సూర్యుడు (జ్యోతిషం)

(రవి(జ్యోతిషం) నుండి దారిమార్పు చెందింది)
  • జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుడిని జ్యోతిష శాస్త్రంలో అధికంగా రవి అని వ్యవహరిస్తారు.
  • లింగం:- సూర్యుడు పురుష గ్రహం.
  • స్వభావం:- సూర్యుని స్వభావం పాప స్వభావం.
  • రాశి చక్రంలో స్థితి:- సూర్యుడు రాశి చక్రంలో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.
  • ఇతర నామాలు:- సూర్యుడికి ఉన్న ఇతరనామాలలో కొన్ని అర్కుడు, ఆదిత్యుడు, అరుణుడు, తపసుడు, పూష, హేళీ, భానుడు, దినకరుడు, మార్తడుడు.
  • జాతి:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని జాతి క్షత్రియ,
  • తత్వం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని తత్వం అగ్ని,
  • వర్ణం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని వర్ణం రక్తవర్ణం,
  • గుణం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని గుణం రజోగుణం,
  • గ్రహతత్వం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం,
  • రుచి:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే రుచి కారం,
  • గ్రహ స్థానం:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుని స్థానం దేవాలయం,
  • జీవులు:- జ్యోతిష శాస్త్రంలోసూర్యుడు కారకత్వం వహించే జీవులు పక్షులు,
  • గ్రహోదయం:- పృష్టోదయం,
  • ఆధిపత్య దిక్కు :_ తూర్పు,
  • జలభాగం:- నిర్జల,
  • లోహం:- రాగి,
  • పాలనా:- శక్తి రాజు,
  • ఆత్మాధికారం:- ఆత్మ, శరీర
  • ధాతువు:- ఎముక,
  • కుటుంభ సభ్యుడు:- తండ్రి,
  • గ్రహవర్ణం:- శ్యాల వర్ణం,
  • గ్రహ పీడ:- శిరోవేదన, శరీర తాపం,
  • గృహంలో భాగములు:- ముఖ ద్వారం, పూజా మందిరం,
  • గ్రహ వర్గం:- గురువు,
  • కాల బలం:- పగటి సమయం,
  • దిక్బలం:- దశమ స్థానం,
  • ఆధిపత్య కాలం:- ఆయనం,
  • శత్రు క్షేత్రం:- మకరం, కుంభం,
  • విషమ క్షేత్రం:- వృశ్చికం, ధనస్సు, మకరం.
  • మిత్రక్షేత్రం:- మీనము.
  • సమ క్షేత్రం:- మిధునం, కన్య.
  • సూర్యుడు సింహ రాశిలో 20 డిగ్రీలలో మూల త్రికోణంలోనూ, మేష రాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛలోను, తులా రాశిలో 10 డిగ్రీలలో పరమ నీచను పొందుతుంది. *మిత్రగ్రహాలు :- కుజుడు, చంద్రుడు, గురువు.
  • శత్రు గ్రహాలు:- శుక్రుడు, శని.
  • సమ గ్రహం:- బుధుడు.
  • నైసర్గిక బల గ్రహం:- శుక్రుడు,
  • వ్యధా గ్రహం:- శుక్రుడు.
  • దిన చలనం:- 1 డిగ్రీ.
  • ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,
  • రాశిలో ఫలమిచ్చే భాగం:- మొదటి భాగం,
  • ఋతువు:- గ్రీష్మ ఋతువు,
  • గ్రహ ప్రకృతి:- పిత్తము.
  • దిక్బలం:- దక్షిణ దిక్కు.,

