రఘురామ్ పిళ్లారిశెట్టి

ఆంకోప్లాస్టిక్ సర్జన్
(రఘురామ్ పిళ్లరిశెట్టి నుండి దారిమార్పు చెందింది)

డాక్టర్‌ రఘురామ్ రొమ్ము క్యాన్సర్‌ వైద్యుడు. హైదరాబాదు లోని కిమ్స్‌ - ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌ సంస్థకు వ్యవస్థాపక డైరెక్టరు. 2022 మార్చిలో బ్రిటిష్‌ఉ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) లభించింది.[4]

డాక్టర్‌ రఘురాం పిళ్ళారిశెట్టి

ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)
జననం (1966-09-22) 1966 సెప్టెంబరు 22 (వయసు 58)
విద్యాసంస్థసిద్ధార్థ మెడికల్ కళాశాల
వృత్తివ్యవస్థాపకులు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్[1] & డైరెక్టర్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్[2]
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వకేసీ, స్క్రీనింగ్, రొమ్ము శస్త్రచికిత్స
తల్లిదండ్రులుప్రొఫెసర్ పి. వి. చలపతి రావు[3]
డాక్టర్ ఉషాలక్ష్మి కుమారి

యూకేలో అత్యున్నత పురస్కారం నైట్‌ హుడ్‌. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఓబీఈ పురస్కారం అందజేస్తారు. భారత్‌లో రొమ్ము క్యాన్సర్‌ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్‌ రఘురామ్ అందిస్తున్న విశేష సేవలకుగాను ఇది వరించింది. 100 సంవత్సరాలలో ఈ సత్కారం పొందిన భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కులలో ఆయన ఒకడు.

ఇంగ్లండ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గౌరవ ఎఫ్‌ఆర్‌సిఎస్‌ను అందుకున్న భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కుడైన సర్జన్.[5][6][7] అతను ఎడిన్‌బరో లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వారి ఓవర్సీస్ గోల్డ్ మెడల్‌ను పొందిన అతి పిన్న వయస్కుడు.[8] 2021లో, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ నుండి గౌరవ ఫెలోషిప్‌ను పొందిన భారతీయ మూలానికి చెందిన మొదటి సర్జన్ కూడా.[9]

బాల్యం, చదువు

మార్చు
 
రఘురాం తండ్రి భారత రాష్ట్రపతి నుండి డా.బి.సి.రాయ్ పురస్కారం అందుకుంటూ

రఘురామ్ 1966 సెప్టెంబరు 22 న, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరులో, డాక్టర్ దంపతులకు జన్మించాడు.[10] అతని తల్లిదండ్రులు బి.సి.రాయ్ జాతీయ పురస్కార గ్రహీత అయిన ప్రొఫెసర్ పి.వి.చలపతిరావు, ఉషాలక్ష్మి కుమారి. అమె క్యాన్సరు నుండి కోలుకున్న వ్యక్తి.[11] అతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, CEO అయిన సత్య నాదెళ్ల అక్కడ అతని సహవిద్యార్థి. రఘురామ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ (MBBS)లో పట్టభద్రుడయ్యాడు. 1995లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ నుండి మొదటి ర్యాంకుతో సర్జరీలో మాస్టర్స్ డిగ్రీని (MS) పొందాడు.[12][13] తర్వాత అతను UK వెళ్లి 1997లో బ్రిటిషు దీవుల్లో ఉన్న నాలుగు సర్జికల్ కళాశాలన్నిటిని నుండీ (ఇంగ్లాండ్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, ఐర్లాండ్) FRCS పొందాడు.[14][15] అతను లండన్‌లోని రాయల్ మార్స్‌డెన్ NHS ఫౌండేషన్ ట్రస్ట్‌లో, నాటింగ్‌హామ్ బ్రెస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీలో హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ & సబ్‌స్పెషాలిటీ శిక్షణను పూర్తి చేశాడు. అతనికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోషిప్ కూడా ఉంది.

