మండపాక
మండపాక, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామం.. ఇది మండల కేంద్రమైన తణుకు నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2390 ఇళ్లతో, 8454 జనాభాతో 1109 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4183, ఆడవారి సంఖ్య 4271. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1335 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 38. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588546.[2]
మండపాక | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°44′25.332″N 81°39′58.284″E / 16.74037000°N 81.66619000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | తణుకు |
విస్తీర్ణం | 11.09 కి.మీ2 (4.28 చ. మై) |
జనాభా (2011)[1] | 8,454 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,183 |
• స్త్రీలు | 4,271 |
• లింగ నిష్పత్తి | 1,021 |
• నివాసాలు | 2,390 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534218 |
2011 జనగణన కోడ్ | 588546 |
గ్రామ విశేషాలు
మార్చుమండపాక గ్రామం పలు విషయాలలో జిల్లా లోనే ఆదర్శ గ్రామంగా ఖ్యాతి గాంచింది. ఎంతో కాలంగా ఈ గ్రామం వ్యవసాయాధారమైన గ్రామం. ఈ గ్రామానికి చెందిన శ్రీ యల్లారమ్మ దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు గాంచింది. ప్రతి సంవత్సరం అమ్మవారికి జరుగు వసంతోత్సవాలు ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని వచ్చింది. మండపాక గ్రామానికే చెందిన శ్రీ చతుర్భుజ కేశవస్వామి ఆలయం (మండపాక) [3] ఎంతో పురాతన ఆలయం. గ్రామస్తులందరూ విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడంవల్ల వారి పిల్లలందరూ చక్కటి విద్యను అభ్యసించున్నారు. నవతరం ప్రతినిధులైన గ్రామ యువత గ్రామ సంస్కృతిని గౌరవిస్తూనే ప్రస్తుత ఆధునిక ప్రపంచం కల్పిస్తున్న అవకాశాలను సమర్థవంతంగా అంది పుచ్చుకుంటూ అనేక రంగాలలో రాణిస్తున్నారు. ప్రతీ సంవత్సరం జరుగు యల్లారమ్మ వసంతోత్సవాలకు ఈ గ్రామస్థులు ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఉన్ననూ ఈ ఉత్సవాలకు హాజరవడానికి ఎంతో ఉత్సుకత చూపడం విశేషం.
గ్రామ ప్రముఖులు
మార్చుసంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈ గ్రామంలోనే జన్మించాడు.1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
గ్రామ చరిత్ర, పేరు పుట్టుక
మార్చుపవిత్ర శివ, కేశవ క్షేత్రాలను కలిగివున్న ఈ గ్రామమే శ్రీ మాండవ్య మహాముని తపమాచరింఛిన ప్రదేశంగా స్థల పురాణం తెలుపుతుంది. ఈ గ్రామాన్ని మండవ్య క్షేత్రంగా పిలిచేవారు కాలక్రమంలో ఈ ప్రదేశాన్ని మండపాకగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రామంలోని శివాలయాన్ని సోమేశ్వరాలయం గాను, కేశవాలయాన్ని చతుర్భుజ కేశవాలయం గాను వ్యవహరించేవారు. ఈ కేశవాలయం పంచ కేశవ క్షేత్రాలలో ఒకటిగా పిలవబడుతుంది. మండపాక, ర్యాలి, తణుకు, దువ్వ, కటలపర్రు లలో వున్న కేశవాలయాలను పంచ కేశవ క్షేత్రాలుగా పిలుస్తారు. సోమేశ్వరాలయం గ్రామం మధ్యలో ఉండుట ఇక్కడి ప్రత్యేకత.
గణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8454.[4] ఇందులో పురుషుల సంఖ్య 4183, మహిళల సంఖ్య 4271, గ్రామంలో నివాస గృహాలు 2390 ఉన్నాయి.
గ్రామ సమస్యలు
మార్చు- వాతావరణ కాలుష్యం: పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తున్న ఈ గ్రామం అభివృద్ధి ఫలాలతో పాటు దాని వల్ల వచ్చే విష ఫలాలను కూడా భుజించవలసి వస్తుంది, దీనిలో ప్రధాన సమస్య గాలి కాలుష్యం. మండపాక పరిసర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమల వ్యర్దాల నుండి వస్తున్న గాలితో గ్రామం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ మధ్య కాలంలో కొంత మంది సహకారంతో ఈ సమస్యను కొంతవరకూ పరిష్కరించినప్పటికీ ఇంకా మిగిలే వుంది అని చెప్పక తప్పదు.
- ఇప్పటి వరకు ఎవరూ ఊహించని సమస్య ఇది: పచ్చని పశ్చిమ గోదావరి ఇప్పుడు ఆ 'పచ్చని' హోదాను కాపాడు కోవడం కోసం కష్టపడవలసి వస్తుంది, దీనికి ప్రధాన కారణం సాగు నీటి సమస్య. దాదాపుగా 30 సంవత్సరాలుగా మరిచిపోయిన సమస్య తిరిగి మొలకెత్తింది, కానీ మొలకెత్తిన పంటను ఎలా కాపాడుకోవాలో రైతన్నకు తెలియడంలేదు. చాలా పంటపొలాలు రెండో పంటకు సాగు నీరు లేక కాళీ అయ్యాయి. గ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు.
