పసుపులేటి రంగాజమ్మ
పసుపులేటి రంగాజమ్మ 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీలలో మొట్టమొదట కనకాభిషేక సత్కారం పొందింది.
జీవిత విశేషాలు
మార్చురంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి, మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరు ను పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని, ఆయన ఆస్థానములో కవయిత్రి. రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.
ఒక చాటువు
మార్చువిజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం:
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి బల్మిచే,
దీవరకత్తెనై,పెనగి తీసుకవచ్చితినా తలోదరీ
ఒక నింద
మార్చుతుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.
రచనలు
మార్చు- మన్నారు దాస విలాసము
- ఉషా పరిణయము
- రామాయణ సంగ్రము
- భారత సంగ్రహము
- భాగవత సంగ్రహము
మన్నారు దాస విలాసము
మార్చుప్రాకృతనాటకమనబడు ఈ యక్షగానం మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించింది.[1]
మూలాలు
మార్చు- ఎందరో మహానుభావులు, తనికెళ్ళ భరణి
Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.