రమేష్ గెల్లి
రమేష్ గెల్లి భారతదేశంలో బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్. వైశ్యా బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేశాడు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకుకు (జిటిబి) ప్రమోటర్, చైర్మన్.[1][2] గెల్లి 1993 లో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉన్నత అధికారి జయంత్ మాధబ్‌తో కలిసి జిటిబిని స్థాపించాడు. 2001 లో గెల్లీని జిటిబి చైర్మన్ పదవి నుండి తొలగించారు. ఆ తరువాత విలీనం చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతన్ని బ్యాంకు బోర్డు నుండి తొలగించింది. 2004లో, జిటిబి అనుమతించదగిన స్థాయిలకు మించి నిరర్థక ఆస్తులను పోగుచేసుకోవడం, దాని నికర విలువ ప్రతికూలంగా మారడంతో, తప్పుడు నిర్వహణ నిర్లక్ష్యపు రుణ విధానాల ఆరోపణల మధ్య RBI, జిటిబి కార్యకలాపాలను నిలిపివేసింది. ఆ తర్వాత జిటిబిని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం చేసింది.[3][4][5]
రమేష్ గెల్లి | |
---|---|
చైర్మన్, మేణేజింగ్ డైరెక్టర్ (సిఎమ్‌డి) గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు | |
In office 1993–2001 | |
చైర్మన్, మేణేజింగ్ డైరెక్టర్ (సిఎమ్‌డి) వైశ్యా బ్యాంకు |
గెల్లి ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పొందాడు. అక్కడ అతను తన తరగతిలో అగ్రస్థానంలో పట్టభద్రుడయ్యాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో పనిచేశాక, 1980 లో వైశ్యా బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. మూడేళ్ల తర్వాత వైశ్యా బ్యాంక్ సీఎండీగా ఎదిగాడు.
1990 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ, ఉద్యోగ్ రతన్‌తో సత్కరించింది. ఈ గౌరవం పొందిన మొదటి బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ అతడు.[6]
మూలాలు
మార్చు- ↑ Sharma, Manoranjan (2008-01-01). Dynamics Of Indian Banking : Views And Vistas. Atlantic Publishers & Dist. pp. 221–. ISBN 9788126909988. Retrieved 25 March 2012.
- ↑ Ramana, K V (16 February 2004). "Gelli may jump into politics". The Times of India. Archived from the original on 10 July 2012. Retrieved 25 March 2012.
- ↑ Gupte (2004).
- ↑ Sridar (2004).
- ↑ Marcello (2004).
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved July 21, 2015.