‍* పరిమాణం:- పొడుగు,

సూర్య గ్రహ గుణగణాలు

సూర్యుడు జ్యోతిష శాస్త్రంలో ఇలా వర్ణించారు. గుండ్రని ముఖం, రక్తవర్ణం, పొడగరి, గోధుమ వర్ణం కలిగిన జుట్టు కలిగిన వాడుగా వర్ణించబడ్డాడు. గుణత్రయాలలో సూర్యుని స్వభావం రజోగుణం. రుచులలో సూర్యుడు కారం రుచికి కారకత్వం వహిస్తాడు. చాతుర్వర్ణములలో సూర్యుడు క్షత్రియ జాతికి కారకత్వం వహిస్తాడు. తత్వం అగ్ని తత్వం, ప్రకృతి పిత్త ప్రకృతి. దిక్కు తూర్పు దిక్కు, లోహము రాగి, రత్నము మాణిక్యము, దిక్బలం దశమ స్థానం, రాశి సంఖ్య 1, కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తర ఆషాఢ నక్షత్రాలకు నక్షత్రాధిపత్యం వహిస్తాడు. శరీరావయవాలలో గుండే, పురుషులకు కుడి కన్ను, స్త్రీలకు ఎడమ కన్ను, రాశ్యాధిపత్యం సింహరాశి, మేహరాశిలో 10 డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిని, సింహరాశిలో 20 ఇగ్రీలలో రాజ్యాన్ని, తులా రాశి 10 డిగ్రీలలో నీచను పొందుతాడు.

సూర్యుని ప్రభావం

సూర్యుని ప్రభావం ఉన్న వారు ఆత్మాభిమానం, చురుకు తనం కలిగి ఉంటారు. సంఘంలో పలుకుబడి ఉంటుంది. దుబారా వ్యయం, పొగడ్తలకు లొంగుట, ఆవేశపడుట, సమయస్ఫూర్తి కలిగి ఉంటారు. చక్కని సంపాదన ఉంటుంది. కంటి జబ్బులు, గుండె జబ్బులు, వడదెబ్బకు గురి అగుట వంటి శారీరక అవస్థలకు గురి ఔతుంటారు. పిత్త ప్రకృతి కలిగి ఉంటారు.

కారకత్వములు

సూర్యుడు ఆత్మకు, తండ్రికి, శక్తికి, అగ్నికి, ప్రతాపానికి, ఆకాశము, దిక్కు తూర్పు, దేశాధిపత్యములకు కారకత్వము వహిస్తాడు. ముళ్ళ చెట్లకు, పంటలలో మిరియాలు, మిరపకాయలు, కొబ్బరి, వాము, బియ్యం మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు. శివ భక్తులు, శివ పూజ, శివాలయాలకు కారకత్వం వహిస్తాడు, జంతువులలో సింహం, ఎలుగుబంటి, గుర్రము, సర్పములకు కారకత్వం వహిస్తాడు. పక్షులలో కాకి కోకిల, కోడి, హంసలకు కారకత్వం వహిస్తాడు. వృత్తులలో ప్రభుత్వ కార్యాలయాలు, హృదయ సంబంధిత మందులు, వైద్యులు, రిజర్వ్ బ్యాంక్ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు. ఆకాశ సంబంధిత విమానాలు, విమానాశ్రయము, ఖ్హగోళము, వాతావరణము, విమాన చోదకులు, విద్యుత్ సంబంధిత బ్యాటరీలు, విద్యుత్తు ఉత్పత్తి, భూకంపాలు, ఆకాశ వాణి, దూరదర్శన్వంటి ప్రసార సంబంధిత మాద్యమ వృత్తులు, విద్యుత్తు ఉపకరణ సంబంధిత వృత్తులకు కారకత్వం వహిస్తాడు.

రాశులు సూర్యుడు

సూర్యుడు మేష రాశి 10 డిగ్రీలలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు. సిం,హరాశిలో 20 డిగ్రీల వద్ద రాజ్యా స్థితిని పొందుతాడు. సింహం సూర్యునికి స్వక్షేత్రం, మూల త్రికోణ క్షేత్రం. సూర్యుడికి కుంభరాశి, మకర రాశి శత్రు క్షేత్రాలు, కాగా కన్యా రాశి, మిధున రాశి సమ క్షేత్రాలు. మీనం మిత్ర క్షేత్రం. వృశ్చిక, ధనస్సు, మకరాలు విషమ క్షేత్రాలు.