వృత్తి

మార్చు

2002లో రఘురామ్ తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. అతను 2007లో భారతదేశానికి వచ్చేసి, హైదరాబాద్‌లోని KIMS హాస్పిటల్స్‌లో బ్రెస్ట్ హెల్త్ కేర్ కోసం ప్రత్యేకంగా కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ అనే సంస్థను తన తల్లి పేరిట స్థాపించాడు.[16][17] వ్యాధి గురించి అవగాహన కల్పించడం కోసం, సంస్థకు రాయబారులుగా అమితాబ్ బచ్చన్, పి. వి. సింధుల సహాయం తీసుకున్నాడు.[18] తరువాత, పింక్ కనెక్షన్ అనే త్రైమాసిక వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించాడు.[19] 2007 నుండి, అక్టోబరు నెలలో (అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల) రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి వార్షిక "పింక్ రిబ్బన్ క్యాంపెయిన్" ప్రారంభించాడు.[20][21]

2012 - 2016 మధ్య, అతను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దక్షిణాసియాలో అతిపెద్ద జనాభా-ఆధారిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జరిపాడు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స అందించాడు.[22][23][24]

క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ (CBE) ఆధారిత రొమ్మును పునరావృతం చేయడానికి మార్గదర్శకాలను రూపొందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ, హై పవర్డ్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG)[25]లో చేరమని 2016 లో భారత ప్రభుత్వం అతన్ని ఆహ్వానించింది.[26][22]

పురస్కారాలు

మార్చు
 
డా. బి.సి.రాయ్ పురస్కారం అందుకుంటూ, డా.రఘురామ్

రఘురామ్ 2021 సంవత్సరపు క్వీన్ ఎలిజబెత్ II నూతన సంవత్సర గౌరవాల జాబితాలో ఉన్నాడు. 100 సంవత్సరాలలో OBE - ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్‌తో సత్కరించబడిన భారతీయ సంతతికి చెందిన అతి పిన్న వయస్కులలో ఆయనొకడు.[27] భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ సంరక్షణ, శస్త్రచికిత్స విద్య, UK-భారత సంబంధాలకు గాను అతనికి ఈ సత్కారం లభించింది.[28][29][30] అతనికి 2022 మార్చి 20 న విండ్సర్ కాజిల్‌లో ప్రిన్స్ చార్లెస్ అధికారికంగా OBEని ప్రదానం చేశాడు.[31][32]

భారత ప్రభుత్వం రఘురామ్‌ని 2015 రిపబ్లిక్ డే గౌరవాల జాబితాలో నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీ ప్రదానం చేసింది.[33][34] తెలుగు రాష్ట్రాల్లో ఈ పురస్కారం పొందిన అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్‌గా నిలిచాడు.[35]

2017లో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని 2016లో 'సోషియో మెడికల్ రిలీఫ్ రంగంలో అత్యుత్తమ సేవ' కోసం డాక్టర్ బి సి రాయ్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.[36]

2021లో, ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ & ఐర్లాండ్ వారి గౌరవ ఫెలోషిప్ పొందాడు. ఈ ఫెలోషిప్ పొందిన భారతీయ సంతతికి చెందిన మొదటి సర్జన్ అతడు.[37][38]

2015లో తెలంగాణ, మెదక్ జిల్లాలో 1500 మంది జనాభా ఉన్న మారుమూల గ్రామమైన ఇబ్రహీంపూర్‌ను దత్తత తీసుకున్నాడు.[39]

