మోహన భోగరాజు
మోహన భోగరాజు వర్తమాన సినీ గాయని.[1][2]ఆమె పాడిన బుల్లెట్టు బండి పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
మోహన భోగరాజు | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినీ గాయని |
వాయిద్యాలు |
|
క్రియాశీల కాలం | 2013–ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చుమోహన సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాదులో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. దీంతో మోహన మూడేళ్ల వయసులో పాడటం నేర్చుకున్నారు. దీంతో ఎక్కడ ఏ సంగీతం కార్యక్రమం జరిగినా వాళ్లమ్మ అక్కడికి తీసుకెళ్లేది. రెండో తరగతిలో త్యాగరాయ గానసభలో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చిందని మోహన చెబుతారు.
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్‌లో "సయ్యామ మాసం" అనే పాట ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు వర్క్ ఎట్ హోమ్ చేశారు. తర్వాత సంగీతము కరెక్ట్ అని పూర్తిగా ఇటువైపు వచ్చేశారు.
మోహనకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ లేనప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశారు. ఎన్నెన్నో అవమానాలు, నిరాశలు, వైఫల్యాలను చవిచూశాకే విజయాల బాట పట్టారామె. సినిమాలకు ప్రయత్నం చేసే క్రమంలో ఈవిడ ఎం. ఎం. కీరవాణి గ్రూపులో చేరారు. అక్కడ చేరాక ఏమో గుర్రం ఎగరావచ్చుకి కోరస్, రీ-రికార్డింగ్ పాడా. తర్వాత దిక్కులు చూడకు రామయ్యకు సోలో సాంగ్ పాడే అవ కాశం వచ్చింది. ఆయన దగ్గర రికార్డ్ అయిన మొదటి పాట బాహుబలి సినిమాకే. ప్రభాస్ పుట్టిన రోజుకి విడుదల చేసిన మొదటి టీజర్ అది. నిజానికి ఆ పాట బాహుబలి కోసమని అప్పటి వరకు మోహన కు తెలి యదట. ఆగ్రూపు సాంగ్ తర్వాత అదే సినిమాలో మనోహరీ పాటతెలుగు, తమిళం లో, బాహుబలి-2లో ఒరే ఒరూరిల్ ఒరేఒర్ రాజా (హంసనావ) పాట తమిళ వెర్షనలో పాడే అవకాశాన్ని మోహన దక్కించుకున్నారు.
మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు. సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మోహన తక్కువ సమయంలోనే గుర్తింపునిచ్చే పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలెన్నో సినిమాల విజయంలో కీలకం కావడం విశేషం.[3]
డిస్కోగ్రఫీ
మార్చుమూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (October 8, 2017). "మోహన రాగం". Archived from the original on 15 July 2019. Retrieved 15 July 2019.
- ↑ Eenadu (18 April 2021). "'మోహన' గానానికి క్రేజ్ పెరిగిన వేళ - intersting facts about celebrity singer mohana bhogaraju". Archived from the original on 21 ఏప్రిల్ 2021. Retrieved 21 April 2021.
- ↑ EENADU (25 July 2021). "సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.