బనగానపల్లె

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా బనగానపల్లె మండల జనగణన పట్టణం

బనగానపల్లె ఆంధ్ర ప్రదేశ్, నంద్యాల జిల్లా బనగానెపల్లె మండలం లోని జనగణన పట్టణం. 1790 నుండి 1948 వరకు బనగానపల్లె సంస్థానానికి కేంద్రంగా వుండేది.

బనగానపల్లె
—  జనగణన పట్టణం  —
బనగానపల్లె is located in Andhra Pradesh
బనగానపల్లె
బనగానపల్లె
అక్షాంశరేఖాంశాలు: 15°19′00″N 78°14′00″E / 15.3167°N 78.2333°E / 15.3167; 78.2333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నంద్యాల
మండలం బనగానపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 16,462
 - పురుషుల సంఖ్య 8,400
 - స్త్రీల సంఖ్య 8,062
 - గృహాల సంఖ్య 3,338
పిన్ కోడ్ 518124
ఎస్.టి.డి కోడ్

బనగానపల్లె సంస్థాన చరిత్ర సవరించు

 
బనగానపల్లె సంస్థాన పటం

1601లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్‌ ఆదిల్‌ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్‌ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్‌ బేగ్‌ ఖాన్‌-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్‌ ఆలీ ఖాన్‌ బహదూరుకు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్‌ ఆలీ మేనమామ, ముబారిజ్‌ ఖాన్‌ దయవల్ల ఫైజ్‌ ఆలీ ఖాన్‌ స్థానం పదిలంగానే ఉంది.

1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయింది. ఆర్థిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901లో బనగానపల్లె సంస్థానం 660 చకి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది, మిగిలినవన్నీ జమీందారీల హోదాలోనే ఉండేవి.[1] 1948లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.

ఆలయాలు సవరించు

 
చింతమాను మఠం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి
 
నేలమఠం, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం, బనగానపల్లె
 
నేలమఠం,శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నేలమఠం,బనగానపల్లె
  • బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు.
  • బనగానపల్లెకి 10 కి.మీ. దూరంలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది.
  • శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వలకొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు.
  • శీశ్రీశ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహ స్వామి క్షేత్రం బనగానపల్లి సమీపములోని రవ్వలకొండపై కలదు

విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు సవరించు

బనగానపల్లె పట్టణంలో, ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఉన్నాయి. బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

ప్రైవేటు విద్య సంస్థలు కూడా ఉన్నాయి.
బనగానపల్లెలో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉంది. ఒక సార్వజనిక వైద్యశాల, ప్రభుత్వ పశు వైద్యశాల ఉన్నాయి. ఆర్.టి.సి. డిపో ఉంది.

బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకు రవాణ సౌకర్యం ఉంది.

హైదరాబాదుకి ప్రతి రోజు రాత్రి బస్సులు ఉన్నాయి. రైల్వే స్టేషను ఉంది.

గణాంకాలు సవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462. ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గృహాలు 3,338 ఉన్నాయి.

మామిడి సవరించు

బనగానెపల్లె ప్రాంతంలో పెరిగే ఒక రకం మామిడికి బంగినపల్లి మామిడి అని వాడుకలో పేరు. చాలా ప్రసిద్ధమైన మామిడి రకం ఇది. దీన్ని "బేనిషా" అని కూడా అంటారు. మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది. మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి 'గుర్తు లేనిది' (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక ఎన్.టి.ఆర్. చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.

మూలాలు సవరించు

  1. తూమాటి, దొణప్ప (ఆగస్టు 1969). ఆంధ్రసంస్థానములు - సాహిత్యపోషణ (1 ed.). విశాఖపట్టణం: ఆంధ్రా యూనివర్శిటీ. p. 12.

బయటి లింకులు సవరించు