యమదొంగ

2007 సినిమా

యమదొంగ, 2007లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు సినిమా. చిరంజీవి (చెర్రీ), అతని భార్య ఊర్మిళా గంగరాజులు ఈ చిత్రం నిర్మాతలు. ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్.టి.ఆర్. జూనియర్‌ల కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఇది వారి మూడవ చిత్రం.

యమదొంగ
TeluguFilm Yamadonga poster.jpg
దర్శకత్వంఎస్.ఎస్. రాజమౌళి
కథా రచయితఎస్.ఎస్. రాజమౌళి
నిర్మాతఊర్మిళా గంగరాజు
పి. చిరంజీవి
తారాగణంఎన్.టి.ఆర్. (తారక్),
మోహన్ బాబు,
ఆలీ,
మమతా మోహన్ దాస్,
ప్రియమణి,
నవనీత్ కౌర్,
మాస్టర్ శ్రీ‌ సింహా
ఛాయాగ్రహణంసెంతిల్ కుమార్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
విడుదల తేదీ
ఆగష్టు 15, 2007
సినిమా నిడివి
185 నిముషాలు
భాషతెలుగు
బడ్జెట్24 కోట్లు

చిత్ర కథసవరించు

రాజా (జూనియర్ ఎన్.టి.ఆర్.) ఒక అనాథ, దొంగ. చిల్లర దొంగతనాలు, మోసాలు చేస్తుంటాడు. ఏదైనా పెద్ద దొంగతనం చేసి స్థిరపడాలని ఆశిస్తుంటాడు. అతనికి మహి (ప్రియమణి) అనే అందాల, పెద్ద ఆస్తికి వారసురాలైన యువతి పరిచయమౌతుంది. చిన్నప్పుడు ఒక సంఘటనలో మహి రాజాకు తారసపడుతుంది.ఆమె అప్పుడు అతనికి ఇచ్చిన ఒక పతకం రాజాను వదలకుండా ఎలాగో అతని చేతికే చిక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మహి అతనిని ప్రేమిస్తుంది కూడాను. ఈ అవకాశాన్ని "సద్వినియోగం" చేసుకొని ఆస్తి కొట్టేయాలని రాజా అనుకొంటాడు.

ఇలా రాజా వేసిన ప్లాను బెడిసికొట్టి విషప్రయోగానికి గురవుతాడు. అంతకుముందు ఒకసారి తప్ప త్రాగి, రాజా యముడిని దూషించి సవాలు చేస్తాడు. ఇది విని అతనికి అగిన పాఠం వేర్పాలని యముడు (మోహన్ బాబు) అనుకొంటాడు. అతనికి యమగండం ఉన్న సమయం చూసి అతని ప్రాణాలను యమలోకానికి తెప్పిస్తాడు. అక్కడ రాజా తన చతురతను, మాటకారితనాన్ని, హస్తలాఘవాన్ని చూపి సందు చూసుకొని యముని పాశాన్ని చేజిక్కించుకొంటాడు. దానితో అతనికి యముని శక్తి వస్తుంది. యమ పదవి కోసం యముడు, రాజా ఒకరిపై మరొకరు ఎత్తులు వేయడం, ఎన్నికలు నిర్వహింపజేయడం, రాజా జిత్తులు - ఇలా కథ సాగుతుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

సినిమాలో పాటలు బాగా విజయవంతమయ్యాయి.

 • రబ్బరు గాజులు రబ్బరు గాజులు - దలేర్ మెహంది, ప్రణవి - రచన: అనంత్ శ్రీరాం
 • నూనూగు మీసాలోడు - కీరవాణి, సునీత - రచన: అనంత్ శ్రీరాం
 • నాచోరే - దీపు, గంగ -రంజిత్, ప్రణవి - రచన: అనంత్ శ్రీరాం
 • నువ్వు ముట్టుకుంటే -
 • శ్రీకరాకారుండ (పద్యం) - మనో - రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
 • చల చల్లగా గాలి - కీరవాణి, సంగీత - రచన: జొన్నవిత్తుల
 • యంగ్ యమా యంగ్ యమా - కీరవాణి, మనో, శంకర్ మహదేవన్, ప్రణవి - రచన: అనంత్ శ్రీరాం
 • ఓలమ్మీ తిక్క రేగిందా జూనియర్ ఎన్.టి.ఆర్., మమత మోహన్ దాస్ - రచన: జొన్నవిత్తుల
 • బంబరాల చుంబనాల - మనో, ప్రణవి - రచన: జొన్నవిత్తుల

