మోపిదేవి కృష్ణస్వామి
మోపిదేవి కృష్ణస్వామి రచయిత.[1] అతను మానవ ధర్మ శిక్షణా సంస్థను స్థాపించాడు. అనేక పుస్తకాలను రాసాడు. అతను ఎక్కిరాల కృష్ణమాచార్యకు ప్రియశిష్యుడు[2].
జీవిత విశేషాలు
మార్చుఅతను కొక్కిలిగడ్డ కొత్తపాలెం లో జన్మించాడు. కొంతకాలానికి మందపాకలోని తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ క్రైస్తవబడిలో మూడవతరగతిలో చేరాడు. అక్కడ చదువుతున్న కాలంలో అతని కుటుంబం కొక్కిలిగడ్డ కొత్తపాలెం నుండి దివికోడూరుకు చేరుకుంది. తన తండ్రితో దివికోడూరుకు వెళ్ళాడు. అతనికి కోడూరులో సాంఘిక పరిచయాలు ప్రారంభమైనాయి. అక్కడ అతనికి ఏదో చేయాలి, ప్రజలకు తాము చేస్తున్న తప్పులు తెలియజెప్పాలి, అందరినీ పద్ధతిలో ఉంచడం ఎలా? అని తపన పడేవాడు. 9వ తరగతిలో అతనికి శ్రీధర్ తో పరిచయమయింది. అతనితో సామాజిక పరిస్థితులు సర్దుబాటు కావడానికి మార్గాలను అన్వేషించేవాడు. పత్రికల ద్వారా కొంత చైతన్యం సాధించవచ్చునని తలచి అతను శ్రీధర్ తో కలసి పాఠశాల పత్రిక "గ్రామ జీవితం"ను ప్రారంభించాడు. అతని స్నేహితుడు వేరే ఊరికి వెళ్ళీపోవడంతో పత్రిక ఆగిపోయింది. పాఠశాల జీవితం తరువాత అతను పి.యు.సిలో బై.పి.సి గ్రూపు తీసుకొని చదివాడు. తరువాత బి.ఎ. లిటరేచర్ పూర్తిచేసాడు ఈ రోజుల్లోనే అతను రాసిన "ఇది గాంధీ యుగమా? బ్రాందీ యుగమా?" అనే గేయం పత్రికలో అచ్చయింది. బి.ఎ చేసిన తరువాత అతని ఉపాధ్యాయుడు రమణారావు ప్రేరణతో విశాఖపట్నంలో ఎం.ఎ చదివాడు. అప్పుడు "అగ్నిజ్యాల" అనే నాటకం రాసాడు.[3]
అప్పట్లో విద్యార్థులు తమ యవ్వనంలో విపరీతమైన భావావేశపు తుఫానులో కొట్టుకుపోతుంటే కొన్ని స్వార్థ శక్తులు వారిని తమ రాజకీయాలకు, మత ప్రయోజనాలకు, దేశ విద్రోహ చర్యలకు వాడుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆలంబనగా డాక్టర్ కృష్ణస్వామి తన ఆత్మకథనే "అన్వేషణ-అనుభూతి" అనే పుస్తకంగా రాశాడు[4]. చిన్నతనంలోనే ఆయన్ను సమాజంలోని తారతమ్యాలు, కుల వర్గ వైషమ్యాలు మొదలైనవి ఆలోచింపజేశాయి. వాటిని ఎలా రూపు మాపాలో ఆయన అనునిత్యం మథనపడుతూ ఉండేవాడు. ఎమ్మే చదివేటపుడు తనతో భావ సారూప్యత గల సీనియర్లతో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళు కృష్ణస్వామిని “విప్లవ మార్గం” లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన వారి పద్ధతులలో లోటుపాట్లను ఎత్తి చూపుతాడు. వాళ్ళు తమ మార్గం సరైంది కాకపోతే, సరైన మార్గం ఏదని అడుగుతారు. ఆయన నా అన్వేషణ అందుకోసమే అని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తారు. అలా కొంతకాలం తనలోతానే మథనపడి ఈ సమాజాన్ని బాగు చేసే మార్గం తన వద్ద లేదనీ, అలా బతకడం కన్నా చనిపోవడమే మేలనుకుంటాడు. చివరికి తన గురువు (ఎక్కిరాల కృష్ణమాచార్య) సాహచర్యంలో జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటాడు.
మానవ ధర్మ శిక్షణా సంస్థ
మార్చుభారతజాతి పురర్నిర్మాణమునకు, ప్రపంచ జాతులకు సహజీవన విధానమునందించుటకు ఈ సంస్థను అతను నెలకొల్పాడు.
- పూజావిధానము - రుద్రాభిషేకము
- మాటలు - మంత్రాలు-1
- మాటలు - మంత్రాలు-2
- సంభాషణలు-సమన్వయాలు
- శ్రీమద్భాగవతము-దివ్యజీవన మార్గము
- భాగవత కథాసుధ
- హోమియో తత్త్వ శాస్త్ర ప్రవచనాలు
- దర్శనాలు నిదర్శనాలు-2
- నిత్య జీవితానికి నియమావళి
- పార్ధసారథి ప్రవచనాలు
- పునర్నిర్మాణానికి శంకారావం
- పునర్నిర్మాణానికి శంకారావం-2
- భారతం ధర్మాద్వైతం
- రామాయణము మానవ ధర్మము
- మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2
- స్వామి లేఖలు - శాంతి రేఖలు -2
- సందేహాలు - సమాధానాలు
మూలాలు
మార్చు- ↑ "కథానిలయం - View Writer". kathanilayam.com. Archived from the original on 2020-04-07. Retrieved 2020-04-07.
- ↑ "పూజావిధానము - రుద్రాభిషేకము | PujaVidhanamuRudrabhishekamu". www.freegurukul.org. Retrieved 2020-04-07.[permanent dead link]
- ↑ ఆత్మకథ (1992). అన్వేషణ అనుభూతి. p. 54.
- ↑ "అన్వేషణ – అనుభూతి: పుస్తక సమీక్ష". Archived from the original on 2020-04-07.
- ↑ "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Archived from the original on 2018-02-04. Retrieved 2020-04-07.
బాహ్య లంకెలు
మార్చు- https://www.youtube.com/watch?v=t3E0Fel2VTs AnveshaNa Anubhuti - Mopidevi Krishnaswamy - Audiobook
- https://web.archive.org/web/20200407065220/http://ndl.iitkgp.ac.in/document/dlowRzlXNS9TU3hlS0E0alZ5K3lqVWpkZGxmZ1JvaTVrTk11a01LRUl5TT0