రసరంజని (నాటకరంగ సంస్థ)

రసరంజని తెలుగు నాటక సంస్థ.

ప్రారంభం

మార్చు

తెలుగునాటక బహుముఖ ప్రగతికి దోహదపడాలనే ఆకాంక్షతో మార్చి 8, 1993న కన్యాశుల్కం నాటకప్రదర్శనతో ప్రారంభమయిన సంస్థ రసరంజని. కొద్ది ప్రవేశ రుసుమును వసూలు చేసే సంప్రదాయాన్ని ప్రారంభించి, ప్రతినెలా ఒక నాటకం ప్రదర్శింపచేయడం ముఖ్య కార్యక్రమంగా, 18 సంవత్సరాలుగా నాటకరంగానికి అవిరళకృషి చేస్తూనేవుంది. సభ్యుల నాటకాలే కాక, ఇతర ప్రఖ్యాత నాటక సమాజాలవారి నాటకాలను నిరాటంకంగా ప్రదర్శింపచేస్తోంది.[1]

ప్రదర్శనలు

మార్చు

నాటకసాహిత్యంలో క్లాసిక్స్గా పేర్కొనే కన్యాశుల్కం, ముద్రారాక్షసం, ప్రతాపరుద్రీయం వంటి నాటకాలతోబాటు ఆధునిక నాటకకర్తల ప్రఖ్యాత నాటకాలు మరో మొహెంజొదారో, డామిట్! కథ అడ్డం తిరిగింది, శ్రీనాథుడు, అనగనగా ఒకరాజు, దేవుడు చేసిన బొమ్మ, జనమేజయం, ప్రజానాయకుడు ప్రకాశం వంటి నాటకాలతో సహా యాభై దాకా నాటకాలను స్వయంగా ప్రదర్శించింది.

కార్యక్రమాలు

మార్చు

రసరంజని ఏటా జరుపుతున్న నాటకోత్సవాలు, ఈనాటి ప్రేక్షకులకు క్రిందటి తరం నాటకాలు శీర్షికన రెండువిడతలుగా ప్రదర్శించిన పన్నెండు నాటకాల ప్రదర్శనలు, అలాగే తెలుగు హాస్యనాటకోత్సవాలు, బహుభాషా నాటకోత్సవాలు ప్రేక్షకజన ప్రశంసలందుకున్నాయి. తెలుగు నాటకరంగ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా - రసరంజని నటశిక్షణా కార్యక్రమాలకు ప్రాముఖ్యం ఇస్తోంది. యువనటశిక్షణ, ఉపాధ్యాయ నాటక శిక్షణ, మూకాభినయశిక్షణ మొదలయిన నాటకశిక్షణా శిబితరాలను నిర్వహించింది. ప్రఖ్యాత తెలుగుకథకుల కథలను నాటకీకరించి, కథానాటక సప్తాహం నిర్వహించింది. నాటకరచనలలో, సాంకేతిక నిర్వహణలో కూడా శిక్షణా శిబిరాలను నిర్వహించడం, నాటకవిద్యాలయం, దానికి అనుబంధంగా సంచారనాటక మండలి (రిపర్టరీ)ని స్థాపించడం భవిష్యత్ కార్యక్రమాలు. రసరంజని రంగస్థల పురస్కారం పేరిట నాటక రచయితలను, దర్శకులను, నటీనటులను సముచితంగా సన్మానించుకుంటోంది రసరంజని.

వ్యవస్థాపకులు - సభ్యులు

మార్చు
  1. గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు.

రసరంజని రంగస్థల పురస్కార గ్రహీతలు

మార్చు
  1. కీ.శే. సురభీ లీలాపాపారావు (2005)
  2. దేవరకొండ సుబ్రహ్మణ్యం (2006)
  3. కీ.శే. కె. చిరంజీవి (2007)
  4. రావికొండలరావు (2008)
  5. కీ.శే. రావూజీ (2009)
  6. రాళ్లపల్లి (2010)
  7. కీ.శే. తెలంగాణ శకుంతల (2011)
  8. దంటు సూర్యారావు (2012)
  9. సుంకర ప్రభాకర రావు (2013)
  10. తల్లావఝ్జల సుందరం (2014)
  11. నెమలికంటి తారకరామారావు (జూలై 1, 2015)

మూలాలు

మార్చు
  1. The Hindu (31 March 2016). "The evergreen play, Kanyasulkam". Gudipoodi Srihari. Archived from the original on 6 April 2016. Retrieved 12 December 2020.