ముక్తా తిలక్
ముక్తా తిలక్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కస్బా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. ముక్తా తిలక్ 2019లో ఎమ్మెల్యే కాకముందు పుణె మేయర్‌గా పనిచేసింది. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్‌కి మనవరాలు.
ముక్తా తిలక్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2019 – 2022 | |||
ముందు | గిరీష్ బాపట్ | ||
---|---|---|---|
తరువాత | రవీంద్ర ధంగేకర్ [1] | ||
నియోజకవర్గం | కస్బాపేట్ | ||
పూణే మేయర్
| |||
పదవీ కాలం మార్చి 2017 – నవంబర్ 2019 | |||
ముందు | దత్తాత్రయ్ ఢంకావాడే | ||
తరువాత | మురళీధర్ మోహోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం | 1965 ఆగస్టు 17||
మరణం | 2022 డిసెంబరు 22 పూణే, మహారాష్ట్ర, భారతదేశం | (వయసు 57)||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | శైలేష్ తిలక్ | ||
సంతానం | కునాల్, చైత్రాలి |
రాజకీయ జీవితం
మార్చుముక్తా తిలక్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2002 నుండి 2017 వరకు పూణే మునిసిపల్ కార్పొరేషన్ కు నాలుగుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై 2017లో పూణే మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు పూణే మేయర్‌గా పనిచేసి మహిళల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్‌తో సహా అనేక చర్యలను ప్రారంభించింది. ఆమె 2019లో కస్బా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది.
మరణం
మార్చుముక్తా తిలక్ ఐదేళ్లుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతూ పూణెలోని గెలాక్సీ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2023 డిసెంబరు 22న మరణించింది. ఆమెకు భర్త శైలేష్ తిలక్, కుమారుడు కునాల్, కుమార్తె చైత్రాలి ఉన్నారు.[2][3]
మూలాలు
మార్చు- ↑ "A BJP bastion falls at the hands of former Shiv Sainik: Who is Ravindra Dhangekar?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-03-02. Retrieved 2023-03-02.
- ↑ The Indian Express (22 December 2022). "Former Pune mayor Mukta Tilak passes away at 57 battling cancer" (in ఇంగ్లీష్). Retrieved 7 June 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Maha: Pune BJP MLA Mukta Tilak Dies After Long Battle With Cancer". 23 December 2022. Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.