తాండ్ర పాపారాయుడు (సినిమా)

తాండ్ర పాపారాయుడు 1986 లో వచ్చిన తెలుగు జీవిత చరిత్ర చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. 18 వ శతాబ్దపు యోధుడు తాండ్ర పాపారాయుడు జీవితం ఆధారంగా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై యు.సూర్యనారాయణ రాజు నిర్మించాడు.[1] ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, సుమలత, ప్రాణ్, మోహన్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని 11 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు.[2][3][4]

తాండ్ర పాపారాయుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం యు.సూర్యనారాయణ రాజు
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద ,
జయసుధ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్
భాష తెలుగు

నట వర్గం

మార్చు

ఇతర విశేషాలు

మార్చు

పాటలు

మార్చు
  • అభినందన మందార మాల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి , గానం. కె జె జేసుదాస్, పి సుశీల
  • లలిత పులకాంత , రచన: సి నారాయణ రెడ్డి, గానం. కె జె జేసుదాస్, పి సుశీల
  • రాజంటే నీవెలే , రచన: సి నారాయణ రెడ్డి,గానం.కె జె జేసుదాస్, పి సుశీల
  • మల్లెకన్న తెల్లన , రచన: సి నారాయణ రెడ్డి,గానం.
  • చలి చలి రేయి , గానం.పులపాక సుశీల, వాణి జయరాం
  • అతి బాల్యంనుండి గుండెపై (పద్యం) గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కాళ్ళ పారాణి మంగళసూత్రమున(పద్యం ), గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , రచన:
  • సర్వప్రజారక్షణ రక్షితార్డ వామార్డబాగ (సుప్రభాతం ), గానం . పి సుశీల, రచన:
  • అరివీర భయద గండర గండ,(పద్యం ), గానం. వి .రామకృష్ణ, రచన:
  • దేవునిఅవతారం నీవే, రచన:
  • అతి ప్రగల్భ వీరభద్ర సింహనాద (పద్యం), గానం. కె. జె. ఏసు దాస్
  • నీ వాచాలత కట్టిపెట్టు ప్రళయాగ్ని జ్వాలామాలిక(పద్యం), గానం.వి.రామకృష్ణ
  • గర్వాఖర్వ విరోధి వర్గ కృతమో ఖడ్ల ప్రహారాలు(పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • యేవేల్పులు విడదీయరనుచు ఎంతే ధైర్యంబు, (పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

మార్చు
  1. Tandra Paparayudu (1986) - Synopsis
  2. "iffi.nic.in/Dff2011/Frm11IIFAAward.aspx?" (PDF). Archived from the original (PDF) on 2013-01-30. Retrieved 2020-08-04.
  3. "Tandra Paparayudu". Archived from the original on 2020-01-16. Retrieved 2020-08-04.
  4. Tandra Paparayudu Songs

5.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.