రాఖీగఢీ

హర్యానా లోని ప్రాచీన మానవ ఆవాస స్థలం
(రాఖిగఢీ నుండి దారిమార్పు చెందింది)

రాఖీగఢీ హర్యానా రాష్ట్రపు హిసార్ జిల్లాలోని గ్రామం. ఢిల్లీకి వాయవ్యంగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సింధులోయ నాగరికతకు పూర్వపు కాలానికి (సా.శ.పూ 6500) చెందిన మానవ ఆవాస స్థలం ఉంది. ఇక్కడే ప్రౌఢ సింధు లోయ నాగరికతకు (సా.శ.పూ. 2600-1900) చెందిన ఆవాస స్థలం కూడా ఉంది.[2] ఇది ఘగ్గర్-హక్రా నది పరీవాహక ప్రాంతంలో,[3] ఘగ్గర్ నది నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.

రాఖీగఢీ
రాఖీగఢీ is located in Haryana
రాఖీగఢీ
Shown within Haryana
రాఖీగఢీ is located in India
రాఖీగఢీ
రాఖీగఢీ (India)
ఇతర పేర్లురాఖీగఢీ
స్థానంహర్యానా
నిర్దేశాంకాలు29°17′35″N 76°6′51″E / 29.29306°N 76.11417°E / 29.29306; 76.11417
రకంజనావాసం
వైశాల్యం80–105 hectares (0.80–1.05 కి.మీ2; 0.31–0.41 చ. మై.) (Gregory Possehl, Rita P. Wright, Raymond Allchin, Jonathan Mark Kenoyer)
350 hectares (3.5 కి.మీ2; 1.4 చ. మై.)[1]
చరిత్ర
సంస్కృతులుసింధు లోయ నాగరికత
స్థల గమనికలు
తవకాల తేదీలు1963, 1997–2000, 2011-ఇప్పటివరకు

రాఖీగఢీలో 7 దిబ్బల సముదాయం ఉంది. దాని చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకే కాలానికి చెందినవి కావు. ఏయే కాలాలకు చెందిన దిబ్బలను కలిపి చూడాలన్నదాన్ని బట్టి రాఖీగఢీ విస్తీర్ణం 80 నుండి 550 హెక్టార్ల వరకూ ఉంటుంది.[4] 2014 జనవరిలో కనుగొన్న కొత్త దిబ్బల తరువాత ఇది సింధులోయ నాగరికత స్థలాలలోకెల్లా అతి పెద్దదిగా అయింది. 350 హెక్టార్లతో ఇది మొహెంజోదారో కంటే దాదాపు 50 హెక్టార్లు పెద్దది.[5]

పరిమాణము, విశిష్టతల కారణంగా రాఖీగఢీ ప్రపంచవ్యాప్తంగా పురాతత్వవేత్తల దృష్టిని ఆకర్షించింది. మిగతా స్థలాల కంటే ఇది ఢిల్లీకి దగ్గరగా ఉండి, ఉత్తర భారతదేశంలో సింధు లోయ నాగరికత వ్యాప్తిని సూచిస్తోంది. ఈ స్థలంలో చాలా వరకూ ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉంది, విశేషాలను ప్రచురించాల్సీ ఉంది.: 215  ఈ ప్రాంతంలోని మరో స్థలం మిటాహాలి లో తవ్వకాలు మొదలు పెట్టాల్సి ఉంది.

2012 మే లో గ్లోబల్ హెరిటేజ్ ఫండ్, ఆసియాలో ప్రమాదపు అంచున ఉన్న తొలి 10 ప్రాచీన వారసత్వ స్థలాల్లో ఒకటిగా రాఖీగఢ్‌ను గుర్తించింది.[6] సండే టైమ్స్ పత్రిక - ఈ స్థలాన్ని సరిగా పట్టించుకోవడం లేదని, చుట్టూ ఉన్న ఇనుప కంచె విరిగి పోయిందని, గ్రామస్థులు అక్కడి పురావస్తువులను తవ్వి అమ్ముకుంటున్నారని, ఇళ్ళ నిర్మాణం కోసం స్థలం ఆక్రమణలకు గురౌతోందనీ రాసింది.[7] 2018 మే 23 న అక్రమంగా నిర్మించిన 24 నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. ప్రజలు ఇందుకు సహకరించారని అధికారులు తెలిపారు.[8]

స్థానం

మార్చు

ఇది ఘగ్గర్-హక్రా నది పరీవాహక ప్రాంతంలో,[9] ఘగ్గర్ నదికి 27 కి.మీ. దూరంలో ఉంది. రాఖీగఢీ ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఒక గ్రామం.[10]

ఈ ప్రాంతంలో ఘగ్గర్ మైదానానికి తూర్పున, పాత నదీలోయలో ఇంకా అనేక పురాతత్వ స్థలాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. కలిబంగాన్, కునాల్, బాలు, భిర్రానా, బనవాలి.[11]

జేన్ మెకింటోష్ ప్రకారం, రాఖీగఢీ ప్రాచీన దృషద్వతి నది లోయలో ఉంది. ఈ నది శివాలిక్ పర్వతాల్లో పుట్టింది.[12]

లోహారీ రాగో అనేది దగ్గరలో ఉన్న మరొక చిన్న స్థలం.

తవ్వకాలు

మార్చు

భారత పురాతత్వ సర్వే సంస్థ 1997 లో మొదలుపెట్టి మూడు శీతాకాలాల పాటు ఇక్కడ తవ్వకాలు జరిపింది. నిధుల దుర్వినియోగ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు కారణంగా కొన్నేళ్ళ పాటు తవ్వకాలు ఆగిపోయాయి.[13] తవ్వకాల్లో దొరికిన వస్తువుల్లో చాలావరకు నేషనల్ మ్యూజియమ్‌కు అందజేసారు.

1963 లో భారత పురాతత్వ సర్వే సంస్థ తవ్వకాలు చేపట్టినప్పటికీ, వాటి గురించిన సమాచారం పెద్దగా వెలుగు చూడలేదు.[14][15] 1997 నుండి 2000 వరకు అమరేంద్ర నాథ్ నేతృత్వంలో తిరిగి తవ్వకాలు జరిపింది.[16][note 1] ఇటీవలి కాలంలో దక్కను కళాశాలకు చెందిన  వసంత్ షిండే నేతృత్వంలో తవ్వకాలు జరిగాయి.

ఈ తవ్వకాల్లో ఈ నగరపు విస్తృతి గురించి తెలిసింది. అనేక పురావస్తువులను వెలికి తీసారు. వీటిలో కొన్ని 5000 ఏళ్ళ నాటివి. తొలి హరప్పన్ దశలో ఈ నగరంలో ఆవాసాలు ఏర్పడ్డాయి.[17][18] చదును చేసిన రహదారులు, మురుగునీటి వ్యవస్థ, వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, మట్టి ఇటుకలు, శిల్ప నిర్మాణం, కంచు వస్తువుల తయారీ వంటి విశేషాలు బయల్పడ్డాయి. మట్టి గాజులు, శంఖాలు, బంగారం, విలువైన రాళ్ళతో చేసిన ఆభరణాలు కూడా బయట పడ్డాయి.[19]

రాఖీగఢీలో RGR-1 నుండి RGR-9 వరకూ పేర్లు పెట్టిన 9 దిబ్బలున్నాయి. RGR-5 రాఖిషాపూర్ అనే గ్రామంలో ఉంది. అధిక జనసాంద్రత వలన ఇక్కడ తవ్వకాలు జరప వీలు కాలేదు. RGR-4 లో కొంత భాగంతో పాటు మిగతావన్నీ తవ్వకాలకు అందుబాటులో ఉన్నాయి..[20][21]

కాలనిర్ణయం

మార్చు

1997-2000 మధ్య వెలికితీసిన వస్తువులపై 2014 లో ఆరు రేడియో కార్బన్ డేటింగ్ పరీక్షల ఫలితాలను ప్రచురించారు. అమరేంద్ర నాథ్ ప్రకారం ఇవి మూడు విభిన్న కాలాలకు చెందినవి. అవి: అతిప్రాచీనతొలి హరప్పన్ప్రౌఢ హరప్పన్. RGR-6 అతి ప్రాచీన కాలానికి చెందినది. దీన్ని సోతీ దశ అని పిలిచారు. ఇవి     సంవత్సరాల వెనుకకు చెందినవి. అంటే సా.శ.పూ.  ,  .