సూర్యుడు గ్రహాలు

సూర్యుడికి గురువు, చంద్రుడు, కుజుడు మిత్ర గ్రహాలు. శుక్రుడు, శని శత్రు గ్రహాలు. బుధుడు నైసర్గిక బలం కలిగిన గ్రహం. వ్యధా గ్రహం శుక్రుడే.

సూర్య ఆరాధన

సూర్యుడు తెలుగు సంవవత్సరం ప్రభవ మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు విశాఖ నక్షత్రంలో అతిథి, కశ్యపులకు జన్మించాడు కనుక సూర్యునికి రథసప్తమి నాడు విశేష పూజలు జరుపుతారు. సూర్యుడి పూజార్ధం రాగి విహగ్రహం ప్రతిష్ఠిస్తారు. గోధుమలు, బెల్లంతో వండిన పాయసం నైవేద్యంగా పెడతారు. గ్రహ ప్రీత్యర్ధం బెల్లం కలిపిన అన్నం సమర్పిస్తారు. సూర్యుడికి పళ్ళు లేవని అందువలన పాయసం అతడికి ప్రీతి కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు సప్త వర్ణాలకు ప్రతీకగా సప్త అశ్వములు పూన్చిన రథం మీద ఆరూఢుడై ఉంటాడు. వినతా పుత్రుడైన అనూరుడు సూర్యుడికి సారథి. అనూరుడు గరుత్మంతుని అన్న. శ్రీరామ నవమి సూర్య గ్రహ ప్రీత్యర్ధం చేయబడే మరి ఒక పండుగ. సూర్యుడికి ప్రీతికరమైన తిథి జ్యేష్ట శుక్ల ద్వాదశి, కార్తిక శుక్ల సప్తమి. సూర్యుడి ప్రీత్యర్ధం ఆదివార వ్రతం చేస్తారు. సూర్యుడిని వివిధరకాలుగా స్త్రోత్రం చేస్తారు. వాటిలో కొన్ని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య అష్టోత్తర శతనామావళి మొదలైనవి. సూర్యుని ప్రీత్యర్ధం విష్ణుసహస్రనామ పారాయణ, హరి వంశ పురాణం పారాయణ చేస్తారు. గాయత్రీ మంత్రోపాసన, దీక్ష. జపం సూర్యునికి ప్రీతి కలిగిస్తుంది. సూర్యునికి ప్రతి రోజు త్రి సంధ్యలలో సంధ్యా వందనం చేయడం హిందూ సంప్రదాయాలలో ఒకటి.

ద్వాదశభావాల్లో సూర్యుడు

  • మేషం:- సూర్యుడు మేషరాశిలో ఉన్న వ్యక్తి కార్యకుశలత లలిగి ఉంటాడు. వీరికి పట్టుదల అధికం. కష్టసాధ్యమఇన పని అయినా శ్రమ పడి సాధిస్తారు. తమ మీద విశ్వాసం ఎక్కువ ఇతరుల సామధ్యం మీద విశ్వాసం తక్కువ కనుక ఇతరులు వీరిని గర్వము కలినన వారుగా భావిస్తారు. కాని వీరు నిష్కపటులు అని సన్నిహితులు గ్రహిస్తారు. పొగడ్తలకు లొంగే గుణము కలిగి ఉంటారు. ధైర్యసాహసాలు కలిగి ఉంటారు.
  • వృషభం:- సూర్యుడు వృషభంలో ఉన్న వారు స్థిరమైన స్వభావము కలిగి ఉంటారు. అలంకార ప్రియులు. తమకు వీలైంతగా తామున్న ప్రదేశాలను అలంకరిస్తారు.

