యలమంచిలి హనుమంతరావు

యలమంచిలి హనుమంతరావు రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.[1]

యలమంచిలి హనుమంతరావు
యలమంచిలి హనుమంతరావు
జననం1938 మార్చి 1
మరణంజనవరి 19 2016
ఎల్లారెడ్డి గూడెం
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లుయలమంచిలి హనుమంతరావు
విద్యఅగ్రికల్చర్ బి.యస్సీ
ఉద్యోగంఆలిండియా రేడియో
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రేడియో ప్రముఖులు
తల్లిదండ్రులుసాంబశివరావు
వరలక్ష్మి

జీవిత విశేషాలు మార్చు

అతను కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరులో 1938 మార్చి 1 న సాంబశివరావు, వరలక్ష్మి దంపతులకు జన్మించాడు. 3వ తరగతి వరకు మేడూరులో చదివి, ఇంటర్మీడియట్ వరకు విజయవాడలో సి.వి.ఆర్.జి.ఎం. హైస్కూలులో, ఎస్.ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలో 1956 నుండి 1959 వరకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బి.యస్సీ చదివాడు. 12 ఏళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన హనుమంతరావు 1971లో ఆల్‌ఇండియా రేడియోలో చేరాడు.రైతుల కార్యక్రమాలను రేడియోలో వినసొంపుగా తీర్చిదిద్దిన ఘనత అతనికి ఉంది.అన్నదాతగా, ఆత్మబంధువుగా, రేడియోరావుగా హనుమంతరావు గుర్తింపు పొందాడు.

మరణం మార్చు

ఎల్లారెడ్డిగూడలోని స్వగృహంలో 2016 జనవరి 19 ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు.

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు