మ్యాక్‌బుక్ ఎయిర్ యాపిల్ తయారు చేసిన ఒక అతిచిన్న (ultra-portable) ల్యాప్‌టాప్ కంప్యూటర్. యాపిల్ CEO స్టీవ్ జాబ్స్ జనవరి 15, 2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్‌లో దీన్ని విడుదల చేసాడు. ఇది కేవలం 1.36 కిలోల బరువు మాత్రమే ఉంది. దీని అతి ఎక్కువ మందము 0.76 అంగుళాలు (1.93 సెం. మి.), అతి తక్కువ మందము 0.16 అంగుళాలు (0.4 సెం. మి.) మాత్రమే. ప్రస్తుతం తయారు చేయబడే అన్ని ల్యాప్ టాపులకన్నా మ్యాక్‌బుక్ ఎయిర్ అది అతి తక్కువ మందం కలిగినది. [1]

మ్యాక్‌బుక్ ఎయిర్
MacBook Air black.jpg
2008 మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్ లో మ్యాక్‌బుక్ఎయిర్
అభివృద్ధిదారుడుయాపిల్ ఇంకోర్పరేటెడ్
రకంల్యాప్‌టాప్
విడుదల తేదీజనవరి 29, 2008
పరిచయ ధరరూ. 96,100
ఆపరేటింగ్ సిస్టంమ్యాక్ ఓయస్ టెన్ వి10.5 "లియొపార్డ్"
సి.పి.యుఇంటెల్ కోర్ టూ డ్యుఓ 1.6 లేదా 1.8 GHz
వెబ్‌సైట్Apple.com/MacBookAir

సంగ్రహముసవరించు

మ్యాక్‌బుక్ ఎయిర్ యొక్క మందము, బరువు తగ్గిచ్చడానికి యాపిల్ కొన్ని ఫీచర్లను తీసివేసింది. పవర్ బుక్ 2400సి తరువాత యాపిల్ సీడీ/డీవీడీ డ్రైవ్ లేకుండా తయారుచేసిన మొదటి ల్యాప్‌టాప్ ఇది.[2] అవసరమైతే ఎక్స్టెర్నల్ డ్రైవ్ కొనుకోవచ్చు, లేకపోతే మ్యాక్‌బుక్ ఎయిర్ తో పాటే వచ్చే రిమోట్ డిస్క్ సాఫ్ట్ వేర్ ద్వారా ఇంకోక కంప్యూటర్ డ్రైవ్ ని వాడుకోవచ్చు.[3] సెక్యూరిటి స్లాటు, ఈథర్నెట్ పోర్టు కూడా లేవు. కాకపోతే USB నుండి ఈథర్నెట్ కు అడాప్టర్ కొనుక్కోవచ్చు. ఇవన్ని కాకుండా మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఒక USB స్లాటు మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చే ల్యాప్ టాపుల్లో రెండు కంటే ఎక్కువ USB స్లాటులు ఉండడం సాధారణం.

మ్యాక్‌బుక్ ఎయిర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ తో వచ్చే మొదటి ల్యాప్‌టాప్ (యాపిల్ తయారు చేసిన ల్యాప్ టాపుల్లో).[4] ఇంటెల్ కోర్ టూ డ్యుఓ ప్రాసెసర్ ని మ్యాక్‌బుక్ ఎయిర్ కోసం ప్రత్యేకంగా చిన్నది చేసారు. మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఉండే ప్రాససెర్ సాధారణంగా ఉండె ప్రాససెర్లకన్నా 60శాతం చిన్నది.[5] మ్యాక్‌బుక్ ఎయిర్ కి మ్యాక్‌బుక్ ప్రో తరహా మ్యాగ్నెటిచ్ లాచ్ సిస్టెమ్ (అయస్కాంత 'లాచె' విధనము (Magnetic Latch System)), అల్యూమినియం కేసింగ్ ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్న ట్రాక్ పేడ్ (trackpad) ఐ-ఫోన్ వంటి ట్రాక్ పేడ్ భంగిమలు (trackpad gestures) ఉన్నాయి. ఇది మునుపటి మ్యాక్‌బుక్ ట్రాక్ పేడ్స్ (trackpads) కంటే అభివృద్ధి చేయబడినవి.