అలంకరణ సామాగ్రికి అధికంగా వెచ్చిస్తారు.

  • మిధునం:- సూర్యుడు మిధున రాశిలో ఉన్న వారు వాక్చాతుర్యం కలిగి ఉంటారు. సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇతరుల అభిప్రాయాలు సరి అయిన వాదనతో మార్చగలిగిన చతురత ప్రదర్శిస్తారు. వీరు తమ వాహనాదులను తరచూ మారుస్తుంటారు. తమ నేర్పు సమయస్ఫూర్తి వాకచాతుర్యంతో తామున్న చోటుకంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు.
  • కటకం:- సూర్యుడు కటకరాశిలో ఉన్న వ్యక్తి హాస్యసంభాషణా ప్రియులు. బంధువులను ఆదరించే గుణము. పొదుపు పాటించడము. భూతభవిష్యత్తు వర్తమాన కాలములను భేరీజు వేస్తూ పొదుపు చేసి కచ్చితమైన నిప్రణాళిక వేస్తుంటారు. మనసులోని విషయాలు ఒక పట్టాన బయట పెట్టరు. హృదయపూవకంగా మాట్లాడుతారు. జరిగిన విషయాలను జీవివితకాలం మరువరు కనుక ఇతరుల మనస్తత్వాన్ని భేరీజు వేసి జాగరూకతగా మెలుగుతుంటారు. ఎవరితోను పేచీలకు దిగరు, ద్వేషము పెంచుకోరు, అనేక విషయాలలో ఇతరులతో సర్దుకు పోయినా అవసరమైన ప్రదేశాలలో కోపం ప్రదర్శిస్తారు. అతిథులను ఆదరంచి సత్కరిస్తారు.
  • సింహము:- సూర్యుడు సింహరాశిలో ఉన్న వ్యక్తి ధైర్యసాహసాలు కలిగి ఉంటాడు. రాశ్యధిపతి సూర్యుడు కనుక సూర్యుడు ఈ రాశిలో అధిక ప్రభావవంతుడై ఉండడం వలన త్వరగా కోపానికి లోనయ్యే గుణం ఉటుంది. దురుసుగా మాట్లాడే గుణం ఉంటుంది. ఈ కారణంగా బంధు మిత్రులు దూరం ఔతారు కనుక జాగ్రత్తగా వ్యవహరించ వలసి ఉంటుంది. పొగద్తలకు లొంగే గుణము ఉంటుంది. ఎంతటి కష్టతరమైన కార్యమైనా సాధించగలుగుతారు. ఎవ్వరికి తలవంచ లేరు. స్వతంత్రంగా వ్యవహరించడానికి మొగ్గు చూపుతారు. గొడవలకు త్వరగా స్పందించి ధైర్యంగా ఎదిర్కొని చిక్కులలో పడతారు కనుక గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించడం మంచిది. అధికార దృక్పదం మితభాషిత్వం ప్రదర్శిస్తారు.
  • కన్య:- కన్యారాశ్యధిపతి బుధుడు కనుక కన్యారాశిలో సూర్యుడు ఉన్నందువలన బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది. వీరు సున్నిత మనస్కులు. వీరిని అప్పుడప్పుడూ ప్రోత్సహించడం వలన కార్యములను విజయవంతంగా ముగించగలుగుతారు. ధైర్యము, చాతుర్యము కలిగి ఉంటారు కనుక బుధుని ప్రభావంతో వ్యహారాలను చక్కగా పరిష్కరిస్తారు. ధైర్యసాహసాలతో వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు.
