జై శ్రీరామ్ (2013 సినిమా)

2013లో బాలాజీ ఎన్. సాయి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం

జై శ్రీరామ్ 2013, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉదయ్‌కిరణ్, రేష్మా రాథోడ్, నాగినీడు, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు తదితరులు నటించగా, ఢాఖే సంగీతం అందించాడు.[1][2]

జై శ్రీరామ్
జై శ్రీరామ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసాయి బాలాజీ
రచనవరప్రసాద్ నక్కల (పాటలు)
స్క్రీన్ ప్లేబాలాజీ ఎన్. సాయి
నిర్మాతతేళ్ళ రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్
తారాగణంఉదయ్‌కిరణ్, రేష్మా రాథోడ్,
ఛాయాగ్రహణంమురళి, శివ
కూర్పుబాలాజీ ఎన్. సాయి
సంగీతంఢాఖే
నిర్మాణ
సంస్థ
ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
11 ఏప్రిల్ 2013 (2013-04-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరామ్ శ్రీనివాస్ (ఉదయ్ కిరణ్) నీతి, నిజాయితీ గల ఒక పొలీస్ ఆఫీసర్. అతను నిజాయితీగా ఉండడం వల్ల చింతామణి (గౌతంరాజు), అతని కొడుకు (ఆదిత్య మీనన్)తో గొడవ జరుగుతుంది. చింతామణి అవినీతి రాజకీయ నాయకుడు, అలాగే అనాధలను, సొంతంగా ఇల్లు లేని వారిని బందించి వారి అవయవాలను తీసి వ్యాపారం చేస్తువుంటాడు. చింతామణి చేసే అరాచకాన్ని అంతం చేయాలనుకున్న శ్రీరామ్, పోలీస్ కమీషనర్ (చలపతి రావు) ఆర్డర్ కి వ్యతిరేకంగా నడుచుకుంటాడు. కానీ అతని టీంలోనే ఉన్న అవినీతిపరులైన సహా వుద్యోగుల నుండి అనుకోని కొన్ని అవాంతరాలను ఎదురై, శ్రీరామ్ జీవితం నాశనం అవుతుంది. అతని ఫ్యామిలీని చంపేస్తారు. అప్పుడు హీరో చింతామణిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పటినుండి హీరో చింతామణిని అతని గ్యాంగ్ లోని ఒక్కొక్కరినీ వేటాడి వేటాడి చంపుతుంటాడు. అలాగే అతనికి, వృత్తికి ద్రోహం చేసిన సహా ఉద్యోగులను కూడా చంపేస్తాడు.[3]

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాయి బాలాజీ
  • నిర్మాత: తేళ్ళ రమేష్, ఎన్.సి.హెచ్. రాజేష్
  • పాటలు: వరప్రసాద్ నక్కల
  • సంగీతం: ఢాఖే
  • ఛాయాగ్రహణం: మురళి, శివ
  • కూర్పు: బాలాజీ ఎన్. సాయి
  • నిర్మాణ సంస్థ: ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుSinger(s) నిడివి
1. "కైపీకు ఒళ్ళు"  భార్గవి పిళ్ళై  
2. "భాగ భాగ" (మేల్ వర్షన్)హేమచంద్ర  
3. "భాగ భాగ" (డ్యూయేట్)హేమచంద్ర, తేజస్విని  
4. "సయ్యసమమసం"  కౌషిక్ కళ్యాణ్, శృతి, శ్రావణి, మోహన భోగరాజు  
5. "జై శ్రీరామ్"  శ్రీ సౌమ్య  
6. "చక చౌకమణి"  తేజస్విని  
7. "ఒకటి రెండు మూడు"  ఉమా నేహ  

ఇతర వివరాలు

మార్చు
  1. ఈ చిత్రం ప్లాటినం డిస్కు వేడుకలను జరుపుకుంది.[4]
  2. ఈ సినిమాలోని ఉదయ్ కిరణ్ నటనను, సినిమాటోగ్రఫీని మెచ్చుకుంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా మంచి సమీక్ష ఇచ్చింది.[5][6][7]

మూలాలు

మార్చు
  1. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
  2. తెలుగు మిర్చి, సినిమా. "రివ్యూ: జై శ్రీరామ్". www.telugumirchi.com. స్వాతి. Retrieved 11 July 2019.
  3. 123 తెలుగు, సినిమా సమీక్ష. "సమీక్ష : జై శ్రీరామ్". www.123telugu.com. నగేష్ మేకల. Retrieved 11 July 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Uday Kiran's 'Jai Sriram' Platinum disc function - Telugu Movie News". Indiaglitz.com. Archived from the original on 13 ఏప్రిల్ 2013. Retrieved 11 July 2019.
  5. "Uday Kiran's Jai Sriram platinum disc celebrations - Tv9". YouTube. Retrieved 11 July 2019.
  6. "Jai Sriram - Movie review". Sakshi Post. 20 డిసెంబరు 2012. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 11 జూలై 2019.
  7. "Jai Sriram movie review: Wallpaper, Story, Trailer at Times of India". Timesofindia.indiatimes.com. 29 April 2013. Retrieved 11 July 2019.

ఇతర లంకెలు

మార్చు