యశవంత్ రాయగౌడ్ పాటిల్

యశవంతరాయగౌడ విటాలగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇండి శాసనసభ నియోజకవర్గం నుండి కర్ణాటక శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

యశవంతరాయగౌడ విటాలగౌడ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013
ముందు సార్వభౌమ సతగౌడ బగలి
నియోజకవర్గం నాగతన్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

రాజకీయ జీవితం

మార్చు

యశవంత్ రాయగౌడ్ పాటిల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో ఇండి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డాక్టర్ బగాలి సార్వభౌం సతగౌడపై 571 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి, 2013 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక జనతా పక్ష అభ్యర్థి రవికాంత్ శంక్రెప్ప పాటిల్‌పై 33302 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

యశవంత్ రాయగౌడ్ పాటిల్ 2018 శాసనసభ ఎన్నికలలో ఇండి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బి.డి. పాటిల్‌పై 9938 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా,[1][2] 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బి.డి. పాటిల్‌పై 10,329 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  3. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  4. The Indian Express (13 May 2023). "Karnataka election results 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.