రంజిత్ మధురసింగ్

శ్రీలంక మాజీ క్రికెటర్

మధురసింగ్ అరాచ్చిగే విజయసిరి రంజిత్ మధురసింగ్, శ్రీలంక మాజీ క్రికెటర్. 1988 - 1992 మధ్య శ్రీలంక తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, పన్నెండు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు.[1]

రంజిత్ మధురసింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మధురసింగ్ అరాచ్చిగే విజయసిరి రంజిత్ మధురసింగ్
పుట్టిన తేదీ (1961-01-30) 1961 జనవరి 30 (వయసు 63)
కురునెగల, శ్రీలంక
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 41)1988 ఆగస్టు 25 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1992 ఆగస్టు 17 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 54)1988 సెప్టెంబరు 4 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1992 జనవరి 19 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991–2000కురుణగల యూత్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 3 12 101 27
చేసిన పరుగులు 24 21 1,736 62
బ్యాటింగు సగటు 4.80 10.50 16.37 6.88
100లు/50లు 0/0 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 11 8* 83* 22
వేసిన బంతులు 396 480 15,391 1,287+
వికెట్లు 3 5 269 25
బౌలింగు సగటు 57.33 71.60 25.55 35.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 11 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 2 0
అత్యుత్తమ బౌలింగు 3/60 1/11 7/85 6/29
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 3/– 51/– 11/–
మూలం: Cricinfo, 2017 జనవరి 1

జననం, విద్య

మార్చు

మధురసింగ్ అరాచ్చిగే విజయసిరి రంజిత్ మధురసింగ్ 1961, జనవరి 30న శ్రీలంకలోని కురునెగలలో జన్మించాడు. కురునేగలలోని మలియదేవ కళాశాలలో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం

మార్చు

దేశీయంగా కురునెగల యూత్ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. 1988లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన అరంగేట్రంలో[2] వికెట్లేమి తీయలేదు, కానీ అతని రెండవ టెస్టులో గొప్ప విజయాన్ని సాధించాడు. చండీగఢ్‌లో అత్యధిక రేటింగ్ ఉన్న భారత బ్యాటింగ్ లైనప్‌కి వ్యతిరేకంగా, 60 పరుగులకు 3 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ వికెట్లు కూడా ఉన్నాయి.[3] 1992-93 ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ వరకు మళ్ళీ ఎంపిక చేయబడలేదు.[4] పదవీ విరమణ తర్వాత, అతను రిఫరీ అయ్యాడు.

మూలాలు

మార్చు
  1. "Ranjith Madurasinghe Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
  2. "SL vs ENG, Sri Lanka tour of England 1988, Only Test at London, August 25 - 30, 1988 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
  3. "IND vs SL, Sri Lanka tour of India 1990/91, Only Test at Chandigarh, November 23 - 27, 1990 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
  4. "AUS vs SL, Australia tour of Sri Lanka 1992, 1st Test at Colombo, August 17 - 22, 1992 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.

బాహ్య లింకులు

మార్చు