవరించు

మూలాలు/ఆధారాలుసవరించు

  1. "Flame of the Forest , Indian Plant". indianetzone.com. Retrieved 2015-03-06.
  2. SEAHandBook-2009 By ThesolventExreactors Association of India
  3. "Flame of the Forest". flowersofindia.net. Retrieved 2015-03-06.
  4. "Palash - The Native Indian Tree". hearty-india.com. Retrieved 2015-03-06.
  5. 5.0 5.1 "TOP-NOTCH TECHNOLOGY IN PRODUCTION OF OILS AND FATS". chempro.in. Retrieved 2015-03-06.
  6. 6.0 6.1 6.2 "Palash / Palas". crirec.com. Retrieved 2015-03-06.[permanent dead link]
  7. "Palash". evaidyaji.com. Archived from the original on 2015-03-06. Retrieved 2015-03-06.