మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ


మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సహాయ ప్రధాన కార్యదర్శి, తామిరే మిల్లత్ రాష్ట్ర అధ్యక్షుడు.[1] ఖురేషీగారు మౌలానాగా దాదాపు 25 సంవత్సరాలపాటు తన సేవలను అందించారు. మక్కా మసీదులో జరిగే ఖుత్భాకు ఆయన ప్రసిద్ధిగాంచారు. దానం చేయడం (Qir’ath) గురించి ఆయన చేసిన ఉపన్యాసాలు ఆయనకు ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టాయి. జామియా-నిజామియాకు ఆయన డిప్యుటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసాడు.[2]

మౌలానా అబ్దుల్ రహీం ఖురేషీ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 06 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా

జీవిత విశేషాలు మార్చు

1935 సెప్టెంబర్ 19 న దుండిగల్‌లో జన్మించిన ఆయన గత 24 ఏళ్లుగా మక్కా మసీదు కతీబ్‌గా కొనసాగుతున్నారు. అల్ హజ్ అబ్దుల్ రహీంకు రెండో కుమారుడైన అబ్దుల్లా ఖురేషీ మెట్రిక్‌లేషన్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి, డిగ్రీ ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పూర్తి చేశారు. జామే నిజామియా నుంచి ఫజిల్ కోర్సు పూర్తి చేశారు. ‘దావతుల్ ఇస్లామియా అల్ ముసైరా ఫిల్ హిందూ’పై ఎంఫిల్ చేశారు.[3] ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ఖురేషి 1950లో స్థాపించిన తామిరే మిల్లత్ (నాటి బజ్మేఅహెబాబ్ సంస్థ) లో చురుకుగా పనిచేశారు. ఖలీలుల్లా హుస్సేనీ మరణానంతరం తామిరే మిల్లత్ సంస్థ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు[4].

ముస్లిం మేధావిగా గుర్తింపు పొందిన ఖురేషి యునైటెడ్ ముస్లిం ఫోరం (యూఎంఎఫ్) అధ్యక్షుడిగా, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంజేఏసీ) కన్వీనర్‌గా, మిల్లీ కౌన్సిల్ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. బాబ్రీమసీదు కేసులో ఖురేషి కీలకపాత్ర వహించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, గౌస్‌ఖామోషీ, మౌలానా హమీదుద్దీన్ ఆఖిల్ హుస్సామీలాంటి నాటి ప్రముఖనేతలతో ఖురేషి కలిసి పనిచేశారు. ముస్లిం సమాజానికి చేసిన సేవలకు గాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖురేషి గుర్తింపు పొందారు.[5]

2015 మే నెలలో ఆయన రాముడి జన్మస్థలి గురించి ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించారు. రాముడు అయోధ్యలో జన్మించలేదనీ, ప్రస్తుత పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయల్‌ ఖాన్‌ జిల్లా రెహ్మాన్‌ ఢేరి పట్టణంలో పుట్టినట్లుగా పేర్కొన్నారు.[6]

మరణం మార్చు

మౌలానా అబ్దుల్ రహీం ఖురేషి (81) జనవరి 14 2016 గురువారం, తెల్లవారుజామున కన్నుమూశారు

మూలాలు మార్చు

  1. మక్కా మసీద్ ఇమామ్ హాఫీజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి అజ్హరీ మృతి By admin@bhaarat.com | Publish Date: Dec 8 2015 5:10PM | Updated Date: Dec 8 2015 5:10PM[permanent dead link]
  2. మక్కా మసీద్ ఇమామ్ హాఫీజ్ మౌలానా అబ్దుల్లా ఖురేషి అజ్హరీ మృతి[permanent dead link]
  3. మక్కా మసీదు కతీబ్ కన్నుమూత Sakshi | Updated: December 09, 2015 01:31 (IST)
  4. మౌలానా ఖురేషి రహీం కన్నుమూత[permanent dead link]
  5. మౌలానా ఖురేషి కన్నుమూత.. PUBLISHED: FRI,JANUARY 15, 2016 12:47 AM, నమస్తే తెలంగాణ[permanent dead link]
  6. "Ram Janmabhoomi is in Pakistan, says AIMPLB member". The Times of India. May 5, 2015. Retrieved 15 January 2016.

ఇతర లింకులు మార్చు