ప్రధాన మెనూను తెరువు
భారతదేశములోని జాతీయ రహదారుల వ్యవస్థ
జాతీయ రహదారి

జాతీయ రహదారి (ఆంగ్లం: National Highway) అంటే భారత దేశములో ప్రధాన నగరాలను కలుపు ఉండే పొడవైన రోడ్లను జాతీయ రహదార్లు అని పిలుస్తారు. వీటిని ఆంగ్లములో నేషనల్ హైవే. ఈ ప్రధాన రహదార్లకు ఒక అంకె ఇవ్వబడీంది. వాటీ అంకెను ఎన్.హెచ్.- అంకెతో కలిపి పిలుస్తారు. ఈ రహదార్ల నిర్వహణ భారత కేంద్ర ప్రభుత్వము నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అనే సంస్థ ద్వారా జరుపుతుంది. జాతీయ రహదార్లు రెండు వేర్వేరు లేన్లు కలిగి ఒకటి వెళ్ళే వాహనాలకు మరొకటి వచ్చే వాహనాలకు అనువుగా ఉంటాయి. జాతీయ రహదార్ల పొడవు 58,000 కి.మి. అందు 4,885 కి.మి మాత్రమే రెండు లేన్లు సెంట్రల్ ఫ్లాట్‌ఫారమ్‌తో వేరు చేయబడి ఉంది. ఇటువంటి వాటిని ఎక్స్‌ప్రెస్‌ హైవే అని పిలుస్తారు. జాతీయ రహదార్లు భారత దేశములోని రోడ్డు వ్యవస్థలో 2% మాత్రమే ఉండి భారత దేశ రోడ్డు ట్రాఫిక్ లో 40% మోస్తున్నాయి. నేషనల్ హైవేస్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు ప్రారంభం జరిగి జాతీయరహదార్లు అభివృద్ధి పరచడం మరియు కొత్త రహదార్లు నిర్మాణం జరపడం జరుగుతోంది.

ఇవి కూడా చూడండిసవరించు