విస్తీర్ణం

మార్చు

ఈ స్థల వైశాల్యం 80 హెక్టార్ల నుండి 100 హెక్టార్లకు పైగా ఉంటుందని భావించారు.[22][23][24][25][26] ఇక్కడ బయల్పడిన విశేషాలన్నీ ఒకే సింధులోయ జనావాసానికి చెందినవి కావని పోసెల్ భావించాడు. అర్దా అనే పేరున్న RGR-6, వీటికి భిన్నమైన జనావాసమని అతడు భావించాడు.

ఈ స్థలం విస్తీర్ణం 300 హెక్టార్ల పైచిలుకు ఉంటుందని అమరేంద్ర నాథ్ చెప్పాడు. ఇక్కడ ఉన్న 7 దిబ్బల్లో 5 కలిసే ఉన్నాయని చెప్పాడు. 2014, 15ల్లో హర్యానా పురాతత్వ శాఖ, దక్కను కళాశాల, సియోల్ యూనివర్సిటీ కలిసి తవ్వకాలు జరిపాయి. వారు కనుక్కున్న మరో రెండు దిబ్బలతో ఈ స్థల విస్తీర్ణం 350 హెక్టార్లకు చేరింది.[1]

కనుగోళ్ళు

మార్చు

తవ్వకాల్లో చక్కటి ప్రణాళికతో నిర్మించిన నగరం బయల్పడింది. 1.92 మీ. వెడల్పున్న రోడ్లు ఈ నగరంలో ఉన్నాయి. ఇవి కలిబంగన్ రోడ్ల కంటే వెడల్పైనవి. కుండలు కలిబంగన్, బనవాలీల వాటివలెనే ఉన్నాయి. చుట్టూ గోడలున్న గుంటలు ఉన్నాయి. బలుల కోసంగాని, మతసంబంధ కర్మకాండలకోసం గానీ వీటిని నిర్మించినట్టు భావిస్తున్నారు. వారి మత కర్మకాండల్లో అగ్నిని విస్తృతంగా ఉపయోగించారు. ఇళ్ళ నుండి వచ్చే మురుగునీటిని తరలించేందుకు ఇటుకలతో కాలువలను నిర్మించారు. మట్టి విగ్రహాలు, తూనికరాళ్ళు, కంచు కళాకృతులు, దువ్వెన, రాగితో చేసిన చేపల గేలాలు, సూదులు, మట్టి ముద్రికలు ఈ స్థలంలో దొరికాయి. బంగారం, వెండితో అలంకరించిన కంచు పాత్ర ఒకటి దొరికింది. కంసాలి కొలిమి ఒకటి దొరికింది. అక్కడ 3000 ముడి విలువైన రాళ్ళు దొరికాయి. ఈ రాళ్ళను మెరుగుపెట్టే పరికరాలు కూడా అక్కడ లభించాయి. ఒక ఖనన ప్రదేశం బల్పడింది. అక్కడ 11 అస్థిపంజరాలు దొరికాయి. వీటి తలలు ఉత్తర దిక్కుగా ఉండేలా పడుకోబెట్టారు. ఈ అస్థిపంజరాల వద్ద రోజువారీగా వాడే పాత్రలను ఉంచారు. స్త్రీ అస్థిపంజరాలు మూడు ఉన్నాయి. వాటి ఎడమ మణికట్టుకు గాజులు ఉన్నాయి. ఒక అస్థిపంజరం వద్ద బంగారు కడియం ఉంది. తల వద్ద కొన్ని విలువైన రాళ్ళు కనిపించాయి. బహుశా అవి గొలుసులో భాగమై ఉండవచ్చు.

2015 లో RGR-7 లో నాలుగు పూర్తి మానవ అస్థిపంజరాలను వెలికి తీసారు. వీటిలో రెండు పురుషులవి, ఒకటి స్త్రీది, మరొకటి బాలికది. వీటి పక్కనే ధాన్యంతో ఉన్న కుండలు, గాజులు దొరికాయి.[27] చిన్న చక్రాలు, చిన్న మూతలు, బంతులు, జంతువుల బొమ్మలు వంటి అనేక రకాలైన ఆటబొమ్మలు లభించాయి. స్టాంపులు, ఆభరణాలు, తూనికరాళ్ళు వంటివి లభించడాన్ని చూస్తే, వాణిజ్యం జోరుగా సాగి ఉండేదని తెలుస్తోంది. ఇక్కడి తూనిక రాళ్ళు ఇతర సింధులోయ నాగరికత స్థలాల్లో లభించిన వాటిని పోలి ఉన్నాయి. దీన్ని బట్టి ఒక ప్రామాణిక తూనిక విధానం ఉండేదని తెలుస్తోంది.[28]