మ్యాక్‌బుక్ ఎయిర్ మ్యాక్ ఓయస్ టెన్ వి10.5 "లియోపార్డ్" తో వస్తుంది. లియొపార్డ్ లో టైమ్ మెషిన్, క్విక్ లుక్, స్పేసెస్, స్పాట్ లైట్, డాష్ బోర్డ్, మెయిల్, ఐచాట్, సఫారి, అడ్రెస్ బుక్, క్విక్ టైమ్, ఐకాల్, డీవీడీ ప్లేయర్, ఫోటో బూత్, ఫ్రంట్ రో, ఐట్యూన్స్, ఎక్స్ కోడ్ డెవెలపర్ టూల్స్ ఉన్నాయి. దీంట్లో ఐలైఫ్ '08 కూడా ఉంది. ఐలైఫ్ లో ఐఫోటో, ఐమూవీ, ఐడీవీడీ, ఐవెబ్, గరాజ్ బాండ్ ఉంటాయి. 30 రోజుల పరీక్షా వెర్సన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫర్ మ్యాక్, ఐవర్క్ కూడా ఉంటాయి.

పరిమాణములుసవరించు

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ని "ప్రపంచంలో అతి తక్కువ మందము కల ల్యాప్‌టాప్" (world's thinnest notebook) అనీ, "అతి తక్కువ మందము 0.16 అంగుళాలు మాత్రమే, అతి యెక్కువ మందము 0.76 అంగుళాలు మిగిలిన ల్యాప్ టాపుల్లో అతి తక్కువ మందము కంటే తక్కువ" (మందం 0.16 అంగుళాలు, ఎత్తు 0.76 అంగుళాలు).[6] అని పేర్కొనింది. అది సోనీ TZ సీరీస్ లాంటి వాటితో పోలిస్తే, అని జాబ్స్ తాను మ్యాక్ వర్ల్డ్ కాన్ఫరెంస్ లో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు.[7] మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే తక్కువ మందము తో ఇంతక ముంది ల్యాప్ టాపులు తాయారు చేయబడ్డాయి. 2002లో టొషీబా, పోర్టేజే 2000 (Portégé 2000) అనే ల్యాప్‌టాప్ తయారు చేసింది. దాని అతి ఎక్కువ మందము కేవలం 0.72 అంగుళాలు మాత్రమే.[8] 1997లో మిట్సుబిషి, హెచ్. పి. కలిసి పీడియోన్ అనే ల్యాప్‌టాప్ తయారు చేసాయి. దాని అతి యెక్కువ మందము కేవలం 0.72 అంగుళాలు మాత్రమే.[9]

రిమోట్ డిస్క్సవరించు

 
మ్యాక్‌బుక్ ఎయిర్ సూపర్ డ్రైవ్. (కావాలనుకుంటే కొనుక్కోవచ్చు)

మ్యాక్‌బుక్ ఎయిర్ వైర్లు లేకుండా (wirelessly) వేరొక కంప్యూటర్ సీడీ/డీవీడీ ని వాడుకోగలదు. ఆ ఇంకొక కంప్యూటర్ లో మ్యాచ్ ఓయస్ టెన్ కాని మైక్రోసాఫ్ట్ విండోస్ కాని ఉండోచ్చు. దీని కొరకు సీడీ/డీవీడీ డ్రైవ్ ఉన్న కంప్యూటర్ లో రిమోట్ డిస్క్ సాఫ్ట్ వేర్ ఇంస్టాల్ చేయాలి. దీనితో ఏదైనా ఒక సీడీ నుండి కాని డీవీడీ నుండి కాను ఏదైనా సాఫ్ట్ వేర్ మ్యాక్‌బుక్ ఎయిర్ లోకి ఇంస్టాల్ చేయవచ్చు.[10][11] దీంతో మ్యాక్‌బుక్ ఎయిర్ లో ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఉన్న సాఫ్ట్ వేర్ (pre-installed software) ని తిరిగి ఇంస్టాల్ చేసుకోవచ్చు (ఒక వేళ తీసేసుంటే).[12] రిమోట్ డిస్క్ తో సీడీ నుండి బూట్ కూడా చేయవచ్చును. [13] ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంకొక కంప్యూటర్ డ్రైవ్ ని ఏ అడ్డంకీ లేకుండా వాడుకోవచ్చు.

