యాదవ రెడ్డి
వంటేరు యాదవ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]
ఒంటేరు యాదవ రెడ్డి | |||
ఎమ్మెల్సీ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జనవరి 2022 నుండి 4 జనవరి 2028 | |||
ముందు | వి. భూపాల్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1965 గజ్వేల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | గజ్వేల్ | ||
మతం | హిందూ మతము |
జననం, విద్యాభాస్యం
మార్చువంటేరు యాదవ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, గజ్వేల్ లో జన్మించాడు. అతను ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసి గజ్వేల్ పట్టణంలో ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యుడిగా విస్తృత సేవలందించాడు.[2]
రాజకీయ జీవితం
మార్చువంటేరు యాదవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా 1985 సంవత్సరంలో క్రీయాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.అతని సొంత గ్రామం క్యాసారం ఇప్పటి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటి లో రెండవ వార్డు నుంచి 1987-88 సంలో 5సం లు సర్పంచ్ గా తన సేవలందించాడు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006 సంవత్సరం నుండి 2009 వరకు గజ్వేల్ వ్మాయవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పని చేశాడు. అతను 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వాదిగా అతని సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.
యాదవ రెడ్డి తెరాసలో చేరి 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకు కృషి చేశాడు. తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అతని పేరును టిఆర్ఎస్ అధిష్టానం 21 నవంబర్ 2021న ఖరారు చేసింది.[3][4] వంటేరు యాదవ రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబరు 23న నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు.[5][6] అతను 2021 డిసెంబరు 10న తెలంగాణ శాసనమండలి కి జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[7] అతను 27 జనవరి 2022న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[8]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ News18 Telugu (22 November 2021). "సీఎం కేసీఆర్ సన్నిహితుడికే మెదక్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ". Retrieved 23 November 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Disha daily (దిశ) (21 November 2021). "గజ్వేల్ గడ్డ నుంచి డాక్టర్ సాబ్.. ఎమ్మెల్సీ గా అవకాశం ఇచ్చిన కేసీఆర్". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
- ↑ Sakshi (22 November 2021). "టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
- ↑ Andhrajyothy (23 November 2021). "నామినేషన్ల హడావిడి". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ Telangana Today (22 November 2021). "Six including Yadava Reddy from TRS file papers for Medak MLC poll". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
- ↑ V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 January 2022). "ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఒంటేరు యాదవ రెడ్డి". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.