ప్రధాన మెనూను తెరువు

మోనికా అన్నా మేరియా బెల్లూచి (30 సెప్టెంబరు 1964న జననం)[1] ఒక ఇటలీ నటి మరియు ఫ్యాషన్ మోడల్.

Monica Bellucci
Monica Bellucci, Women's World Awards 2009 b.jpg
Monica Bellucci at the Women's World Award 2009
జననం Monica Anna Maria Bellucci
(1964-09-30) 1964 సెప్టెంబరు 30 (వయస్సు: 54  సంవత్సరాలు)
Città di Castello, Umbria, Italy
వృత్తి నటి and ఫ్యాషన్ మోడల్
క్రియాశీలక కాలం 1990 – present
జీవిత భాగస్వామి(లు): Claudio Carlos Basso (1990 – ?)
Vincent Cassel (1999 – present)

విషయ సూచిక

వ్యక్తిగత జీవితంసవరించు

బెల్లూచి ఇటలీ[2][3] లోని అంబ్రియాలో ఉన్న సిట్టా డి క్యాస్టెల్లోలో జన్మించింది. ఆమె పెయింటర్‌గా పనిచేసే మేరియా గస్టినెల్లి మరియు లుయ్‌గి బెల్లూచి దంపతుల ముద్దుల తనయ. వారికి సొంతంగా ఒక రవాణా సంస్థ ఉంది.[4] 16 ఏళ్ల ప్రాయంలో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన బెల్లూచి తొలుత లిసియో క్లాసికోకు హాజరయింది. తొలుత న్యాయశాస్త్ర విద్యను ఎంచుకున్న ఆమె పెరూగియా విశ్వవిద్యాలయం[5] లో ట్యూషన్ ఫీజు కోసం మోడలింగ్ చేసింది. అయితే ఎంపిక చేసుకున్న జీవనవిధానం ఆమెను చదువుకు దూరమయ్యేలా చేసింది. ఆమె ఇటలీ, ఫ్రెంచ్ మరియు ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది. అలాగే స్పెయిన్ భాషను కూడా మధ్యస్తంగా మాట్లాడగలదు. ఈ భాషలన్నింటిలోనూ ఆమె కొన్ని పాత్రలు చేసింది. అంతేకాక ది ప్యాషన్ ఆఫ్ ది క్రిస్ట్ చిత్రంలో మేరీ మగ్దలీన్‌గా అరామైక్ భాషలోనూ ఒక పాత్ర చేసింది.

1990లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ క్లాడియో కార్లోస్ బస్సోను బెల్లూచి వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో తనతో కలిసి నటించిన సహ నటుడు విన్సెంట్ క్యాసెల్‌ను వివాహం చేసుకుంది. వారికి దెవా (12 సెప్టెంబరు 2004న జననం) అనే కుమార్తె ఉంది. 2010 వసంతంలో ఈ జంటకు రెండో శిశువు జన్మించే అవకాశముంది. 2004లో తన కుమార్తె గర్భంలో ఉన్నప్పుడు, ప్రదాత వీర్యాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించే ఇటలీ చట్టాలకు నిరసనగా ఆ దేశ సంచిక వ్యానిటీ ఫెయిర్ కోసం బెల్లూచి నగ్నంగా పోజిచ్చింది.[6]

ది బిగ్ క్వశ్చన్ అనే లఘు చిత్రంలో ది ప్యాషన్ ఆఫ్ ది క్రిస్ట్ చిత్రం గురించి ఆమె ఇలా తెలిపింది, "నేను సర్వ మతాలను గౌరవిస్తాను. అలాగే వాటిపై నాకు ఆసక్తి ఉంది. అయినప్పటికీ, నేనొక ఆజ్ఞేయవాదిని. నేను నమ్మే విషయం ఏదైనా ఉంటే, అది ఆటుపోట్ల సమయంలో సముద్రాలను నింపే మరియు ప్రకృతి, ప్రాణులను మమేకం చేసే మర్మమైన శక్తి ఒక్కటే."[7]

