మోర్లవారిపాలెం
మోర్లవారిపాలెం బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 265. ఎస్.టి.డి.కోడ్ = 08648. [1]
మోర్లవారిపాలెం | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°00′N 80°05′E / 16.0°N 80.08°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామములోని విద్యా సౌకర్యాలు
మార్చుఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ కోడె కోటయ్య గారు. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-14వ తేదీ శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. [3]
గ్రామ పంచాయతీ
మార్చు- వేజెళ్ళవారిలంక గ్రామం, మోర్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మోర్ల వీరకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. [1]
- ఈ గ్రామ ప్రజలు 16 సంవత్సరాలుగా ఇంటి పన్ను కట్టడంలో ముందుంటున్నారు. 2013-14 సంవత్సరానికి 100% పన్నులు చెల్లించి ఈ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. [2]
- ఈ గ్రామ పంచాయతీ 2015-16 సంవతరానికి వసూలుచేయవలసిన మొత్తం రు. 1,40,115-00 ల మొత్తాన్నీ వసూలుచేసి, 100% పన్ను వసూలుచేసిన పంచాయతీగా రికార్డులకెక్కినది. [5]
గ్రామ విశేషాలు
మార్చురేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ అధ్వర్యంలో, అ కళాశాల విద్యార్థులు, ఈ గ్రామములో, 2016, జనవరి-2 నుండి, ఒక వారం రోజులపాటు ఒక సేవాశిబిరం నిర్వహించారు. [4]
ఈ గ్రామానికి చెందిన లుక్కా గోవిందశివనాగదేవ్ అను విద్యార్థి, జూన్-2017 లో ప్రకటించిన ఐ.ఐ.టి అడ్వాన్స్‌డ్ పత్రీక్షా ఫలితాలలో, జాతీయస్థాయిలో 28వ ర్యాంక్ సాధించాడు. ఓ.బి.సి. క్యాటగిరిలో ఐదవ ర్యాం్‌క్ సాధించాడు. ఏ.పి. ఎంసెట్‌లో 99వ ర్యాంక్ వచ్చింది. ఇతని తండ్రి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ముంబై ఐ.ఐ.టి.లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరాలని ఇతని అభిలాష. [6]
మూలాలు
మార్చు- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]