యదునాథ్ థత్తే

మరాఠీ పాత్రికేయుడు, సంపాదకుడు, జీవితచరిత్ర రచయిత, సామాజిక కార్యకర్త మరియు సామ్యవాద నాయకుడు
(యదునాథ్ థట్టే నుండి దారిమార్పు చెందింది)

యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే ( 1922 అక్టోబరు 5 - 1998 మే 10) మరాఠీ పాత్రికేయుడు, సంపాదకుడు, సామాజిక కార్యకర్త, సామ్యవాద నాయకుడు.[1][2]

యదునాథ్ థత్తే
జననం(1922-10-05)1922 అక్టోబరు 5
మరణం1998 మే 10(1998-05-10) (వయసు 75)
వృత్తిభారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, సంపాదకుడు

యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే 1922, అక్టోబరు 5న మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలోని యెయోలాలో జన్మించాడు. మహారాష్ట్ర నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకులలో ఈ యదునాథ్ ఒకరు. 1944లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్ని ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాడు.[2]

వృత్తిరంగం

మార్చు

1956 నుండి 1982 వరకు సాధన అనే సోషలిస్ట్ వారపత్రికలో, రాష్ట్ర సేవాదళంలో సుదీర్ఘకాలం పనిచేశాడు.[2]

రచనలు

మార్చు

హోమీ జహంగీర్ భాభా, నీల్స్ బోర్, సివి రామన్, ఎర్నెస్ట్ ఆర్. ఫోర్డ్, సతీష్ చంద్ర దాస్‌గుప్తా, జగదీష్ చంద్ర బోస్ మొదలైన ముఖ్య వ్యక్తుల జీవిత చరిత్రలతోపాటు, పలు పుస్తకాలు రాశాడు:

  • మస్తకి హిమాలయ, అంతరంగి అంగర (1990)
  • కోర్ ఫారర్ (1990)
  • ఫులాటే నిఖారా (1980)
  • సదానంద్ (1978)
  • సరహద్ద గాంధీ (1969)
  • అపల మనా, అపల అభిమాన (1966)
  • అక్షయపాత్ర (1962)
  • గహినా

యదునాథ్ దత్తాత్రేయ్ థత్తే 1988, మే 10న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. Saha, Muralidhara Ba (2004). Yadunatha Thatte : savyasācī patrakāra va samājasevaka (in మరాఠీ). Mumbai: Maharashtra Rajya Sahitya ani Sanskriti mandal. OCLC 57393876.
  2. 2.0 2.1 2.2 "Socialist leader Thatte dead". Indian Express. 1998-05-11. Retrieved 2021-09-03.[permanent dead link] ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "IE" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు