మ్యాడ్ (2023 తెలుగు సినిమా)
మ్యాడ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 31న విడుదల చేశారు.[1][2][3]
మ్యాడ్ | |
---|---|
దర్శకత్వం | కల్యాణ్ శంకర్ |
రచన | కల్యాణ్ శంకర్ |
అడిషనల్ స్క్రీన్ ప్లే | ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కళ్లపల్లి |
నిర్మాత | హారిక సూర్యదేవర సాయిసౌజన్య |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
విడుదల తేదీs | 10 మే 2023(థియేటర్) 3 నవంబరు 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- రామ్ నితిన్
- నార్నె నితిన్
- సంగీత్ శోభన్
- గౌరీ ప్రియా రెడ్డి
- అననతిక సనీల్ కుమార్
- గోపికా ఉద్యన్
- రఘు బాబు
- రచ్చ రవి
- ఐరేని మురళీధర్ గౌడ్
- విష్ణు
- ఆంథోనీ
- శ్రీకాంత్ రెడ్డి
- కె.వి. అనుదీప్ (అతిధి పాత్ర)
పాటల జాబితా
మార్చు- ప్రౌడ్ సే , రచన: రఘురాం , గానం.నకష అజీజ్ , భీమ్స్సి సీసిరోలియో,
- నువ్వు నవ్వుకుంటూ, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. కపిల్ కపీలాన్
- కాలేజీ పాప , రచన: కాసర్ల శ్యామ్, గానం. భీమ్స్ సీసిరోలియో , వర్మ , కీర్తన శర్మ.
కథ
మార్చుమనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్‌శోభన్) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అవుతారు. ఈ ముగ్గురి లైఫ్ లోకి జెన్నీ(అననతిక), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్) వస్తారు.ఈ ముగ్గురి అమ్మాయిల వల్ల అశోక్, మనోజ్, దామోదర్ జీవితాలు ఎలా మారిపోయాయి ? ఎలాంటి మలుపులు తిరిగాయి ? ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ కు మ్యాడ్ అనే పేరు ఎందుకు వచ్చింది? సీనియర్స్‌తో పాటు మరో కాలేజీతో ఈ ముగ్గురికి ఎలాంటి గొడవలు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[4]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
- నిర్మాత: హారిక సూర్యదేవర, సాయిసౌజన్య
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కల్యాణ్ శంకర్
- సంగీతం: భీమ్స్ సిసిరోలియో
- సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి
- ఎడిటర్ : నవీన్ నూలి
- ఆర్ట్ డైరెక్టర్ : రామ్ అరసవిల్లి
- అడిషనల్ స్క్రీన్‌ప్లే: ప్రవీణ్ పట్టు & ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
- ఫైట్ మాస్టర్ : కరుణాకర్
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (31 August 2023). "MAD: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది డెబ్యూ సినిమా రెడీ!". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
- ↑ A. B. P. Desam (1 September 2023). "'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన 'మ్యాడ్'!". Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
- ↑ NTV Telugu (1 September 2023). "MAD: 'మ్యాడ్'గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు." Archived from the original on 3 September 2023. Retrieved 3 September 2023.
- ↑ Eenadu (6 October 2023). "రివ్యూ: మ్యాడ్.. సరికొత్త యూత్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' ఎలా ఉంది?". Archived from the original on 25 October 2023. Retrieved 25 October 2023.