యమలీల 2 2014, నవంబరు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్వి ఫిల్మ్స్ పతాకంపై డా. కెవి. సతీష్, కె. అచ్చిరెడ్డి నిర్మాణ సారథ్యంలో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. కెవి సతీష్, దియా నికోలస్, మోహన్ బాబు, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా, ఎస్.వి. కృష్ణారెడ్డి సంగీతం అందించాడు.[1]

యమలీల 2
Yamaleela2 Movie Poster.jpg
యమలీల 2 సినిమా పోస్టర్
యమలీల 2
దర్శకత్వంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాతడా. కెవి. సతీష్
కె. అచ్చిరెడ్డి
నటవర్గండా. కెవి సతీష్
దియా నికోలస్
మోహన్ బాబు
బ్రహ్మానందం
సంగీతంఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ
సంస్థ
కృష్వి ఫిల్మ్స్
విడుదల తేదీలు
2014 నవంబరు 28 (2014-11-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

యమలోకంలో యముడు (మోహన్‌బాబు) గాంధర్వ కన్య పాటలు పాడుతుంటే పరవశిస్తాడు. అది భూలోకంలోని మానస సరోవరం నుంచి వస్తుందని చిత్రగుప్తుడు(బ్రహ్మానందం) చెప్పడంతో కిందకి వస్తారు. వస్తూ భవిష్యవాణి గ్రంథాన్ని తెస్తారు. ఇక వీరిని చూసి గంధర్వ కన్యలు పారిపోతారు. యముడు సరోవరంలో సేదతీరుతానని చెప్పి 10 రోజుల వరకు రాడు. దీంతో బయట వున్న చిత్రగుప్తుడు వుండలేక... నీటిలోకి భవిష్యవాణిని తీసుకెళ్ళలేక అక్కడే వున్న ఒకేఒక్క మానవుడుని పిలిచి గ్రంథాన్ని ఇస్తాడు. దాన్ని తెరవకూడదంటాడు. కానీ ఆ తర్వాత వుండబట్టలేక అతను తెరిచి చూసి భయంభ్రాంతులవుతాడు. కాసేపటికి పైకి వచ్చిన వారికి మానవుడు కన్పించడు. అతనికోసం గాలిస్తూ.. అతన్ని తెలుసుకుని గ్రంథాన్ని ఇవ్వమంటే.. ఓ షరతు పెడతాడు. అది ఏమిటి? అనేది మిగిలిన సినిమా.[2]

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: ఎస్. వి. కృష్ణారెడ్డి
 • నిర్మాత: డా. కెవి. సతీష్, కె. అచ్చిరెడ్డి
 • సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
 • నిర్మాణ సంస్థ: కృష్వి ఫిల్మ్స్

పాటలుసవరించు

 1. కృష్ణంభజే - శ్రీముఖి, ఎంఎల్ఆర్ కార్తికేయన్ - 4:22
 2. ప్రాణ బంధమా - నివాస్, చిన్మయి - 3:23
 3. హాయి హాయిగా - శ్రేయ ఘోషాల్ - 4:50
 4. దారి పొడుగు - ఎంఎల్ఆర్ కార్తికేయన్, శ్వేత మోహన్ - 4:11
 5. నువ్వు నవ్వితే - జెస్సీగిప్ట్ - 3:54
 6. ఓ తాయారు - దలేర్ మెహంది, ప్రియా హిమేష్ - 4:20
 7. అండాండ పిండాండ - మనో - 0:48
 8. అలర చంచలమైన - శ్రీముఖి - 0:54

స్పందనసవరించు

మూలాలుసవరించు

 1. 123 Telugu, Movie Review (29 November 2014). "Yamaleela 2 Telugu Movie Review". www.123telugu.com. Retrieved 19 July 2020.
 2. తెలుగు వెబ్ దునియా, తెలుగు సినిమా (కథనాలు). "'యమలీల-2' స్టోరీ లైన్... రివ్యూ రిపోర్ట్". telugu.webdunia.com. Retrieved 19 July 2020.
 3. Times of India, Movie Review (28 November 2014). "Yamaleela 2 Movie Review". Archived from the original on 6 March 2016. Retrieved 19 July 2020.
 4. Deccan Chronicle, Movie Review (29 November 2014). "Movie review 'Yamaleela 2': Mohan Babu gives out an impressive performance". Suresh Kavirayani. Archived from the original on 4 March 2016. Retrieved 19 July 2020.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=యమలీల_2&oldid=3105435" నుండి వెలికితీశారు