వృత్తిసవరించు

మోడలింగ్సవరించు

 
2003 కేన్స్ చలనచిత్రోత్సవంలో

1988లో బెల్లూచి ఐరోపా ఫ్యాషన్ కేంద్రాల్లో ఒకటైన మిలాన్ చేరుకుంది. అక్కడ ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌తో ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. 1989 కల్లా, ఆమె ప్యారిస్‌లోనూ మరియు న్యూయార్క్ నగరంలోని అట్లాంటిక్ వ్యాప్తంగా ఒక ప్రఖ్యాత మోడల్‌గా అవతరించింది. డాల్సీ & గబ్బానా మరియు ఫ్రెంచ్ ఎల్లీ కోసం ఆమె పోజిచ్చింది. అదే ఏడాది బెల్లూచి నటనపై కూడా దృష్టి సారించి, శిక్షణా తరగతులకు వెళ్లడం ప్రారంభించింది. ఫిబ్రవరి, 2001లో వాంఛపై ఎస్‌క్వైర్ విడుదల చేసిన సంచిక కవర్‌పై Ms.బెల్లూచి దర్శనమిచ్చింది. అంతేకాక ఐదు భావాల్లో వ్యక్తం చేసిన ఒక కథనంలోనూ ఆమె కన్పించింది. 2003లో, మేగ్జిమ్‌ సంచికపైనా ఆమె దర్శనమిచ్చింది.[8] 2004లో ఆస్క్‌మెన్ యొక్క ప్రపంచంలోని 100 మంది అత్యంత అందగత్తెల వార్షిక జాబితా లో ఆమె అగ్రస్థానాన్ని అధిష్టించింది.బెల్లూచి మోడలింగ్ వృత్తి నిర్వహణను న్యూయార్క్ నగరంలోని ఎలైట్+ చూసుకునేది. ఆమె ఇటలీ సెక్స్ సింబల్‌గా పరిగణించబడింది.[9][10][11] డియోర్ సుగంధ ఉత్పత్తుల శ్రేణికి ఆమె ప్రస్తుతం ప్రచారకర్త. అలాగే లండన్‌లోని స్టార్మ్ మోడల్ మేనేజ్‌మెంట్‌తోనూ ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.

చలనచిత్రంసవరించు

 
2009 విమెన్స్ వరల్డ్ అవార్డుల కార్యక్రమంలో

1990 దశకాల మొదట్లో బెల్లూచి చలనచిత్ర జీవితం మొదలయింది. లా రిఫ్ఫా మరియు బ్రామ్ స్టాకర్స్ డ్రాకులా (1992)లో ఆమె చిన్న పాత్రలు చేసింది. అలాగే 1996లో L'అపార్ట్‌మెంట్ [12] చిత్రంలో లిసా పాత్ర ద్వారా ఉత్తమ సహాయ నటిగా సెసార్ ఆవార్డ్‌కు ఆమె ఎంపికయింది. తద్వారా నటిగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మెలీనా (2000), ఇర్‌రివర్స్‌బుల్ (2002) చిత్రాల్లో చేసిన పాత్రల ద్వారా ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అలాగే టియర్స్ ఆఫ్ ది సన్ (2003), ది మ్యాట్రిక్స్ లీలోడెడ్ (2003), ది ప్యాషన్ ఆఫ్ ది క్రిస్ట్ (2004), ది బ్రదర్స్ గ్రిమ్ (2005), లీ డ్యూక్సిమ్ సౌఫిల్ (2007), డోంట్ లుక్ బ్యాక్ (2009) తదితర పలు ఐరోపా మరియు హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించింది.

సోనియా జీవితచరిత్ర ఆధారంగా అదే పేరుతో తీయాలనుకున్న చిత్రంలో భారతీయ రాజకీయ నాయకురాలు సోనియా గాంధీ పాత్రను బెల్లూచి పోషించాల్సి ఉంది. వాస్తవానికి ఆ చిత్రాన్ని 2007లో విడుదల చేయాలనుకున్నప్పటికీ, చివరకు అది రద్దయింది.

'షూట్ ఎమ్ అప్ (2007) చిత్రం యొక్క ఫ్రెంచ్ మరియు ఇటలీ అనువాదాలకు బెల్లూచి సొంతంగా తనే గాత్రదానం చేసింది.[13] అంతేకాక కైలీనా వీడియో గేమ్‌Prince of Persia: Warrior Within లోని ప్రధాన పాత్రకు మరియు 2005లో విడుదలయిన యానిమేటెడ్ చిత్రం రోబోట్స్‌‌ లోని కేప్పీ పాత్ర ఫ్రెంచ్ అనువాదానికి కూడా ఆమే గాత్రదానం చేసింది.

పురస్కారాలు మరియు ఇతరాలుసవరించు

2003లో రిమంబర్ మి, మై లవ్ చిత్రంలో అలెస్సియా పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నాస్ట్రో డిఅర్జెంటో ' పురస్కారాన్ని బెల్లూచి గెలుచుకుంది.[14] 2006లో నిర్వహించిన 59వ కేన్స్ చలనచిత్రోత్సవానికి ఆమె న్యాయమూర్తిగా వ్యవహరించింది. 2009లో విమెన్స్ వరల్డ్ అవార్డ్ ప్రదానోత్సవంలో ఆమె ప్రపంచ నటి అవార్డును గెలుచుకుంది.

ఫిల్మోగ్రఫీసవరించు

1991 1992 1992 1995 1995 1995 1996 1999 1999 2001 2003 2003 2003 ది మాట్రిక్స్ రిలోడెడ్ 2003 2003 2004 2004 2004 2006 2006 2006
సంవత్సరం చిత్రం పాత్ర గమనికలు
1990 విటా కోయి ఫిగ్లి (లైఫ్ విత్ ది సన్స్ ) ఎల్డా
బ్రిగాంటి – అమోర్ ఇ లిబర్టా (బ్యాండిట్స్ – లవ్ అండ్ లిబర్టీ ) కోస్టాంజా
లా రిఫ్ఫా ఫ్రాంసెస్కా
బ్రామ్ స్టాకర్స్ డ్రాకులా ఒకానొక డ్రాకులా వధువు పాత్ర
ఆస్టినాటో డెస్టినో మెరీనా/ ఏంజెలా
1994 ఐ మిటిసి డెబోరా
పాలా డి నీవ్(1995 చిత్రం)

మెలీనా

ఇల్ సియెల్లో ఇ సింప్రీ ప్యూ బ్లూ(1995 చిత్రం)
జోసెఫ్ ఫరావో భార్య
L'అపార్ట్‌మెంట్ లిసా
1997 స్ట్రెస్సాటి(1997 చిత్రం)
1997 డోబర్‌మన్ న్యాట్ ది జిప్సీ
1997 మౌవాయిస్ జెన్రీ(1997 చిత్రం) కేమిల్లీ
1997 కమ్ మి వ్యూయి(1997 చిత్రం) నెల్లినా
1998 లీ ప్లాయిసర్ (1998 చిత్రం) గర్ల్
1998 కాంప్రమైజ్ (1998 చిత్రం) మోనిక్యూ
1998 అల్టిమో కేపొడానో డెల్యుమనిటా (హ్యూమానిటీస్ లాస్ట్ న్యూ ఇయర్స్ ఈవ్ ) గియులియా గియోవన్నిని
1998 ఎ లాస్ క్యూ అమాన్(1998 చిత్రం) వెలరియా
కమ్ అన్ పాయిజన్ హార్స్ డిలియూ (1999 చిత్రం) మిర్టిల్లే
మెడిటెరానీస్(1999 చిత్రం) మార్‌గ్యూరిట్
2000 అండర్ సస్పీషియన్ చాంటల్ హార్స్ట్
2000 ఫ్రాంక్ స్పాడోన్ (2000 చిత్రం) లౌరా
2000 మెలీనా (2000 చిత్రం) మెలీనా స్కార్డియా
బ్రదర్‌హుడ్ ఆఫ్ ది ఊల్ఫ్ - లీ ప్యాక్టి డెస్ లోప్స్ (2001 చిత్రం) సిల్వియా
2002 ఆస్టరిక్స్ & ఒబెలిక్స్: మిషన్ క్లియోపాట్రీ క్లియోపాత్రా
2002 ఇర్‌రివర్స్‌బుల్ (2002 చిత్రం) అలెక్స్
రిమంబర్ మి, మై లవ్ - రికార్డటి డై మి (2003 చిత్రం) అలెస్సియా
టియర్స్ ఆఫ్ ది సన్ (2003 చిత్రం) లీనా ఫియోర్ కెన్‌డ్రిక్స్
పెర్సీఫోన్
ఎంటర్ ది మ్యాట్రిక్స్ (వీడియో గేమ్) పెర్సీఫోన్
ది మ్యాట్రిక్స్ రివల్యూషన్స్ పెర్సీఫోన్
ది ప్యాషన్ ఆఫ్ ది క్రిస్ట్ మేరీ మగ్దలీన్
ఏజెంట్స్ సీక్రెట్స్ బార్బరా / లిసా
షీ హేట్ మి సిమోనా బోనసెరా
2005 ది బ్రదర్స్ గ్రిమ్ ది మిర్రర్ క్వీన్
2005 హౌ మచ్ డు యు లవ్ మి? (కాంబియన్ టు మైమ్స్?) (2005 చిత్రం) డేనియల్
షీతన్(2006 చిత్రం) లా బెల్లీ వ్యాంపైరెస్
N (ఇయో ఇ నాపోలియోనీ)(2006 చిత్రం) బారోనెస్సా ఎమీలియా స్పెజియాలి
ది స్టోన్ కౌన్సిల్ లౌరా సిప్రీన్
2007 హార్టాంగో
(ఇంటిమిస్సిమి లఘు చిత్రం)
L'ఇన్‌అఫెర్రబైల్/ లా ప్యాషనలీ / L'ఇన్‌డెసిసా / లా క్యూరియోసా / L'అగ్రెసివా / లా మమ్మా / లా ప్రీమ్యూరోసా
2007 మేన్యువల్ డి అమోర్ 2
(కేపిటోలి సక్సెసివ్) (2007 చిత్రం)
లూసియా
2007 షూట్ 'ఎమ్ అప్ డొన్నా క్వింటానో
2007 లీ డ్యూక్సిమ్ సౌఫిల్ మానౌచి
2008 సంగ్యూపాజో లూయిసా ఫెరీదా
2008 L'యూమో చీ అమా (2008 చిత్రం)

