యామినీ సరస్వతి కలంపేరుతో రచనలు చేసిన ఇతని అసలు పేరు దొర్నిపాటి వేంకట సుబ్బారావు[1].

యామినీ సరస్వతి

జీవిత విశేషాలు

మార్చు

ఈయన కర్నూలుజిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామంలో పుట్టారు. బి.ఎ. పట్టభద్రుడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కొంతకాలం వ్యవసాయం చేసి రైతుగా కొనసాగాడు. ఇతడు యాబైకిపైగా నవలలు వ్రాశాడు. ఇతడు తెలుగుచలన చిత్రాలకు కూడా పనిచేశారు. తాండ్ర పాపారాయుడు, విశ్వనాథ నాయకుడు వంటి చిత్రాలకు కథను సమకూర్చాడు. విశ్వామిత్ర హిందీ టీవీ సీరియల్‌కు కూడా పనిచేశాడు. ఈటీవిలో ప్రసారమైన శివలీలలు సీరియల్‌కు కథను అందించాడు. ఇతడు కొంతకాలం తన స్వస్థలం నుంచి మంజుల అనే సాహిత్య పత్రికను నడిపాడు. ఆ పత్రిక ద్వారా ఎందరోయువ రచయితలను ప్రోత్సహించాడు. అయితే తన కుమారుడు ఆకస్మికంగా మరణించడంతో కలత చెంది దాన్ని ఆపేశాడు. అనంతరం ఈయన ఉదయం పత్రికలో పనిచేశాడు. ప్రాచీన తెలుగుసాహిత్యంలో యామినీ సరస్వతికి మంచి పరిచయం ఉంది[2].[3]

రచనలు

మార్చు
  1. బహుదూరపు బాటసారి[4] (నవల)
  2. స్మృతిపరిమళం (నవల)
  3. ఎడారి కోయిల (నవల)
  4. అందాల జాబిలి (నవల)
  5. సప్తపర్ణి (నవల)
  6. నింగిలోని సిరిమల్లి (నవల)
  7. అనురాగ జలధి (నవల)
  8. రాగవాహిని (నవల)
  9. కాలనాగు (నవల)
  10. మధుకీల (నవల)
  11. అహల్య (నవల)
  12. మౌనవిపంచి (నవల)
  13. ఎలమావి తోట (నవల)
  14. స్వర్గసీమ (నవల)
  15. పాదాభివందనం (కథా సంపుటం)
  16. దాంపత్యనౌక (నవల)
  17. కీర్తి రథం (నవల)
  18. మాధవి (నవల)
  19. మారని సమాజంలో మారే మనుషులు (నవల)
  20. ఇదీ జీవితం ఇలాగే బ్రతకాలి (నవల)
  21. శ్రావణ సంగీతం (నవల)
  22. వెన్నెల జలపాతం (నవల)
  23. నాటీ హోం (నవల)
  24. యామినీవిలాసం (కథా సంపుటం)
  25. సరస్వతీ మహల్ (కథా సంపుటం)
  26. జయజయ వీరాంజనేయ

మూలాలు

మార్చు
  1. కర్నూలు జిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు - పేజీలు 234-237
  2. ప్రముఖరచయిత యామినీ సరస్వతికన్నుమూత
  3. Sakshi (3 August 2021). "యామినీ విలాసం". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో బహుదూరపు బాటసారి పుస్తకప్రతి