వ్యవసాయ రంగం
మార్చుమండపాక గ్రామ ప్రజలు ఎంతో కాలంగా వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించి, వరి చెరకు ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ యలమాటి వీరవెంకట సత్యనారాయణ, వీరి మిత్రబృంధం ఆద్వర్యంలోని శ్రీ గణేష్ వ్యసాయ కృషి విజ్ఞాన రైతు సంఘం సాధారణ రైతులకు మెరుగైన పంటలు పండించడానికి సాంకేతికంగా అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు.
పాడిపంటలు
- వరి
- చెరకు
- అపరాలు
- కోళ్ళ పెంపకం
- పశు పోషణ
దేవాలయాలు
మార్చుమండపాక గ్రామంలో నిర్మించిన కొన్ని దేవాలయాలు
- శ్రీ యల్లారమ్మ వారి దేవస్థానం
- శ్రీ కేశవస్వామి వారి దేవస్థానం
- శివాలయం
- శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం (పుట్ట)
- శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం, పెద్ద వీధి
- శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానం, కాపుల వీధి
- శ్రీ రామాలయం, చుండ్రు వారి వీధి
- శ్రీ రామాలయం,
ప్రత్వేక పండుగలు
మార్చుగ్రామ సంస్కృతికి ప్రతీకలు పండుగలు. గ్రామస్తులందరూ ప్రతీ పండుగనూ భక్తిశ్రద్ధలతో జరుపుకొందురు. వాటిలో కొన్ని ముఖ్యమైన పండుగలు...
- శ్రీ యల్లారమ్మ వసంతోత్సవాలు -సంబరం, సిరిబండి ఉత్సవం, గుడి తలుపులు మూయుట
- శ్రీ కృష్ణాష్టమి - ఉట్టి కొట్టుట
- కేశవశ్వామి తిరునాళ్ళు - తిరునాళ్ళు, రథోత్సవం, గరడ వాహన సేవ
పంట కాలువలు
మార్చుమండపాక గ్రామం లోని పంట పొలాలకు అవసరమైన సేద్యపు నీటి సరఫరా అత్యధిక శాతం కాలువల ద్వారా అందించబడు చున్నది.
- పెద్ద కాలువ
- పిల్ల కాలువ
- పొలుమేరు కాలువ
ప్రభుత్వ భవనాలు, ఆస్తులు
మార్చు- గ్రామ పంచాయితీ కార్యాలయం
- గ్రంథాలయం
- పశువైద్యశాల
ప్రధాన కూడల్లు
మార్చు- కేశవ స్వామి వారి గుడి వీధి
- యర్రమిల్లి వారి వీధి
- పెద్ద వీధి (పంచాయతి వీధి)
- చుండ్రు వారి వీధి
- నల్లూరి వారి వీధి
- బలుసు వారి వీధి
- యల్లారమ్మ వీధి
- మాదిగల వీధి
- మాలల వీధి
- వడ్డీల వీధి
- రజకుల వీధి
- నాయిబ్రాహ్మణుల వీధి
- కాపుల వీధి (సాయి పిచ్ఛుక వీధి)
- మేడూరి వారి వీధి
గ్రామ సరిహద్దులు
మార్చు- తూర్పున తణుకు పట్టణం
- పడమరన పొలిమేరు కాలువ
- దక్షిణాన వేల్పూరు గ్రామం
- ఉత్తరాన పైడిపర్రు గ్రామం
కొన్ని ఇంటి పేర్లు
మార్చు- బోడపాటి
- యర్రమిల్లి
- బలుసు
- నాదెళ్ల
- పరిమి
- చుండ్రు
- బూరుగుపల్లి
- యలమాటి
- ఆలపాటి
- వట్టికూటి
- సుంకర
- నిమ్మగడ్డ
- విడివాడ
- పెండ్యాల
- బేతిన
- ఆత్మకూరి
- నిడదవోలు
- వల్లూరి
- గజ్జరపు
- పిచికల
- గగ్గర
- పాతూరి
- పాలకుర్తి
- అడ్డా
- దేవరకొండ - దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈ వూరిలోనే జన్మించాడు
- ఉనమట్ల
- పేకెటి
- ఉండ్రాజవరపు
- జంగం
- చదలవాడ
- పుచ్చకాయల
- కత్తుల
- గంటి
- గుణ్ణం
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల పైడిపర్రులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు, పాలీటెక్నిక్‌లు, మేనేజిమెంటు కళాశాల, అనియత విద్యా కేంద్రం తణుకు లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పైడిపర్రు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల ఏలూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చుమండపాక (పకషిక) లో ఉన్న మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఐదుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చుమండపాక (పకషిక) లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 9 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చుమండపాక (పకషిక) లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 282 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 827 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 825 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చుమండపాక (పకషిక) లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 819 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 5 హెక్టార్ల
ఉత్పత్తి
మార్చుమండపాక (పకషిక) లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుపారిశ్రామిక ఉత్పత్తులు
మార్చుపంచదార, ప్రత్తి నూలు, రసాయనాలు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "Temples Reference Center - MandirNet". web.archive.org. 2003-09-20. Archived from the original on 2003-09-20. Retrieved 2022-10-14.
- ↑ http://www.censusindia.gov.in/pca/final_pca.aspx