అల్బా

2009 డోన్ట్ లుక్ బ్యాక్ - నీ టీ రిటౌర్నీ పాస్ (2009 చిత్రం) జీన్
2009 ది ప్రైవేట్ లైవ్స్ ఆఫ్ పిప్పా లీ గిగి లీ
2009 బారియా - లా పోర్టా డెల్ వెంటో (2009 చిత్రం) తాపికాడు ప్రియురాలు
2009 ఒమాగియో ఎ రోమా(2009 చిత్రం) టోస్కా
2010 ది విజిల్‌బ్లోవర్(2010 చిత్రం)
2010 ది సోర్సరర్స్ అప్రెంటీస్

వెరోనికా

సూచనలుసవరించు

 1. బర్త్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ది పెరూగినా రిజిస్ట్రీ ఆఫీస్
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 3. "Monica Bellucci: Biography". MSN. Retrieved 2008-01-23.
 4. "Monica Bellucci Biography (1969?–)". Filmreference.com. Retrieved 2007-09-08.
 5. Corliss, Richard (10 March 2003). "It's Monica Mania". Time Magazine. Retrieved 2007-05-26.
 6. Owen, Richard (4 June 2005). "Actresses fight Pope over fertility". The Times. Retrieved 2007-05-30.
 7. "Monica-Bellucci.net". Retrieved 2006-10-08. Text "publisherMonica-bellucci.net" ignored (help)
 8. "Monica Bellucci Photos". Maxim. Retrieved 2007-01-15.
 9. Salisbury, Mark (23 October 2005). "Danger woman". Guardian Unlimited, The Observer. Retrieved 2007-05-26.
 10. Davies, Hugh (23 January 2003). "Gibson brings his passion for Christ to the big screen". The Daily Telegraph. Retrieved 2007-05-26.
 11. Morgoglione, Claudia (14 October 2006). "Monica baronessa divertente per Virzì "Bello quel ruolo un po' da mignotta"". La Repubblica. Retrieved 2007-05-26. (in Italian)
 12. Campion, Chris (5 October 2006). "Fantasy made flesh". The Daily Telegraph. Retrieved 2009-04-17.
 13. CraveOnline (5 September 2007). "Monica Bellucci's balancing act". CraveOnline. Retrieved 2007-10-21.
 14. Vivarelli, Nick (16 June 2003). "'scared' Nabs Italian Silver". The Hollywood Reporter. Retrieved 2009-04-17.

బాహ్య వలయాలుసవరించు