వెండి, కంచు వస్తువులను కప్పి ఉన్న నేత గుడ్డ అవశేషాలు ఈ స్థలంలో దొరికాయి.: 333 

 
రాఖీగఢీలో కనుగొన్న అస్థిపంజరం - నేషనల్ మ్యూజియమ్‌లో ఉంది.

ఇప్పటి వరకు 53 ఖనన ప్రదేశాల్లో 46 అస్థిపంజరాలను కనుగొన్నారు. వీటిలో 37 ను పరీక్షించగా, 17 వయోజనులవని, 8  పిల్లలవనీ తేలగా, 12 అస్థిపంజరాల వివరాలను తేల్చలేకపోయారు. పదిహేడింటి లింగనిర్ధారణ చెయ్యగలిగారు. వాటిలో 7 మగ, 10 ఆడ అని తేలింది. చాలా వరకు అస్థిపంజరాలు మామూలుగా వెల్లకిలా పడుకోబెట్టి ఉన్నాయి. కొన్ని మాత్రం బోర్లా పడుకోబెట్టి ఉన్నాయి. కొన్ని మామూలు గుంటలు మాత్రమే కాగా, కొన్ని మాత్రం ఇటుక గోడలు కలిగి, వాటిలో చాలా కుండలు ఉన్నాయి. కొన్నిటిలో మొక్కుబడులు చెల్లించే పాత్రలు కూడా ఉన్నాయి. వాటిలో జంతువుల అవశేషాలు ఉన్నాయి. సెకండరీ సమాధుల్లోని ఎముకల అవశేషాలు మసిబారలేదు. దీన్ని బట్టి దహన కర్మ చేసేవరు కాదని తెలుస్తోంది. ఈ సమాధులు చాలావరకు హరప్పన్ విశేషాలను పోలి ఉన్నప్పటికీ, సామూహిక ఖననం, బోర్లా పడుకోబెట్టడం వంటివి ఇక్కడ ప్రత్యేకం. పురా-పరాన్నజీవుల అధ్యయనం, DNA పరీక్షలు జరగనున్నాయి.[29]

ధాన్యాగారం (గాదె)

మార్చు

ప్రౌఢ హరప్పన్ కాలనికి (సా.శ.పూ. 2600 నుండి 2000) చెందిన ధాన్యాగారాన్ని ఈ స్థలంలో కనుగొన్నారు. మట్టి ఇటుకలతో కట్టిన ఈ నిర్మాణపు అడుగును మట్టితో కట్టి దానిపై అడుసుతో అలికారు. దానిలో 7 దీర్ఘచతురస్రాకారపు గదులున్నాయి. ఎన్నదగిన పరిమాణంలో సున్నము, మురిగిపోయిన గడ్డీ ఈ గాదెల్లో కనిపించాయి. గాదెల్లోకి పురుగులు చేరకుండా సున్నాన్ని, తేమను పీల్చుకునేందుకు గడ్డినీ వాడారని దీన్ని బట్టి తెలుస్తోంది. గాదె పరిమాణాన్ని బట్టి చూస్తే అది సార్వజనికమైనది గాని, ధనవంతులది గానీ అయి ఉండవచ్చు.[30]

శ్మశానం

మార్చు

8 సమాధులతో కూడిన ఒక ఖనన ప్రదేశాన్ని రాఖీగఢీలో కనుగొన్నారు. సమాధి గుంటలు ఇటుకలతో మూసివేసి ఉన్నాయి. ఒక గుంటలోని శవపేటిక చెక్కతో చేసి ఉంది. సమాధి గుంటలను భూమి కింద సొరంగం లాగా తవ్వి, అందులో శవాలను ఉంచారు. సమాధిపై ఉన్న భూమిపై ఇటుకలతో కప్పు వంటి నిర్మాణాన్ని నిర్మించారు.[31]: 293 

