యెనుగొండ (మహబూబ్ నగర్ అర్బన్)

తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ మండలం లోని జనగణన పట్టణం

యెనుగొండ, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ (అర్బన్) మండలంలోని గ్రామం. [1]

యేనుగొండ
—  రెవిన్యూ గ్రామం  —
యేనుగొండ is located in తెలంగాణ
యేనుగొండ
యేనుగొండ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°45′09″N 78°02′42″E / 16.752568°N 78.044890°E / 16.752568; 78.044890
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం మహబూబ్ నగర్ (అర్బన్)
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 10,611
 - పురుషుల సంఖ్య 5,331
 - స్త్రీల సంఖ్య 5,280
 - గృహాల సంఖ్య 2,119
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది జనగణన పట్టణం. మహబూబ్ నగర్ నుండి హైదరాబాదుకు వెళ్లే దారిలో మొదటి గ్రామం.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని మహబూబ్ నగర్ మండలంలో ఉండేది. [2] గ్రామపంచాయతి కేంద్రం, మండలంలోని 16 ఎమ్పీటీసి నియోజకవర్గాలలో ఒకటి.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 10,611 - పురుషుల సంఖ్య 5,331 - స్త్రీల సంఖ్య 5,280 - గృహాల సంఖ్య 2,119

2001భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా 4728. ఇందులో పురుషుల సంఖ్య 2438, స్త్రీల సంఖ్య 2290. గృహాల సంఖ్య 888.

విద్యా సౌకర్యాలు

మార్చు

ఏనుగొండలో ఎస్.వి.ఎస్.నర్సింగ్ కళాశాల, ఎస్.వి.ఎస్.దంత కళాశాలలు ఉన్నాయి.[3]. ప్రస్తుతం ఇక్కడ ఎస్.వి.ఎస్. పేరుతో ఒక వైద్య కళాశాల, ఆసుపత్రిని స్థాపించారు.

గ్రామ ప్రముఖులు

మార్చు
  • కె.బి.గోపాలం - 1953, జూన్ 16న ఈ గ్రామంలో జన్మించాడు,ఇతను పాపులర్ సైన్స్ రచయిత, అనువాదకుడు.

రాజకీయాలు

మార్చు

2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో ఈ గ్రామంలో భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం లభించింది.[4]

విశేషాలు

మార్చు

ఇది తుంగ చాపల నేతకు ఎంతో పేరు పొందింది.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. Hand Book of Statistics, Mahabubnagar Dist 2009, Published by CPO, Page No 201
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 23-03-2012

వెలుపలి లింకులు

మార్చు