హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో ఒక పేరెన్నికగల విద్యాసంస్థ. ఈ సంస్థకు 100 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని ప్రఖ్యాత వరల్డ్ మ్యాగజైన్ గుర్తించింది. 140 ఎకరాల సువిశాల ప్రాంగణం, పెద్ద క్రీడా మైదానం, ఎటు చూసినా పచ్చదనం, అత్యాధునిక వసతులతో కూడి ఉంది ఈ విద్యాసంస్థ. ఈ సంస్థలో చదివిన ఎందరో విద్యార్థులు అత్యున్నత స్థానములలో స్థిరపడ్డారు. మన రాష్ట్రంలో ఈ విద్యాసంస్థకు కడపలో శాఖా సంస్థ ఉంది. 2014 ఫిబ్రవరి 4 న ఈ సంస్థ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సంస్థ మూడవ ముఖ్య కార్య నిర్వహణ అధికారిగా నియమింపబడిన సందర్భంగా ఈ విద్యాసంస్థ పేరు వార్తలలో నిలిచించి. దీని రెండవ ప్రాంగణం రామంతాపూర్ ప్రాంతంలో ఉంది.

ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
Hyd Public School.jpg
స్థానం
Map
,
సమాచారం
రకంపబ్లిక్
స్థాపన1923
బోధనా సిబ్బంది102
విద్యార్ధుల సంఖ్య590 (మొత్తం), 406 (9-12)
Campus160 ఎకరాలు
Color(s)Blue and gold
WebsiteOfficial website
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట

చరిత్రసవరించు

ఉన్నత వర్గాల వారి కోసం ముఖ్యంగా నవాబులు, జాగీర్‌దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1923లో ‘జాగీర్‌దార్ స్కూల్’ పేరుతో ప్రారంభమైందీ పాఠశాల. అప్పటి జాగీర్‌దార్లలో ఒకరైనా సర్ వికార్-ఉల్-ఉమా బహుల్‌ఖానగూడ పేరుతో ఉన్న ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. బ్రిటిష్ విద్యావేత్త షాక్రాస్ మొదటి ప్రిన్సిపాల్‌గా... ముగ్గురు విద్యార్థులతో పాఠశాల మొదటి బ్యాచ్ ప్రారంభమైంది.

1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో... అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్‌దార్ స్కూల్ పబ్లిక్ స్కూల్‌గా రూపాంతరం చెందింది. నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి అధ్యక్షుడిగా హెచ్‌పీఎస్ సొసైటీ ఏర్పాటైంది. బాలులకు మాత్రమే పరిమితమైన హెచ్‌పీఎస్ 1988 నుంచి బాలికలకు కూడా ప్రవేశాలు కల్పించింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

ప్రముఖ పూర్వ విద్యార్థులుసవరించు

ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. రాజకీయ నాయకులుగా, సినీతారలుగా, వ్యాపారవేత్తలుగా ఉన్నారు. వారిలో కొందరు.

ఇవికూడా చూడండిసవరించు

బయటి లంకెలుసవరించు