  • తులారాశి:- తులారాశిలో సూర్యుడు నీచ స్థితిలో ఉంటాడు కనుక వీరు ఏ పని చేయడానికి అయినా ముందూ వెనుకా ఆలోచిస్తారు. ఆరంభించిన పనిలో నష్టాలు ఎదురైనప్పుడు ఆ పనిని సగంలో ఆ పేస్తారు. సదా ఇతరులు ఏమనుకుంటారోనన్న భయము వీరిని వేధిస్తుంటుంది. న్యాయంగా వ్యవహరిస్తారు. ఇతరుల పట దయ కలిగి ఉంటారు. ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడతారు. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడరు. ఏదనుకుంటే అది వెంటనే దాచకుండా అనేస్తారు. బంధు మిత్రుల ఎడ సఖ్యతతో వ్యవహరిస్తారు.
  • వృశ్చిక రాశి:- వృశ్చిక రాశిలో సూర్యుడు రాశ్యధిపతి కుజుడితో కలవడం వలన ఏకార్యమైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. వీరు అసత్యము చెప్పారు. అసత్యము చెప్పడం సహించరు. వీరు కార్యసాధకులు. వీరు స్థిరమైన అభిప్రాయములు కలిగి ఉంటారు. అందరి భిప్రాయాలకు విలువ ఇస్తూనే తమ అభిప్రాయానుసారమే పని చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఉన్నత స్థితికి పోతారు. వారి వారి వృత్తులను అంకిత భావంతో చేస్తారు కనుక ఉన్నత స్థితికి చేరుకుంటారు. అన్ని విషయములలో అవగాహన కలిగి ఉంటారు. అతిశయము ప్రదర్శించరు.
  • ధనస్సు:- ధనస్సు రాశిలో ఉన్న సూర్యుడు శుభుడు కనుక శుభ ఫలితాలను ఇస్తాడు. ధనస్సులో సూర్యుడు ఉన్న వ్యక్తి ధైర్యంగా అనుకున్నది మెప్పిం,చేలా చెప్పగడు కనుక వీరు మధ్యవర్తులుగా చక్కగా పనికి వస్తారు. శాశ్వతమైన స్నేహ సంబంధాలను కలిగి ఉంటారు. చక్కని సలహాలను ఇవ్వగలరు. ఏవిషయాన్ని గుడ్డిగా నమ్మక లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే నమ్ముతారు. నమ్మిన దానిని ఆచరణలో పెట్టి ఇతరులకు చెప్తారు. గొడవలలో తల దూర్చడం ఇష్టము ఉండదు కనుక గొడవలకు దూరంగా ఉంటారు.
  • మకకరం:- మకరరాశిలో సూర్యుడు ఉన్న సంకోచ స్వభావము కలిగి ఉంటారు. అత్మీయులతో సంబంధాలు జీవితకాలం కొనసాగిస్తారు. బంధు ప్రీతి కలిగి ఉంటారు. విషయజ్ఞానము కలిగి ఉంటారు. ఆలోచనలు అమలులో పెట్ట లేరు. సరి అయిన పధకంతో పని చేయరు. ఎన్ని తెలిసినా తమకుగా తాము ఏమీ చేసుకునే సామర్ధ్యము ఉండదు.
  • కుంభము:- కుంభరాశిలో సూర్యుడు ఉన్న స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటారు. అప్పగించన పనిని చక్కగా పూర్తి చేస్తారు కనుక వీరిని వెనుక నుండి త్వరపెట్టిన కార్యభంగము ఔతుంది కనుక వారి సామర్ధ్యానికి వదలడము మంచింది. బందు ప్రీతి కలిగి ఉంటారు. స్నేహ సంబంధాలను జీవిత కాలం కొనసాగిస్తారు. అనేక మంది శత్రువులు జీవితకాలం శత్రుత్వము వహిస్తూ ఉంటారు అయినా శత్రువులకు వెరువక ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే శాశ్వత మిత్రులు ఎక్కువగా ఉంటారు.