మూలాలు

మార్చు
  1. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Archived from the original on 2022-05-04. Retrieved 2022-03-31.
  2. "KIMS-Ushalakshmi Center for Breast Diseases". www.breastcancerindia.org.
  3. "India's renowned surgeon Chalapathi Rao passes away". The Times of India (in ఇంగ్లీష్). November 23, 2020.
  4. "Dr Raghu Ram: బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ రఘురాం". EENADU. Retrieved 2022-03-31.
  5. "Hyderabad Doctor Gets Honorary Fellowship From Royal College Of Surgeons".
  6. "Hyderabad: Dr P Raghu Ram gets honorary FRCS from Royal College of Surgeons". The Times of India. 7 July 2022.
  7. "Indian Origin Surgeon Dr P Raghu Ram conferred with Honorary FRCS by The Royal College of Surgeons of England". 7 July 2022.
  8. "Six from T, AP awarded Padma Shri". Times of India. Hyderabad. 26 January 2015. Retrieved 8 October 2018.
  9. "Another distinction for TS surgeon". The Hindu (in Indian English). 20 July 2021.
  10. "Pink Connexion, Ushalakshmi Breast Cancer Foundation". UBF. Retrieved 29 June 2020.
  11. "Six from T, AP awarded Padma Shri". Times of India. Hyderabad. 26 January 2015. Retrieved 8 October 2018.
  12. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Retrieved 2020-06-12.
  13. "International Advisor receives Padma Shri | RCSEd". The Royal College of Surgeons of Edinburgh (in ఇంగ్లీష్). Retrieved 2022-07-25.[permanent dead link]
  14. "Breast Surgeon DR P Raghu Ram conferred Honorary Fellowship of Royal College of Surgeons Thailand". medicaldialogues.in (in ఇంగ్లీష్). 2019-07-15. Retrieved 2020-06-11.
  15. "Honour for city doctor" (PDF). UBF. 19 February 2019. Retrieved 11 June 2020.
  16. Rajendra, Ranjani (2015-02-09). "Road less travelled". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-11.
  17. "KIMS-Ushalakshmi Center for Breast Diseases". www.breastcancerindia.org. Retrieved 2020-06-11.
  18. Rajendra, Ranjani (2015). "Road less travelled, The Hindu, 9 February 2015". The Hindu. Retrieved 29 June 2020.
  19. "Pink Connexion, Ushalakshmi Breast Cancer Foundation". UBF. Retrieved 29 June 2020.
  20. "A decade of 'Pinktober' in Hyderabad!". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-29.
  21. Chapter 35: Breast Cancer Global Quality Care (pages 371 – 376), Oxford University Press. Oxford University Press. p. 35.
  22. 22.0 22.1 Chapter 35: Breast Cancer Global Quality Care (pages 371 – 376) (PDF). Oxford University Press.
  23. P.s, Rohit (2016-03-08). "TS, AP join hands to fight breast cancer". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-06-29.
  24. Ram, P Raghu (2011). "Breast Healthcare in India : Time For A Paradigm Shift". The Bulletin of the Royal College of Surgeons of England. 93 (7): 250–252. doi:10.1308/147363511X579099.
  25. "City-based cancer specialist appointed to advisory body". The Hindu (in Indian English). 2016-11-28. ISSN 0971-751X. Retrieved 2020-06-29.
  26. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Retrieved 2020-06-29.
  27. "What is the difference between a CBE, OBE, MBE and a knighthood?". www.thegazette.co.uk (in ఇంగ్లీష్).
  28. "Raghu Pillarisetti". www.thegazette.co.uk.
  29. "Hyderabad surgeon Raghu Ram in Queen's Honours list". The Times of India (in ఇంగ్లీష్). January 1, 2021.
  30. "Surgeon Raghu Ram Pillarisetti Named In Queen Elizabeth II's New Year's Honours List". NDTV.com.
  31. "Hyderabad-Based Cancer Surgeon Conferred With Prestigious UK Honour". NDTV.com. Retrieved 2022-04-02.
  32. "raghu ram: Dr Raghu Ram Conferred Obe | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 31 March 2022. Retrieved 2022-04-02.
  33. "The Hindu". 26 January 2015. Retrieved 8 March 2015.
  34. "Dr Raghu Ram to receive Padma Shri today". www.thehansindia.com (in ఇంగ్లీష్). 2015-03-30. Retrieved 2020-06-11.
  35. "Six from T, AP awarded Padma Shri". Times of India. Hyderabad. 26 January 2015. Retrieved 8 October 2018.
  36. "Padma awards" (in ఇంగ్లీష్). 2017. Archived from the original on Jun 5, 2023. Retrieved 11 August 2023.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  37. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in.
  38. "Another distinction for TS surgeon". The Hindu (in Indian English). 20 July 2021.
  39. "Surgeon's remedy for Ibrahimpur". The Hindu (in Indian English). 2016-05-25. ISSN 0971-751X. Retrieved 2020-12-31.