రమేష్ మెండిస్

శ్రీలంక క్రికెటర్

వనిగముని రమేష్ తరిందా మెండిస్, శ్రీలంక క్రికెటర్. శ్రీలంక క్రికెట్ జట్టు తరపున జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 2014 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో భాగంగా ఉన్నాడు. 2021 జనవరిలో శ్రీలంక క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[1]

రమేష్ మెండిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వనిగముని రమేష్ తరిందా మెండిస్
పుట్టిన తేదీ (1995-07-07) 1995 జూలై 7 (వయసు 29)
అంబలంగోడ, శ్రీలంక
ఎత్తు5 అ. 8 అం. (1.73 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 154)2021 22 జనవరి - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2023 24 జూలై - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 197)2021 28 మే - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2022 21 జనవరి - జింబాబ్వే తో
తొలి T20I (క్యాప్ 89)2021 28 జూలై - ఇండియా తో
చివరి T20I2021 29 జూలై - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020Dambulla Viiking
2021Dambulla Giants
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 8 4 2 49
చేసిన పరుగులు 162 50 2 2,534
బ్యాటింగు సగటు 13.50 25.00 2.00 40.22
100లు/50లు 0/0 0/0 0/0 5/11
అత్యుత్తమ స్కోరు 33 26 2 300*
వేసిన బంతులు 2,058 72 24 6,528
వికెట్లు 34 4 1 109
బౌలింగు సగటు 30.52 18.50 22.00 34.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 0 1
అత్యుత్తమ బౌలింగు 6/70 2/26 1/13 6/70
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 1/– 0/– 26/–
మూలం: Cricinfo, 24 జులై 2022

వనిగముని రమేష్ తరిందా మెండిస్ 1995, జూలై 7న శ్రీలంకలోని అంబలంగోడలో జన్మించాడు.

దేశీయ క్రికెట్

మార్చు

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[2][3] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం క్యాండీ జట్టులో కూడా ఎంపికయ్యాడు.[4] 2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[5]

2018–19 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో మూర్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తొమ్మిది మ్యాచ్‌లలో 612 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[6] టోర్నమెంట్‌లో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా ఉన్నాడు, తొమ్మిది మ్యాచ్‌లలో 30 అవుట్‌లను చేశాడు.[6]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2021 జనవరిలో ఇంగ్లాండ్‌తో శ్రీలంక టెస్టు మ్యాచ్‌లకు రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.[7][8] 2021 జనవరి 22న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరపున అరంగేట్రం చేశాడు.[9] 2021 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో మెండిస్‌ని చేర్చారు.[10]

2021లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో మెండిస్ 2/86, 4/103 బౌలింగ్ గణాంకాలను చేశాడు.[11] బంగ్లాదేశ్ 202 పరుగుల తేడాతో మ్యాచ్‌లో ఓడిపోయిన మరో ఎండ్ నుండి అరంగేట్రం ఆటగాడు ప్రవీణ్ జయవిక్రమ వికెట్లు తీయడంలో సహాయం చేశాడు. చివరకు శ్రీలంక 1-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.[12]

2021 మే లో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[13] 2021 మే 28న శ్రీలంక తరపున బంగ్లాదేశ్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు,[14] రెండు వికెట్లు తీసుకున్నాడు.[15]

2021 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక జట్టులో అతను ఎంపికయ్యాడు.[16] 2021 జూలై 28న శ్రీలంక తరపున భారత్‌పై తన ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[17]

ప్రస్తావనలు

మార్చు
  1. "Ramesh Mendis". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  2. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-25.
  3. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-25.
  4. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-25.
  5. "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-25.
  6. 6.0 6.1 "Premier League Tournament Tier A, 2018/19 - Moors Sports Club: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  7. "Avishka, Ramesh get call for England Test series". The Sunday Times (Sri Lanka). Retrieved 2023-08-25.
  8. Nawaz, Althaf. "SLC to call up six new players for England Series". Daily News. Retrieved 2023-08-25.
  9. "2nd Test, Galle, Jan 22 - Jan 26 2021, England tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  10. "Shanaka named as Sri Lankan T20I captain for West Indies tour". BD Crictime. Retrieved 2023-08-25.
  11. "Praveen Jayawickrama's stunning debut seals Sri Lanka's dominant victory". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-25.
  12. "Dimuth Karunaratne: Praveen Jayawickrama 'does the simple things well'". ESPNcricinfo. Retrieved 2023-08-25.
  13. "Kusal Perera named new Sri Lanka ODI captain; Karunaratne, Mathews, Chandimal dropped". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  14. "3rd ODI (D/N), Dhaka, May 28 2021, Sri Lanka tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  15. "Kusal Perera, Dushmantha Chameera prevent Bangladesh sweep". espncricinfo. Retrieved 2023-08-25.
  16. "Bhanuka Rajapaksa picked for India ODIs, T20Is; Kumara, Rajitha return from injuries". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  17. "2nd T20I (N), Colombo (RPS), Jul 28 2021, India tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-08-25.

బాహ్య లింకులు

మార్చు