రవీంద్ర ధంగేకర్

రవీంద్ర ధంగేకర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 కస్బా శాసనసభ నియోజకవర్గంకు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రవీంద్ర దాంగేకర్‌

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
03 మార్చి 2023 - ప్రస్తుతం
ముందు ముక్తా తిలక్
నియోజకవర్గం కస్బాపేట్

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన

రాజకీయ జీవితం

మార్చు

రవీంద్ర ధంగేకర్‌ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో రాజకీయాల్లోకి సాధారణ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి రాజ్ థాకరే అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. శివసేనతో విభేదాల కారణంగా పార్టీ నుండి వెళ్లిన రాజ్ థాకరేకి మద్దతుగా ఆ తరువాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీలో చేరాడు. ధంగేకర్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ నుండి పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లో నాలుగుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.

రవీంద్ర ధంగేకర్‌ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి శాసనసభ ఎన్నికల్లో కస్బాపేట్ నుండి ఎంఎన్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి గిరీష్ బాపట్ చేతిలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన అనంతరం పార్టీలో విభేదాల కారణంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని వీడి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

రవీంద్ర ధంగేకర్‌ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాడు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నుండి గెలిచిన ముక్తా తిలక్ 2022 డిసెంబరులో కేన్సర్‌తో మరణించడంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి హేమంత్‌ రసానెపై 10950 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (3 March 2023). "మహారాష్ట్రలో బీజేపీకి కాంగ్రెస్‌ ఝలక్‌". Archived from the original on 3 March 2023. Retrieved 3 March 2023.
  2. ""Who is Ravindra Dhangekar?"" (in ఇంగ్లీష్). 3 March 2023. Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  3. The Hindu (2 March 2023). "Maharashtra Assembly bypolls | Congress' Ravindra Dhangekar defeats BJP's Hemant Rasane in Kasaba Peth" (in Indian English). Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.