రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్

రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర ఉపరితల రవాణా, రోడ్డు శాఖ సహాయ మంత్రిగా, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.

రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్
రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్


హోమ్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 అక్టోబర్ 2012 – 26 మే 2014
ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్
తరువాత కిరెణ్ రిజిజు

పెట్రోలియం శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
19 జనుఅరీ 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్

కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి
పదవీ కాలం
19 జనుఅరీ 2011 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు జితిన్ ప్రసాద
తరువాత పనబాక లక్ష్మి

ఉపరితల రవాణా , రోడ్డు శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – 19 జనవరి 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

లోక్ సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
తరువాత రాజేష్ పాండే
నియోజకవర్గం ఖుషి నగర్ నియోజకవర్గం

శాసనసభ్యుడు
పదవీ కాలం
1996 – 2009
ముందు బలేశ్వర్ యాదవ్
తరువాత స్వామి ప్రసాద్ మౌర్య
నియోజకవర్గం పద్రౌనా నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-25) 1964 ఏప్రిల్ 25 (వయసు 59)[1]
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2022-present)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
(1990-2022)
జీవిత భాగస్వామి సోనియా సింగ్
సంతానం 3
నివాసం ఖుషినగర్, ఉత్తర ప్రదేశ్
పూర్వ విద్యార్థి ది డూన్ స్కూల్

రాజకీయ జీవితం మార్చు

రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో పద్రౌనా అసెంబ్లీ స్థానం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత 2002, 2007లో కూడా వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆర్‌పిఎన్ సింగ్ 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో, 2004లో పోటీ రెండో స్థానంలో నిలిచి 2009 లోక్‌సభ ఎన్నికలలో గెలిచి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉపరితల రవాణా, రోడ్డు శాఖ సహాయ మంత్రిగా, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి రాజేష్ పాండే చేతిలో 85,540 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2022 జనవరి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు మార్చు

  1. Lok Sabha Member (2021). "Ratanjit Pratap Narain Singh". Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.
  2. TV9 Telugu (25 January 2022). "కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. మాజీ కేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్ రాజీనామా..!". Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (14 February 2024). "గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్‌". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.