సాంకేతిక వర్గంసవరించు

 • డైరెక్టర్, చిత్రానువాదం: ఎస్.ఎస్.రాజమౌళి
 • నిర్మాత: ఊర్మిళా గంగరాజు, పి. చిరంజీవి (చెర్రీ)
 • కథ: విజయేంద్ర ప్రసాద్
 • సంభాషణలు: ఎమ్.రత్నం
 • ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్
 • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
 • కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
 • కళ: ఆనంద్ సాయి
 • దుస్తుల డిజైన్: రమా రాజమౌళి
 • సహాయ దర్శకులు: జి. రమేష్ కుమార్, కామన వి.సాయి, ఐ.వి.ఎస్. శివశంకర్, సున్నా సురేష్
 • ఆడియోగ్రాఫర్: ఎస్కల రాధాకృష్ణ
 • పోరాటాలు: పనీర్ సెల్వన్
 • కెమెరా ఆపరేటర్: సమల భాస్కర్
 • సహాయ కోరియోగ్రాఫర్లు: దినేష్, ప్రేమ్ రక్షిత్, సోర్బీ, రాజు సుందరం

ఫలితాలు, విశేషాలుసవరించు

 
ఒక అభిమానుల పోస్టర్

ముందుగా "డివైడెడ్ టాక్" వచ్చినా క్రమంగా సినిమా విజయవంతమయ్యింది. అంతకుముందు వరుస పరాజయాలతో దెబ్బతిన్న జూ.ఎన్.టి.ఆర్. ప్రతిష్ఠ ఈ సినిమాతో కాస్త నిలదొక్కుకుంది.

మొదటి రోజు సినిమా 4.5 కోట్లు వసూలు చేసింది.[1] మొదటివారం కలెక్షన్లు 11.6 కోట్లు. మొత్తం కలెక్షనులు 34 కోట్లు కావచ్చును అని అంచనా.[2]

సినిమాకు సమీక్షకులనుండి మంచి వ్యాఖ్యలే వచ్చాయి.[3][4][5]

 • 2008 సిని"మా" అవార్డులలోను, ఫిలిమ్ ఫేర్ అవార్డులలోను తారక్‌కు "ఉత్తమ కథానాయకుడు" అవార్డు లభించింది.
 • ఈ సినిమా కథలో యమలోకం సీనులకు, అంతకు ముందు వచ్చిన దేవాంతకుడు, యమగోల సినిమాలకు పోలికలున్నాయి. అంతే కాకుండా జూనియర్ ఎన్.టి.ఆర్. తాత అయిన నందమూరి తారక రామారావు ఒక సీనులో స్వర్గం నుండి దిగువచ్చి తన మనుమడిని ప్రోత్సహించినట్లుగా చూపారు. డాన్సులో కూడా పాల్గొన్నట్లు చూపారు. ఇదంతా గ్రాఫిక్స్ వైపుణ్యం ద్వారా చూపడం ప్రేక్షకులకు మంచి ఊపునిచ్చింది.[6]
 • ఈ సినిమాలో "ఓలమ్మీ తిక్క రేగిందా" అనే పాటను జూనియర్ ఎన్.టి.ఆర్. స్వయంగా పాడాడు. అంతకుముందు ఇదే పాటను యమగోల సినిమాలో ఎవ్.టి.ఆర్., జయప్రదలపై చిత్రీకరించారు.

మూలాలుసవరించు

 1. "NTR Yamadonga 1st day Collections& records at boxoffice". Archived from the original on 2007-10-22. Retrieved 2008-03-24.
 2. "Yamadonga Shares". Retrieved 2008-03-24.
 3. "Telugu Movie review - Yamadonga". Retrieved 2008-03-24.
 4. "Both 'Yamas' Steal the Show". Archived from the original on 2008-02-23. Retrieved 2008-03-24.
 5. "'Yamadonga' Review: A Good Entertainer". Archived from the original on 2008-12-11. Retrieved 2008-03-24.
 6. "nonstopcinema.com". Soundarya in NTR-Rajamouli's Yamadonga!. Retrieved 16 January. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=యమదొంగ&oldid=3228537" నుండి వెలికితీశారు