రణధీర్ సింగ్

ఢిల్లీకి చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు

రణధీర్ సింగ్ (1957, ఆగస్టు 16 - 2023, మార్చి 8) ఢిల్లీకి చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. 1981, 1983లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై భారతదేశం తరపున రెండు వన్డేలు ఆడాడు.[1]

రణధీర్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1957, ఆగస్టు 16
ఢిల్లీ
మరణించిన తేదీ2023, మార్చి 8 (వయసు 65)
జంషెడ్‌పూర్, జార్ఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు
బ్యాటింగు సగటు
100లు/50లు –/–
అత్యుత్తమ స్కోరు -–
వేసిన బంతులు 72
వికెట్లు 1
బౌలింగు సగటు 48.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు 1/30
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 2006 మార్చి 6

రణధీర్ సింగ్ 1957 ఆగస్టు 16న ఢిల్లీలో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

కుడిచేతి వాటం బ్యాటింగుతో, కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలింగుతో రాణించాడు.

1981 నవంబరు 25న అహ్మదాబాదు వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[2] 1983, డిసెంబరు 17న గౌహతి వేదికగా వెస్టిండీస్‌ జరిగిన వన్డేలో చివరిసారిగా ఆడాడు.[3]

1978/79 - 1988/89 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 65 మ్యాచ్ లలో 647 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 45 (నాటౌట్) చేశాడు. 10,610 బంతులు వేసి 5,388 పరుగులు ఇచ్చి, 146 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 6/95.

1979/80 - 1988/89 మధ్యకాలంలో లిస్ట్ ఎ క్రికెట్ లో 23 మ్యాచ్ లలో 79 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 30 (నాటౌట్) చేశాడు. 1,077 బంతులు వేసి 765 పరుగులు ఇచ్చి, 28 వికెట్లు తీశాడు. అత్యుత్తమ బౌలింగ్ 3/18.

రణధీర్ సింగ్ తన 65 సంవత్సరాల వయస్సులో 2023, మార్చి 8న జార్ఖండ్ లోని జంషెడ్‌పూర్‌లో మరణించాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Randhir Singh Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  2. "IND vs ENG, England tour of India 1981/82, 1st ODI at Ahmedabad, November 25, 1981 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  3. "IND vs WI, West Indies tour of India 1983/84, 5th ODI at Guwahati, December 17, 1983 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  4. "Randhir Singh". ESPN Cricinfo. Retrieved 2023-08-05.