రమేష్ బైస్ (ఆంగ్లం:Ramesh Bais) (జననం 1948 ఆగస్టు 2) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్ర 10వ గవర్నరుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.[1] ఇంతకు పూర్వం ఇతను 2019 లో త్రిపుర రాష్ట్ర 18 వ గవర్నర్‌గా కూడా పనిచేశాడు.[2] ఇతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు, 1999 నుండి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా ఉన్నాడు. ఇతను రాయపూర్ నియోజకవర్గం నుండి 9 వ (1989), 11 వ (1996), 12 వ, 13 వ, 14 వ (2004), 15 ఇంకా 16 వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

రమేష్ బైస్
రమేష్ బైస్


ఝార్ఖండ్ రాష్ట్ర 10వ గవర్నరు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 14

త్రిపుర రాష్ట్ర 18వ గవర్నరు
పదవీ కాలం
2019 జులై 29 – 2021 జులై 6
ముందు కెప్టెన్ సింగ్ సోలంకి
తరువాత సత్యదేవ్ నారాయణ్ ఆర్య

పదవీ కాలం
1996 – 2019
తరువాత సునీల్ కుమార్ సోని
పదవీ కాలం
1989 – 1991

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
పదవీ కాలం
2004 జనవరి 9 – 2004 మే 23
ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి

ఘనుల శాఖ కేంద్ర రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
2003 జనవరి 29 – 2004 జనవరి 8
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు ఉమా భారతి
తరువాత మమతా బెనర్జీ

కేంద్ర సమాచార , ప్రసార శాఖ మంత్రి
పదవీ కాలం
2000 – 2003
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

కేంద్ర రసాయన , ఎరువుల శాఖ మంత్రి
పదవీ కాలం
1999 అక్టోబరు 13 – 2000 సెప్టెంబరు 30
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

వ్యక్తిగత వివరాలు

జననం (1948-08-02) 1948 ఆగస్టు 2 (వయసు 75)
రాయపూర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రమాబాయి
సంతానం 3
నివాసం ఢిల్లీ

వ్యక్తిగత జీవితం మార్చు

బైస్ 1948 ఆగస్టు 2 న మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రాయ్‌పూర్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ) లో ఒక హిందూ క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఖోమలాల్ బైస్. భోపాల్ పట్టణంలో బైస్ తన హయ్యర్ సెకండరీ విద్య BSE ను పూర్తి చేశాడు. ఇతనికి 1969 మే 23న రాంబాయి బైస్ తో వివాహమైనది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బైస్ వృత్తిరీత్యా వ్యవసాయదారుడు.[3]

రాజకీయ జీవితం మార్చు

1978 లో రాయ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు బైస్ మొదటిసారి ఎన్నికయ్యాడు. మందిర్ హసోద్ నియోజకవర్గం నుండి 1980 MP అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు, ఆ తరువాత దఫా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సత్యనారాయణ శర్మ చేతిలో ఓడిపోయాడు. 1989లో రాయపూర్ నియోజకవర్గం నుండి మొట్టమొదటి సారి 11వ లోక్సభ సభ్యునిగా ఎన్నికైన బైస్ ఆ తరువాత క్రమంగా 12,13,14,16వ లోక్సభ ఎన్నికలు కూడా గెలుపొందాడు.

బైస్ 2019 జూలై నుండి 2021 జూలై వరకు త్రిపుర రాష్ట్ర 18 వ గవర్నర్‌గా పనిచేశాడు[4], ప్రస్తుతం 2021 జూలై 14 నుండి జార్ఖండ్ 10 వ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.[5]

మూలాలు మార్చు

  1. "Governor designate Ramesh Bais reaches Ranchi, to take oath on Wednesday". United News of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
  2. "Tripura On Road To Development, Says Outgoing Governor Ramesh Bais". Outlook (in ఇంగ్లీష్). Retrieved 2021-07-13.
  3. "Current Lok Sabha Members Biographical Sketch". 5 September 2004. Archived from the original on 5 September 2004. Retrieved 21 July 2019.
  4. Sarkar, Ipsita (20 July 2019). "Centre appoints new Governors in 6 states, Anandiben Patel transferred to UP". Zee News (in ఇంగ్లీష్). Retrieved 21 July 2019.
  5. "Ramesh Bais takes oath as Jharkhand Governor". The Hindu (in Indian English). PTI. 2021-07-14. ISSN 0971-751X. Retrieved 2021-07-15.{{cite news}}: CS1 maint: others (link)

బాహ్య లింకులు మార్చు