యెర్వ శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

యెర్వ శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985 నుండి 1989 వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

యెర్వ శ్రీనివాస్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 నుండి 1989
నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
తాండూరు గ్రామం, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

జననం మార్చు

యెర్వ శ్రీనివాస్ రెడ్డి 1950లో తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డిపేట మండలం, తాండూరు గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం మార్చు

యెర్వ శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తాండూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 1983లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్‌ అర్ధంతరంగా రద్దు చేశాడు. శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కాసాల కేశవరెడ్డి పై 13028 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. శ్రీనివాస్‌ రెడ్డికి 34360 ఓట్లు రాగా కాసాల కేశవరెడ్డికి 21332 ఓట్లు వచ్చాయి. దీంతో 13028 ఓట్లు మెజారిటీతో విజయం సాధించాడు. ఆయనకు 1989లో జరిగిన అసెంబీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.[1][2]

మూలాలు మార్చు

  1. Sakshi (13 November 2018). "సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  2. Resultuniversity (2021). "Yellareddy Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.