రంజనీ రాఘవన్, కన్నడ సినిమా, టీవి నటి, రచయిత్రి, దర్శకురాలు. పుట్టా గౌరీ మదువే అనే కన్నడ టీవీ సీరియల్ లో తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.[1][2][3][4][5]

రంజనీ 1994లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది.

వృత్తిరంగం

మార్చు

పౌరాణిక సీరియల్ కేళది చెనమ్మలో నాగవేణి అనే చిన్న పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిప రంజనీ, ఆకాశదీప సీరియల్‌లో కథానాయిక సోదరి పాత్రలో నటించింది. ఆ తర్వాత పుట్టగౌరి మదువే అనే సీరియల్‌లోని పాత్రతో గుర్తింపు పొందింది.

ఇస్ట దేవతే సీరియల్‌కి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసింది, మలయాళం సీరియల్ పౌర్ణమి థింకల్‌లో నటించింది. రాజహంస సినిమాలో కూడా ఆమె నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడు ఇతర వివరాలు
2017 రాజహంస హంస జదేష్ కుమార్ హంపి
2018 టక్కర్ పుణ్య రఘు శాస్త్రి
2019 సత్యం గీత అశోక్ కడబ
2021 క్షమిసి నిమ్మ ఖతేయల్లి హనవిల్ల సౌమ్య వినాయక్ కోడ్సర
2021 హకూన మాటాట కిషోర్ మూడబిద్రె వెబ్ సిరీస్

టెలివిజన్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర భాష ఛానల్
2014-2018 పుట్ట గౌరి మదువే గౌరీ కన్నడ కలర్స్ కన్నడ
2019 పౌర్ణమి తింకాల్ పౌర్ణమి మలయాళం ఏషియానెట్
2019–2020 ఇష్ట దేవతే క్రియేటివ్ డైరెక్టర్ డెబ్యూ, స్క్రిప్ట్ రైటర్, కో ప్రొడ్యూసర్ కన్నడ కలర్స్ కన్నడ
2020 కన్నడతి భువనేశ్వరి కన్నడ కలర్స్ కన్నడ

మూలాలు

మార్చు
  1. Daithota, Mudha (October 8, 2018). "Ranjani Raghavan opts out of Putta Gowri Maduve". Times of India. Retrieved December 4, 2018.
  2. "Rangini Raghavan signs her next project, paired opposite Manoj in Raghu Shashtry's Takkar". The New Indian Express. Retrieved 2018-12-04.
  3. "Raghu Shastry reveals Manoj's look in Takker-The New Indian Express".
  4. "Rangani Raghavan turns Script writer and creative director with her new venture".
  5. "Carnatic Music remains the single passion of my life : Ranjani Raghavan".