వాడుకరి-సేవలు (User-serviceability)సవరించు

మ్యాక్‌బుక్ ఎయిర్ లో వాడుకరి (end user) తనంతట తాను మార్చ గలిగిన భాగాలు ఏవీ లేవు. హార్డ్ డిస్క్, ర్యాం, బ్యాటరీ అన్నీ అల్యూమినియం కేసింగో seal చేయబడి ఉన్నాయి. ర్యాం ని మథర్‌బోర్డ్ కే అతికించేసారు.[14] హార్డ్ డిస్క్ ని అతికించలేదు కాని మార్చడం కష్టం.[15] యాపిల్, వారంటి అయిపోయిన తరువాత, డబ్బు తీసుకొని బ్యాటరి మార్చిస్తుంది.[16] వాడుకర్లు బ్యాటరి తామే మార్చుకోవచ్చని కొంత మంది చెబుతున్నారు ([1][permanent dead link]). కాని ఇది ల్యాప్‌టాప్ వారంటీ తొలగిస్తుందో లెదో తెలీదు.[17]

ప్రాముఖ్యతలుసవరించు

విడి భాగం (Component) 2008లో[18]
స్క్రీను 13.3 అంగుళాల గ్లొసీ (glossy) LED-backlit TFT LCD వెడల్పాటి స్క్రీను, 1280x800 పిక్సెళ్ళ రెజెల్యూషన్ (resolution)
గ్రాఫిక్స్ ఇంటెల్ GMA X3100 గ్రాఫిక్స్ కార్డు. 144 MB వీడియో ర్యాం. ప్రధాన మెమరీ పంచుకుని
హార్డ్ డిస్క్ 80 GB ATAహార్డ్ డిస్క్
64 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్. కావాలంటే తీసుకోవచ్చు
ప్రాసెసర్ 1.6 GHz ఇంటెల్ కోర్ టూ డ్యుఓ మెరొం,[19][20] with 800 MHz FSB
1.8 GHz కోర్ టూ డ్యుఓ కావాలంటే తీసుకోవచ్చు
ర్యాం 2 GB PC2-5300 DDR2 SDRAM మథర్‌బోర్డ్ కు అతికించేసి ఉంటుంది
తంతి-రహిత నెట్‌వర్కింగ్ సమగ్రమైన ఏర్‌పోర్ట్ ఎక్స్‌ట్రీమ్ సపోర్ట్స్ 802.11a/b/g/draft n
ఈథర్‌నెట్ స్లాటు లేదు, USB నుండి ఈథర్నెట్ అడాప్టర్ కావాలనుకుంటే కొనుక్కోవాచ్చు
సీడీ/డీవీడీ డ్రైవ్ లేదు, కావాలనుకుంటే ఎక్స్టెర్నల్ సూపర్ డ్రైవె కొనుక్కోవచ్చు
కెమెరా ఐసైట్, 640×480 పిక్సెళ్ళ resolution
బ్యాటరీ 37 W-Hr లీథియమ్ అయాన్ పాలిమర్ బ్యాటరీ
5 గంటలు
పరిమాణాలు 22.7 cm పొడవు × 32.4 cm  వెడల్పు × 0.4–1.94 cm మందము
8.9 in పొడవు × 12.74 in వెడల్పు × 0.16–0.76 in మందము
1.36 కిలోలు
బ్లూటూత్ బిల్ట్‌ఇన్ (Built-in) (2.1+Enhanced Data Rate)
స్లాటులు 1× USB 2.0
మైక్రో-DVI వీడియో పోర్ట్ ( వీ.జీ.ఏ. లేదా డి.వి.ఐ. మానిటర్ ల కొరకు అడాప్టర్లు కలుపబడినవి, వీటి రెజల్యూషన్ 1920×1200 పిక్సెళ్ళు)
1× ఆడియో ఔట్ (3.5 mm stereo jack)
ఆడియో 1× మైకు
1× మోనో స్పీకర్
స్టీరియో కావాలనుకుంటే వేరే స్పీకర్లు పెట్టుకోవాలి
కీబోర్డ్ బ్యాక్‌లిట్ పూర్తి సైజు కీబోర్డు ఆంబియంట్ లైట్ సెన్సర్ తో సహా.
ట్రాక్‌పాడ్ ఐఫోన్ లాంటి బహు-స్పర్శా భంగిమల సహాయాలతో

