మ‌నుభాయ్ ప‌టేల్ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి.

జీవిత విశేషాలుసవరించు

పిన్న వ‌య‌సులోనూ స్వాతంత్ర్యోద్య‌మంలో పాల్గొన్న మ‌నూభాయ్ ప‌టేల్ స్వాతంత్ర్యానంత‌రం కాంగ్రెస్ సేవాద‌ళ్‌లో చురుకుగా ప‌ని చేశారు. 1962లో సావ్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.రాష్ట్ర మంత్రిగా కూడా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనంత‌రం 1967లో వ‌డోద‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. మాజీ ప్ర‌ధాని మొరార్జీ దేశాయ్‌కు స‌న్నిహితుడైన మ‌నూభాయ్ ప‌టేల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో 13 నెల‌లు జైలు జీవితం గ‌డిపారు.[1]

మరణంసవరించు

94 ఏళ్ల మ‌నూభాయ్ ప‌టేల్ గ‌త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతూ శుక్ర‌వారం మార్చి 27 2015 అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత తుది శ్వాస విడిచారు. ఆయ‌న‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మూలాలుసవరించు

  1. "ప్ర‌ముఖ గాంధేయ‌వాది మ‌నూభాయ్ ప‌టేల్ క‌న్నుమూత‌". Archived from the original on 2015-08-15. Retrieved 2015-08-15.

ఇతర లింకులుసవరించు