యుజ్వేంద్ర చహల్

యుజ్వేంద్ర చహల్‌ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2016లో భారత దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టి తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[1]

యుజ్వేంద్ర చహల్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
యుజ్వేంద్ర సింగ్ చహల్‌
పుట్టిన తేదీ (1990-07-23) 1990 జూలై 23 (age 34)
జింద్, హర్యానా, భారతదేశం
బ్యాటింగుకుడి చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగురైట్-ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 211)2016 జూన్ 11 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 9 - వెస్ట్ ఇండీస్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.3
తొలి T20I (క్యాప్ 60)2016 జూన్ 19 - జింబాబ్వే తో
చివరి T20I2022 ఫిబ్రవరి 26 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.6
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004– ప్రస్తుతంహర్యానా (స్క్వాడ్ నం. 3)
2011–2013ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 23)
2014–2021రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 3)
2022 - ప్రస్తుతంరాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 3)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 61 54 31 118
చేసిన పరుగులు 53 5 324 289
బ్యాటింగు సగటు 8.83 2.50 8.75 11.56
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 18 నాటౌట్* 3 నాటౌట్* 42 24 నాటౌట్*
వేసిన బంతులు 3,013 12,63 5,463 5,873
వికెట్లు 104 68 84 179
బౌలింగు సగటు 26.93 25.34 33.21 26.51
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 1 3 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/42 6/25 6/44 6/24
క్యాచ్‌లు/స్టంపింగులు 15/– 10/– 11/– 27/–
మూలం: ESPNcricinfo

యుజ్వేంద్ర చాహల్ 2023 మే 11 నాటికీ 142 ఇన్నింగ్స్‌ల్లో 187 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించాడు.[2][3]

యుజ్వేంద్ర చాహల్ 2024 ఏప్రిల్ 22న 17 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ నబీని అవుట్ చేసి ఈ ఫీట్ ను సాధించాడు.[4]

యుజ్వేంద్ర చహల్ ఐపీఎల్‌లో రెండవ హ్యాట్రిక్ లు సాధించాడు.[5]

వ్యక్తిగత జీవితం

మార్చు

యుజ్వేంద్ర చహల్‌ యూట్యూబర్, కొరియోగ్రాఫర్, డెంటిస్ట్ ధనశ్రీ వర్మను 2020 ఆగస్టు 8న గురుగ్రామ్ లోని కర్మా లేక్ రిసార్ట్ లో వివాహమాడాడు.[6] ఈ జంట ఫిబ్రవరి 05న ఫ్యామిలీ కోర్ట్​ను ఆశ్రయించగా తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నందు వల్ల 6 నెలల కూలింగ్ పీరియడ్​ను మినహాయించాలని కోర్టును కోరగా దీనిని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించడంతో వారు బాంబే హై కోర్టును ఆశ్రయించగా, పరస్పర అంగీకారం ఉన్నప్పుడు విరామ గడువు అవసరం లేదని హై కోర్టు రద్దు చేయగా విడాకుల పిటిషన్‌పై 20 మార్చి నాటికి నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించడంతో విచారణ చేపట్టిన కోర్టు చాహల్‌, ధనశ్రీకి విడాకులు మంజూరు చేసింది.[7][8][9]

మూలాలు

మార్చు
  1. Hindustan Times Telugu. "చహల్@ 100.. ఆ లిస్టులో ఐదో ఆటగాడిగా రికార్డు". Archived from the original on 19 April 2022. Retrieved 19 April 2022.
  2. TV9 Telugu (12 May 2023). "ఐపీఎల్‌ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్.. తొలి బౌలర్‌గా నిలిచిన చాహల్." Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu (11 May 2023). "చాహల్ సరికొత్త చరిత్ర..187 వికెట్లతో అగ్రస్థానం". Archived from the original on 12 May 2023. Retrieved 12 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Yuzvendra Chahal Creates History, Becomes First Player to Take 200 Wickets" (in ఇంగ్లీష్). ETV Bharat News. 22 April 2024. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025. {{cite news}}: |first1= has numeric name (help); |first1= missing |last1= (help)
  5. "చరిత్ర సృష్టించిన చాహల్‌.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా". Sakshi. 1 May 2025. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.
  6. "Cricketer Yuzvendra Chahal marries choreographer Dhanashree Verma in Gurugram. See pics". Hindustan Times. 22 December 2020.
  7. "Separated for 18 months: Here's why Yuzvendra Chahal and Dhanashree Verma got divorced". Livemint. Retrieved 2025-02-21.
  8. "చాహల్‌-ధనశ్రీకి విడాకులు". Andhrajyothy. 21 March 2025. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.
  9. "Yuzvendra Chahal, Dhanashree Verma granted divorce by Mumbai family court" (in ఇంగ్లీష్). India Today. 20 March 2025. Archived from the original on 21 March 2025. Retrieved 21 March 2025.