మూలాలుసవరించు

 1. Michael Kanellos (2008-01-15). "MacBook Air: Not the thinnest notebook ever". CNET. Retrieved ఫిబ్రవరి 26. Cite web requires |website= (help); Check date values in: |accessdate= (help)
 2. Apple Macintosh 2400c/180 specs, EveryMac, తీసిన తేది: జనవరి 2008.
 3. MacBook wireless specifications Archived 2008-07-25 at the Wayback Machine, యాపిల్, తీసిన తేది: జనవరి 2008.
 4. Choney, Suzanne (2008-01-24). "Lighter laptops move to flash-based drives". Newsweek. Retrieved 2008-01-24. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 5. Cohen, Peter (2008-01-15). "Apple introduces MacBook Air". Macworld. Retrieved 2008-01-21. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 6. "Apple Introduces MacBook Air—The World's Thinnest Notebook". మూలం నుండి 2008-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-16. Cite web requires |website= (help)
 7. Apple announces MacBook Air, HD movie rentals, Apple TV 2.0 at Macworld keynote, Eric Bangeman, ArsTechnica, 15 January 2008.
 8. Official Portege 2000 Data Sheet, టొషీబా.
 9. MacBook Air: Not the thinnest notebook ever, Michael Kanellos, CNet, 15 January 2008.
 10. Yager, Tom. "MacBook Air, a detailed preview". Infoworld. మూలం నుండి 2008-06-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-18. Cite web requires |website= (help)
 11. "MacBook Air". Apple Inc. మూలం నుండి 2008-07-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-15. Cite web requires |website= (help)
 12. "MacBook Air - Guided Tour". Apple Inc. మూలం నుండి 2008-05-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-15. Cite web requires |website= (help)
 13. Gruber, John (2008-01-15). "The MacBook Air". Daring Fireball. Retrieved 2008-01-15. More than one of |author= and |last= specified (help); Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 14. "MacBook Air's Fatal Flaw: Battery, RAM, HD Sealed Like an iPod". Gizmodo. 2008-01-15. Retrieved 2008-01-15. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 15. "First Look at the MacBook Air". iFixIt. 2008-02-01. Retrieved 2008-02-01. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 16. "MacBook Air Out-of-Warranty Battery Replacement Program". యాపిల్ ఇంకోర్పరేటెడ్. మూలం నుండి 2011-04-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-15. Cite web requires |website= (help)
 17. "Sources: MacBook Air battery replacements take only minutes". AppleInsider. 2008-01-18. Retrieved 2008-01-19. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 18. "MacBook Air - Technical Specifications". Apple Inc. Retrieved 2008-01-15. Cite web requires |website= (help)
 19. Lal Shimpi, Anand (2008-01-15). "Apple's MacBook Air: Uncovering Intel's Custom CPU for Apple". AnandTech. Retrieved 2008-01-15. Cite web requires |website= (help); Check date values in: |date= (help)
 20. Anand Lal Shimpi (2008-01-17). "The MacBook Air CPU Mystery: More Details Revealed". Anandtech.com. Retrieved 2008-01-19. Check date values in: |date= (help)