రష్యా యుద్ధకథలు


1940లలో రష్యాలో చెలరేగిన యుద్ధములోని కొన్ని సంఘటనలను వస్తువుగా తీసికొని వ్రాయబడిన 'టేల్స్ ఆఫ్ లెనిన్‌గ్రాడ్' అనే పుస్తకానికి అనువాదం రష్యా యుద్ధకథలు[1] అనే ఈ చిన్నపుస్తకము. దీనికి మూలరచయిత రష్యాకు చెందిన నికొలాయ్ తిఖనోవ్[2]. దీనిలో మొత్తం ఏడు కథలున్నాయి. ఒక ప్రక్క పైనుండి బాంబులవర్షం కురుస్తూ ఉంటే ఒకానొక పట్టణపు వీధిలో శిశువును ప్రసవించిన దీనురాలి ఉదంతం మొదటి కథలో వర్ణించబడింది. యుద్ధం చేయాడానికి తగినంత శరీరపటుత్వం లేనప్పటికీ ఉత్సాహం వల్ల యుద్దానికి పోయిన కొడుకు రణరంగంలో ఎలా ఉన్నాడో చూడటానికి స్వయంగా వెళ్లి అక్కడ తనకొడుకు మిగిలిన యోధులతో సమానంగా పోరాడుతున్న దృశ్యాన్ని చూసి సంతోషించే ఒక మాతృమూర్తి ఆనందం ఒక కథలో చిత్రించబడింది. బాంబుల వర్షం కురుస్తూ ఉంటే వాటిని తప్పించి నైపుణ్యంగా రైలును నడుపుతున్న ఇంజనుడ్రైవరు ఒక కథలో కనిపిస్తాడు. ఇలాగే అన్ని కథలలోనూ వేర్వేరు భయాశ్చర్య విస్మయజనకాలైన సంఘటనలు వర్ణించబడ్డాయి. మొత్తం మీద ఈ కథలన్నీ కరుణరసాన్ని ఒలికిస్తున్నాయి. ఇలాంటి ఉపద్రవసమయంలో ఎలాంటి సహనము,ధైర్యము,స్థిరత్వము,కార్యకారణ విధానము అనుసరించాలో ఈ కథలు తెలుపుతాయి.

రష్యా యుద్ధకథలు
కృతికర్త: నికొలాయ్ తిఖనోవ్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): టేల్స్ ఆఫ్ లెనిన్‌గ్రాడ్
అనువాదకులు: విద్వాన్ విశ్వం
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథాసంపుటి
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్యం
ప్రచురణ: నవ్యసాహిత్యమాల అనంతపురం
విడుదల: 1943

మూలాలు

మార్చు
  1. [1] Archived 2016-03-05 at the Wayback Machineభారతి మాసపత్రిక జూన్1943 సంచిక పుట33
  2. https://en.wikipedia.org/wiki/Nikolai_Tikhonov_(writer)