రహదారి చిహ్నాలు

రహదారి చిహ్నాలు (Road signs) రహదారిలో ప్రయాణించే వ్యక్తుల సమాచారం కోసం వాడుకలో వున్న చిహ్మాలు. భారతదేశంలోని రహదారి చిహ్నాలు యునైటెడ్ కింగ్‌డంలో ఉపయోగించే చిహ్నాలను పోలివుంటాయి. ఆ స్థలాల పేర్లు బహుభాషాల్లో, సంకేతాలు మెట్రిక్‌ల్లో ఉంటాయి. చాలా పట్టణాలలోని రహదార్లలోను, రాష్ట్ర, జాతీయ రహదారులులలో ఇవి విస్తృతంగా వాడకంలో ఉన్నాయి. చాలా పట్టణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు రాష్ట్ర భాష, ఆంగ్ల భాషలో చిహ్నాలు ఉన్నాయి. జాతీయ రహదారులకు రాష్ట్ర భాష, హిందీ, ఆంగ్లంలో చిహ్నాలు ఉన్నాయి.

2012లో కేరళ పర్యాటక విభాగం, సమీపంలోని ఆసుపత్రుల పటాలను చేర్చడానికి రాష్ట్రంలో రహదారి చిహ్నాలను పునరుద్దరించే ప్రణాళికలను ప్రకటించింది.[1] నోయిడా అథారిటీ పాత సైన్‌బోర్డ్‌లను కొత్త ఫ్లోరోసెంట్ చిహ్నాలతో మార్చే ప్రణాళికలను ప్రకటించింది.[2]

బెంగళూరులోని జాతీయ రహదారిపై ఉన్న బోర్డు
కేరళలో ఉన్న బోర్డు
గుర్గాన్‌లోని బోర్డు

భారతదేశంలో

మార్చు
  • భారతదేశంలో మూడు ప్రధాన రహదారి చిహ్నాలు ఉన్నాయి, అవి
  1. రెగ్యులేటరీ: సర్కిల్‌లలో చిత్రీకరించబడ్డవి, ఈ చిహ్నాలు నియమాలు, నిబంధనలను చూపుతుంది.
  2. హెచ్చరికలు: త్రిభుజంలో వర్ణించబడింది
  3. సమాచారం: దీర్ఘచతురస్రంలో వర్ణించబడింది
  • ఈ మూడింటితో పాటు, మనకు మరో రెండు ఇతర చిహ్నాల బోర్డులు ఉన్నాయి, అవి
  1. దారి ఇవ్వండి (ఆకారం ఇబ్బంది త్రిభుజం)
  2. ఆగండి (ఆకారం అష్టభుజి)
  • క్రాస్ సర్కిల్ లో ఉన్నది నిషేధాన్ని, క్రాస్ లేకుండా సర్కిల్స్ ఉన్నది నియమాలని చూపిస్తుంది.
  • త్రిభుజాలు సూటిగా ఉంటాయి, ప్రమాదంగా భావిస్తారు.
  • బ్లూ సర్కిల్స్ ఉన్నవి సానుకూల సూచనలను చూపుతాయి, ఈ చిహ్నాలు ఒక నిర్దిష్ట వాహనాలకి మాత్రమే వర్తిస్తుంది.
  • మిగతా చిహ్నాలు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి.

తప్పనిసరి చిహ్నాలు

మార్చు

హెచ్చరిక చిహ్నాలు

మార్చు

సమాచార చిహ్నాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Nair, Sangeetha (2012-07-15). "Tourism dept to update signboards across Kerala". Trivandrum. Times of India. Archived from the original on 2013-02-27. Retrieved 2020-07-11.
  2. Keelor, Vandana (2012-07-18). "Blue road signboards give way to red ones". Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 2020-07-11.

ఇతర లంకెలు

మార్చు