కొక్కిలిగడ్డ

భారతదేశంలోని గ్రామం

కొక్కిలిగడ్డ, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 125., యస్.టీ.డీ.కోడ్ = 08671.

కొక్కిలిగడ్డ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కంచర్ల సరస్వతి
జనాభా (2011)
 - మొత్తం 4,893
 - పురుషులు 2,515
 - స్త్రీలు 2,378
 - గృహాల సంఖ్య 1,394
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలసవరించు

  1. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-26వ తేదీ నాడు నిర్వహించెదరు. [6]
  2. ఏడవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలస్థాయిని గత సంవత్సరం 8వ తరగతి వరకు పెంచారు. [7]
  3. ఈ పాఠశాలలో చదువుచున్న ఆరే మౌనిక మరియు కన్నా నందిని అను విద్యార్థునులు, నవంబరు/2015లో మచిలీపట్నంలో నిర్వహించిన జాతీయ మీన్స్-కం-మెరిట్ ఉపకార వేతనాల ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణులై, ఉపకార వేతనాలకు అర్హత సాధించారు. [9]

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

రక్షిత మంచినీటి పథకం:- ఈ పథకం క్రింద, 15 లక్షల రూపాయల వ్యయంతో, 40,000 లీటర్ల సామర్ధ్యంతో ఒక నీటి ట్యాంక్ ను ఏర్పాటు చేసారు. [8]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

  1. బండికోళ్ళంక గ్రామం, కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలై 31 న ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శత సంవత్సరాల ముమ్మనేని రాఘవయ్య 51వ సారి తన ఓటు హక్కును వినియోగించ్కున్నారు. 100 సంవత్సరాలవయస్సుకు చేరుకోవడంతో 2013 జూన్ లో ఈయనకు స్థానిక శ్రీ గంగాభ్రమరాంబాసమేత మల్లేశ్వరస్వామి వార్షిక కళ్యానోత్సవాలలో గ్రామస్థులూ, కుటుంబసభ్యులూ, బంధుమిత్రులూ ఘనసన్మానం చేశారు. ఎం.పీ., ఎం.ఎల్.ఏ., పంచాయతీ, పాలకేంద్రం, సహకారసంఘం వగైరా ఎన్నికలలో ప్రతిసారీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. [2]
  3. ఈ గ్రామపంచాయతీకి 2013 జూలై 31 న జరిగిన ఎన్నికలలో శ్రీమతి కంచర్ల సరస్వతి సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా భ్రమరాంబాసమేత మల్లేశ్వరస్వామి అలయంసవరించు

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరాకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగును.

ఈ ఆలయంలో కార్తీకమాసం చివరి నాలుగు రోజులూ, ప్రత్యేక పూజలు చేయుదురు.

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో శుక్ల చతుర్దశి నుండి ఐదురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు.అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. [4]&[5]

శ్రీ పోతురాజుస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామములో ముమ్మనేని రాఘవయ్య అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. ఈయన 105 సంవత్సరాల వయస్సులో, 2016, నవంబరు-25న వయోభారంతో, గ్రామములో కన్నుమూసినారు. [10]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4543.[2] ఇందులో పురుషుల సంఖ్య 2330, స్త్రీల సంఖ్య 2213, గ్రామంలో నివాసగృహాలు 1194 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1278 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,893 - పురుషుల సంఖ్య 2,515 - స్త్రీల సంఖ్య 2,378 - గృహాల సంఖ్య 1,394

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Kokkiligadda". Retrieved 26 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-09. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై 24; 16వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-3; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013, నవంబరు-30; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-11; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చి-26; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూలై-15; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూలై-23; 2వపేజీ. [9] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, నవంబరు-26; 2వపేజీ.