యూక్లిడ్ (ఆంగ్లం : Euclid) (గ్రీకు భాష: Εὐκλείδης -యూక్లీడేస్), ఫ్లోరూట్ క్రీ.పూ. 300, ఇతను అలెగ్జాండ్రియాకు చెందిన యూక్లిడ్ అనికూడా ప్రసిద్ధి. ఇతను ఒక గ్రీకు గణితజ్ఞుడు, జియోమెట్రి పితామహుడిగా ప్రసిద్ధి. టోలెమీ I (క్రీ.పూ. 323 – 283 ) కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతడి రచన ఎలిమెంట్స్ గణితశాస్త్రపు చరిత్రలో ఒక ప్రసిద్ధ, విజయపూరిత వాచకము.[1][2] దీనిలో గల సిద్ధాంతాలను సూత్రాలను యూక్లీడియన్ జియోమెట్రిగా నేడు గుర్తించబడుచున్నది.

యూక్లిడ్
యూక్లిడ్ చిత్రకారుడి ఊహాచిత్రం
జననంఫ్లోరూట్ క్రీ.పూ. 300
నివాసంఅలెగ్జాండ్రియా, ఈజిప్టు
జాతిగ్రీకు
రంగములుగణితం
ప్రసిద్ధియూక్లీడియన్ జియోమితి
యూక్లిడ్ ఎలిమెంట్స్

జీవిత సమాచారము

మార్చు

యూక్లిడ్ జీవితం గురించి అతడి రచనలకన్నా చాలా తక్కువగా తెలుసు. ప్రోక్లస్, అలెగ్జాండ్రియా పాపస్ కామెంటరీల ద్వారా మాత్రమే ఎక్కువగా యూక్లిడ్ జీవితం గురించి తెలుస్తున్నది. అలెగ్జాండ్రియా గ్రంథాలయం లో చాలా క్రియాశీలంగా వుండేవాడు. బహుశా గ్రీసు లోని ప్లాటో అకాడమీలో విద్యాభ్యాసం చేసివుండవచ్చు. ఇతడి జనన మరణ తేదీలు, జన్మస్థలం గురించి వివరాలేమీ ఇంతవరకు లభించలేదు. మధ్యకాలపు రచయితలు, ఒక సోక్రాటిక్ తత్వవేత్త అయిన మెగారా యూక్లిడ్, యూక్లిడ్ లగూర్చి తరచూ పొరబడేవారు.[3]
ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అంతటివాడు కూడా తన సాపేక్ష సిద్ధాంతము వివరించటం కోసము యూక్లిడ్ జామెట్రి పద్ధతిని వాడు కోవడం మరో దృష్టాంతం అంతే కాదు. " జ్యామితీయ గణితంలో తర్క బక్కమైన ఆలోచనకు తావు కల్పించిన గొప్ప మేధావి యూక్లిడ్ అని కూడా ఐన్ స్టీన్ ప్రశంశించాడు.

రచనలు

మార్చు

అలెగ్జాండ్రియా రాజు, గొప్ప మేధావీ ఐన టోలెమీ సమకాలికుడు యూక్లిడ్ అని, ప్లాటో అకాడమీకి చెందిన వాడని కొందరు నమ్మకంగా అంటున్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల యూక్లిడ్ ప్లాటో అకాడమీ నుండి అలెగ్జాండ్రియాకు తరలి వెళ్ళాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. 12 వ శతాబ్దంలో యూక్లిడ్ సంపుటాలు అరబ్, లాటిన్, భాషల్లో అనువదింపబడ్డాయని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.యూక్లిడ్ ఎలిమెంట్స్ మొత్తం 13 సంపుటాలుగా ఉంటుంది.

  • మొదటి సంపుటంలో బిందువులు, రేఖలు, వృత్తాలు, త్రికోణాలు వంటి వాటి గూర్చి వివరించడం జరిగింది.
  • రెండవ సంపుటంలో జ్యామితీయ చిత్రాలను బీజ గణితం ద్వారా రూపొందించే విధానాల గురించి వివరించడం జరిగింది.
  • 3,4 సంపుటాలలో వృత్తాలకు సంబంధించిన సర్వ సమగ్ర సమాచారం విశదీకరించబడి ఉంది.
  • 5,6 సంపుటాలలో నిష్పత్తి, శాతం వాటిని ఉపయోగించే పద్ధతులు మీద సవిస్తరమైన చర్చ ఉంది.
  • మిగతా సంపుటాలలో జ్యామితికి సంబంధించిన కూలంకష విషయ పరిజ్ఞానం శాస్త్ర బద్ధంగా వివరించడం జరిగింది.
  • ఘనము, పిరమిడ్, అష్టభుజి, గోళం, స్తూపం ఇత్యాది నిర్మాణాలకు సంబంధించిన గణిత సమీకరణాలను జోడించటం గొప్ప విషయం.

"ఎలిమెంట్స్"

మార్చు
 
యూక్లిడ్ "ఎలిమెంట్స్"కు చెందిన అతి ప్రాచీన ప్రతి ఆక్సిరింకస్ వద్ద లభ్యమయినది, ఇది సా.శ. 100 నకు చెంనది. ఈచిత్రంలో బుక్ II, ప్రొపోజిషన్ 5.[4]

ఇవీ చూడండి

మార్చు

సూచికలు

మార్చు
  1. Ball, W.W. Rouse (1960). A Short Account of the History of Mathematics (4th ed.). New York: Dover Publications. pp. 50–62. ISBN 0-486-20630-0.
  2. Boyer, Carl B. (1991). A History of Mathematics (2nd ed.). John Wiley & Sons. pp. 100–19. ISBN 0471543977.
  3. Heath (1956) vol. I, p. 4
  4. Bill Casselman. "One of the Oldest Extant Diagrams from Euclid". University of British Columbia. Retrieved 2008-09-26.

ఇతర పఠనాలు

మార్చు

బయటి లింకులు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.


"https://te.wikipedia.org/w/index.php?title=యూక్లిడ్&oldid=4074394" నుండి వెలికితీశారు