యార్లగడ్డ వెంకట కృష్ణారావు

వై.వి. కృష్ణారావు గా సుపరిచితుడూ, సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడూ, రైతు ఉద్యమ రథసారధి, స్వాతంత్ర్య సమరయోధుడు యార్లగడ్డ వెంకట కృష్ణారావు కృష్ణా జిల్లావాసి.

బాల్యంసవరించు

ఈయన 1915లోపెద్దఅవుటపల్లిగ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు.[1]

జీవిత విశేషాలుసవరించు

తొలిసారి జాతీయోద్యమం గురించి 1929లో గాంధీజీ ద్వారా విని, ప్రభావితుడై ఆ వైపు మరలారు. 1937లో విద్యార్థి సమాఖ్య సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1937లో డిటెక్షన్ విధానానికి వ్యతిరేకంగా ఎ.సి. కాలేజీలో జరిగిన చారిత్రక విద్యార్థి ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించారు. 1940లో గుంటూరు ఎ.సి. కాలేజీ నుండి సైన్స్ లో పట్టభద్రులయ్యారు. ఆయన 1948 నుండి 1951 వరకు రహస్య జీవితం గడిపారు. 1951 నుండి 1987 వరకు ఆంధ్ర రాష్ట్ర , ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసారు. 1958 నుండి భారత కమ్యునిస్టు పార్టీ జాతీయ సంఘ కమిటీ సభ్యులుగా కొనసాగారు. 1987 నుండి అఖిల భారత రైతు సంఘ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. రాజకీయ, ఆర్థిక అంశాలపై పెక్కు రచనలు, వ్యాసాలు వ్రాసారు.[2]

మూలములుసవరించు

  1. కృష్ణా జిల్లా తేజోమూర్తులు, గుత్తికొండ జవహర్‍లాల్, సాహితి ప్రచురణలు, పేజీ 251
  2. Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642