ఆంధ్ర క్రైస్తవ కళాశాల

(ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర క్రైస్తవ కళాశాల అన్నది భారతదేశంలోని పురాతన కళాశాలలో ఒకటి, ఇది 1885లో ప్రారంభించబడింది. ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రొటెస్టంట్ చర్చిల విద్యా సంస్థ యొక్క భాగం. ఈ కళాశాల ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ విద్యార్థులను అనుమతించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలను ప్రధానం చేస్తుంది, ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. సెయింట్ జార్జ్ ఈ కళాశాలకు పోషకుడిగా ఉండేవాడు. ఈ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద ఈయన విగ్రహం ఉంటుంది. ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ద్వారా ఎన్నుకోబడిన అధికారులు ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు.

ఆంధ్ర క్రైస్తవ కళాశాల
ఎ సి కాలేజ్
లాటిన్: Collegium Andhra Christianus
నినాదంమీరు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మీకు స్వేచ్ఛను కలిగిస్తుంది.
రకంకళాశాల
స్థాపితం1885
ఛాన్సలర్అధ్యక్షుడు, ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ చర్చి (AELC)
ప్రధానాధ్యాపకుడుడాక్టర్ పి ముత్యం
చిరునామSambasivapet, Guntur 522 001, India, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
16°17′47.8″N 80°26′33.1″E / 16.296611°N 80.442528°E / 16.296611; 80.442528
కాంపస్పట్టణ
అనుబంధాలు
జాలగూడుhttp://www.accollegeguntur.com/

చరిత్ర

మార్చు

1885లోనే గుంటూరులో తొలి కళాశాల, భారతదేశంలో తొలి పాశ్చాత్య కళాశాలల్లో ఒకటి అయిన ది అమెరికన్ ఇవాంజికల్ లూథరన్ మిషన్ కళాశాల స్థాపించారు. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాయానికి అనుబంధంగా మారేవరకూ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేసేది. 1928లో దీన్ని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల (ఏ.సి.కాలేజి) గా పేరు మార్చారు.[1]

ఈ కళాశాల అందిస్తున్న కోర్సులు

మార్చు
 
ప్రధాన క్యాంపస్

ఇంటర్మీడియట్

మార్చు

ప్రీ-యూనివర్సిటీ లేదా ఇంటర్మీడియట్ కోర్సులు ఈ కళాశాలచే అందించబడుతున్నాయి. ఈ కళాశాల ఆంధ్ర ప్రదేశ్లో పూర్వ-విశ్వవిద్యాలయ కోర్సుల (పియుసి) కోసం నియంత్రణ అధికారమున్న బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్కు అనుబంధంగా ఉంది.

ఈ కళాశాలయందు అందుబాటులో ఉన్న కోర్సు కలయికలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

  • బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  • మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
  • చరిత్ర, ఎకనామిక్స్, కామర్స్
  • పౌరశాస్త్రం, ఎకనామిక్స్, కామర్స్

గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు

మార్చు
  • బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (B.A.)
  • బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (B.Sc.)
  • బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com.)

పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లు

మార్చు
  • మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A) ఆంగ్లము, చరిత్ర
  • మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.Sc.) కెమిస్ట్రీ, జువాలజీ

ఈ కళాశాలలో చదివిన ప్రముఖులు

మార్చు

చలనచిత్రరంగం

నాటకరంగం

సాహిత్యం

రాజకీయరంగం

వేదాంతశాస్త్రం

షూటింగ్ లలో

మార్చు

తెలుగులో తీసిన హాస్య ప్రధాన చిత్రం పిల్లజమీందార్‌ను ఈ కళాశాలలో షూటింగ్ చేశారు, అయితే ఈ సినిమాలో మంగమ్మ స్మారక కళాశాల (మంగమ్మ మెమోరియల్ కాలేజ్), సిరిపురం అనే పేరుతో చూపించారు.

మూలాలు

మార్చు
  1. ఐ., ప్రసాదరావు. సహాయ నిరాకరణోద్యమంలో గుంటూరు జిల్లా పాత్ర. p. 11.
  2. The Story of Serampore and its College [1] Archived 2003-10-22 at the Wayback Machine IVth edition 2006, Appendix VI, pp. 177-179
  3. "Rev. Dr. Dass Babu is a disciple of Premasagar". Archived from the original on 2007-10-08. Retrieved 2015-02-01.
  4. Dr. Luther Paul presently heads a Seminary in Hyderabad Andhra Christian Theological College

ఇవి కూడా చదవండి

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు