రాజస్తాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో ఆడే రాజస్థాన్ లోని జైపూర్లో ఉన్న ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ జట్టు.[1] తొలి ఎనిమిది ఐపిఎల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా 2008 లో స్థాపించబడిన ఈ జట్టు, జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ను కొన్నిసార్లు ఐపిఎల్ యొక్క "మనీబాల్" జట్టుగా పరిగణిస్తారు.[2][3][4] రాయల్స్, మరుగునపడిన మంచి ప్రతిభను వెలికితీయడానికి,[5][6][7] అనేక వివాదాలు, కుంభకోణాలకూ ప్రసిద్ధం.[8][9][10][11]

మధ్య వయస్కులతో జరిగిన ఛారిటీ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బాల్కనీ చిత్రం

మీడియా, అభిమానులు టైటిల్‌కు పోటీదారుగా లెక్కించనప్పటికీ, షేన్ వార్న్ కెప్టెన్సీలో ఐపిఎల్ ప్రారంభ ఎడిషన్‌ను జట్టు గెలుచుకుంది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 లో రాయల్స్ రెండవ స్థానంలో నిలిచింది.[12][13]

2015 జూలై 14 న, 2013 బెట్టింగ్ కుంభకోణంపై భారత సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ ఇచ్చిన తీర్పులో రాజస్థాన్ రాయల్స్‌ను, చెన్నై సూపర్ కింగ్స్‌నూ రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. అంటే వారు 2016, 2017 ఐపిఎల్ టోర్నమెంట్లలో పాల్గొనలేరు. 2018 సీజన్లో తిరిగి పోటీకి వచ్చారు.

అజింక్య రహానె 2705 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌న్మన్ గానూ,[14], షేన్ వాట్సన్ 67 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగానూ ఉన్నారు.[15]

సీజన్లు, స్థానాలు

మార్చు
ఇయర్ లీగ్ టేబుల్ స్టాండింగ్ తుది స్థానం
2008 8 లో 1 వ స్థానం ఛాంపియన్స్
2009 8 లో 6 వ 6 వ
2010 8 లో 7 వ 7 వ
2011 10 లో 6 వ 6 వ
2012 9 లో 7 వ 7 వ
2013 9 లో 3 వ ప్లేఆఫ్‌లు (3 వ)
2014 8 లో 5 వ 5 వ
2015 8 లో 4 వ స్థానం ప్లేఆఫ్‌లు (4 వ)
2018 8 లో 4 వ స్థానం ప్లేఆఫ్‌లు (4 వ)
2019 8 లో 7 వ 7 వ

గణాంకాలు

మార్చు
ఫలితాల సారాంశం
ఇయర్స్ మ్యాచ్లు విజయాలు నష్టాలు ఫలితం లేదు విజయ రేటు
2008 14 11 3 0 78,57%
2009 14 6 7 1 46,15%
2010 14 6 8 0 42,86%
2011 14 6 7 1 46,15%
2012 16 7 9 0 43,75%
2013 16 10 6 0 62,50%
2014 14 7 7 0 50.00%
2015 14 6 6 2 50.00%
2016 సస్పెండ్
2017 సస్పెండ్
2018 14 7 7 0 50.00%
2019 13 5 7 1 38,46%
మొత్తం 143 71 67 5 49,65

మూలాలు

మార్చు
  1. "Big business and Bollywood grab stakes in IPL". ESPNcricinfo. 24 January 2008. Retrieved 24 January 2008.
  2. "Rajasthan Royals' team ethos and values have remained intact since first season". 8 May 2014. Retrieved 8 May 2014.
  3. "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". Archived from the original on 1 మే 2013. Retrieved 21 April 2019.
  4. "Rajasthan Royals' IPL 7 Player Retentions: The 'moneyball' team retains Shane Watson and promising players - Cricket Country". Archived from the original on 2020-03-02. Retrieved 2020-06-27.
  5. "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". Archived from the original on 14 జనవరి 2014. Retrieved 21 April 2019.
  6. "Royals retain Samson, Binny, Rahane, Watson, Faulkner". 10 January 2014. Retrieved 21 April 2019.
  7. "ABOUT THE BRAND". Archived from the original on 2015-03-27. Retrieved 2020-06-27.
  8. The IPL mess: Rajasthan franchise appeals against scrapping | Cricket News | Indian Premier League 2011 | ESPN Cricinfo. Cricinfo.com. Retrieved on 23 December 2013.
  9. IPL: Rajasthan Royals hearing adjourned | India Cricket News | ESPN Cricinfo. Cricinfo.com. Retrieved on 23 December 2013.
  10. IPL news: Rajasthan Royals hearing adjourned again | Cricket News | Indian Premier League 2011 | ESPN Cricinfo. Cricinfo.com. Retrieved on 23 December 2013.
  11. "IPL scandal: Chennai Super Kings and Rajasthan Royals suspended". 14 May 2015. Retrieved 18 July 2015.
  12. "ABOUT THE BRAND". Archived from the original on 2015-03-27. Retrieved 2020-06-27.
  13. "Rajasthan champions after cliffhanger".
  14. "Cricket Records | Records | Rajasthan Royals | Twenty20 matches | Most runs | ESPNcricinfo".
  15. "Cricket Records | Records | Rajasthan Royals | Twenty20 matches | Most wickets | ESPNcricinfo".