ద్వాదశస్థానాలలో రవి

  • లగ్నంలో సూర్యుడు ఉన్న అల్పకేశములు కలిగి ఉంటాడు. పొడగరి, గర్వి, అల్పదృష్టి, ఉద్రేకి, క్రూరహృదయుడు, నిర్గుణుడు, నిన్న మాటకే రోషం కలిగిన వాడు, ప్రచంఢస్వభావి ఔతాడు. కటకలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉంటే కన్నులలో పూవు పూయువాడు, మేషలగ్న జ్ఞాతకులకు లగ్నంలో రవి ఉంటే నేత్రవ్యాధిపీడితుడు, సింహలగ్నజాతకులకు లగ్నంలో రవి ఉన్న రేచీకటి కలిగిన వాడు, తులాలగ్న జాతకులకు లగ్నంలో రవి ఉంటే దారిద్యపీడితుడు, సంతాన నష్టం కలిగిస్తాడు.
  • ద్వితీయంలో రవి ఉన్న జాతకుడు నిర్ధనుడు, విద్యావినయం లేని వాడు, దుర్వచనాలు పలికేవాడు ఔతాడు.
  • తృతీయంలో రవి ఉన్న జాతకుడు బలవంతుడు, ధనవంతుడు, ధైర్యవంతుడు ఉదారుడు ఔతాడు. అప్తుల ఎడల ద్వేషం కలిగి ఉంటాడు.
  • చతుర్ధస్థానంలో రవి ఉన్న ఎడల బంధుహీనుడు, సుఖహీనుడు, క్షేత్రహీనుడు అంటే భూసంబంధిత సంపద లేని వాడు, స్నేహనుడు, గృహహీనుడు ఔతాడు. పిత్రార్జితం ఖర్చు చేయవాడు. ప్రభుత్వం ఉద్యోగి ఔతాడు.
  • పంచమస్థానంలో రవి ఉన్న జాతకుడు సుఖపుత్రహీనుడు, అల్పాయుష్మంతుడు, జ్ఞాని, అరణ్యప్రదేశములందు తిరుగువాడు ఔతాడు.
  • ష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు రాజు, ఖ్యాతివంతుడు, ధనవంతుడు, విజయవంతుడు ఔతాడు.
  • సప్తమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆధిక్యభావము కలిగిన కళత్రం కలిగిన వాడు ఔతాడు. భాగస్వాముల ఆధిక్యత కలిగి ఉంటాడు.
  • అష్టమ స్థానమున రవి ఉన్న జాతకుడు ఆస్తిని పోగొట్టుకొనుట, అల్పాయుషు కలిగి ఉండుట, దృష్టి లోపం కలిగి ఉన్న వాడు ఔతాడు.
  • నవమ స్థానమున రవి ఉన్న జాతకుడు తండ్రి లేని వాడు, బంధువులు, మిత్రులు, పుత్రులు కలవాడు ఔతాడు.
  • దశమస్థానంలో రవి ఉన్న జాతకుడు పుత్రులు కలవాడు, వాహనము కలవాడు, భాగ్యవంతుడు, కీర్తి యశస్సు కలవాడు, ప్రభువు కాగలడు.
  • రవి లాభస్థానమున ఉన్న జాతకుడు బహుధనవంతుడు, శోకములు లేని వాడు ఔతాడు.
  • ద్వాదశమున రవి ఉన్న జాతకుడు పితృద్వేషి, నిర్ధనుడు, దోషదృష్టి కలవాడు, పుత్రులు లేని వాడు ఔతాడు.

ఆధ్యాత్మిక రంగంలో సూర్యుడు

సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్య దేవాలయాలు

సూర్య దేవాలయాలు లేదా సూర్యాలయాలు భారతదేశంలో ఈ క్రింది ప్రాంతాలలో ఉన్నాయి.

సూర్య నమస్కారాలు

 
సూర్య[permanent dead link] నమస్కారాలలో హస్త ఉత్తానాసనం

యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి అగస్త్య మహాముని సూర్య నమస్కారాలను వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.