అస్థిపంజరాలతో పాటు, వారు జీవించి ఉండగా పొట్టలో ఉన్న పరాన్నజీవుల గుడ్లు ఈ సమాధుల్లో కనిపించాయి. మానవా aDNA తో పాటు, పరాన్న జీవుల, జంతువుల DNA పరీక్షలు కూడా జరిపి తద్వారా ఆ ప్రజల మూలాలను కనుగొనే ప్రయత్నం చేయనున్నారు.[32][33]

డిఎన్‌ఏ పరీక్షలు

మార్చు

ఇక్కడ లభించిన మాన అస్థిపంజరాల డిఎన్‌ఏ ను హైదరాబాదులో సిసిఎమ్‌బి లో పరీక్షించారు. ఈ ఫలితాలను వివరిస్తూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక వార్త రాసింది. “రాఖీగఢీ మానవ డిఎన్‌ఏలో స్థానికత్వం ఎక్కువగా ఉంది — అందులో మైటోకాండ్రియల్ డిఎన్‌ఏ చాలా బలంగా ఉంది. కొంత విదేశీ మూలం ఉంది. విదేశీయులతో సంపర్కం జరిగినట్లు ఇది సూచిస్తున్నప్పటికీ, డిఎన్‌ఏ మాత్రం విస్పష్టంగా స్థానికమే" అని వసంత్ షిండే చెప్పాడని ఎకనామిక్ టైమ్స్ పత్రిక 2018 జూన్ 13 న రాసింది.[34] ఆ నాటికి డిఎన్‌ఏ పరీక్షల ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రచురించాల్సి ఉంది.

మ్యూజియమ్

మార్చు

రాఖీగఢీలో హర్యానా ప్రభుత్వం ఒక మ్యూజియమ్ ను ఏర్పాటు చేసింది.[35]

ఇవి కూడా చూడండి

మార్చు

నోట్స్

మార్చు
  1. Amarendra Nath was later found guilty for forging bills during the excavation at Rakhigarhi.

బయటి లింకులు

మార్చు
  • 2015 Man and Environment Journal article on Rakhigarhi burials
  • Haryana Samvad Newsletter: Detailed report on Rakhigarhi with color photographs, page 1-15
  • "Harappa's greatest centre sheds light on our today". The Sunday Guardian. 16 Sep 2012. Archived from the original on 4 జూలై 2016. Retrieved 13 జూన్ 2018.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Sharma, Rakesh Kumar; Singh, Sukhvir (May 2015). "Harrapan interments at Rakhigarhi" (PDF). International Journal of Informative & Futuristic Research (IJIFR). 2 (9): 3403–3409. ISSN 2347-1697. Archived from the original (PDF) on 8 జూన్ 2015. Retrieved 11 May 2016. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ME2" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Tejas Garge (2010), Sothi-Siswal Ceramic Assemblage: A Reappraisal. Archived 2021-11-28 at the Wayback Machine Ancient Asia. 2, pp.15–40. doi:10.5334/aa.10203
  3. Wright, Rita P. (2009), The Ancient Indus: Urbanism, Economy, and Society, Cambridge University Press, p. 133, ISBN 978-0-521-57219-4, retrieved 29 September 2013 Quote: "There are a large number of settlements to the east on the continuation of the Ghaggar Plain in northwest India. ... Kalibangan, Rakhigarhi, and Banawali are located here. Rakhigarhi was over 100 hectares in size."
  4. Harappa’s Haryana connect: Time for a museum to link civilisations
  5. http://www.thehindu.com/features/friday-review/history-and-culture/rakhigarhi-the-biggest-harappan-site/article5840414.ece
  6. "Rakhigarhi likely to be developed into a world heritage site". India Today. 31 March 2013. Retrieved 2013-08-08.
  7. Archana, Khare Ghose (3 June 2012). "Can Rakhigarhi, the largest Indus Valley Civilisation site be saved?". Sunday Times. Archived from the original on 23 మే 2013. Retrieved 5 June 2012.
  8. "24 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ రిమూవ్‌డ్ ఫ్రమ్ హరప్పన్ సైట్ ఇన్ హిసార్". 23 May 2018. Archived from the original on 24 మే 2018. Retrieved 14 జూన్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. Wright, Rita P. (2009), The Ancient Indus: Urbanism, Economy, and Society, Cambridge University Press, p. 133, ISBN 978-0-521-57219-4, retrieved 29 September 2013
  10. Census of India, 2011
  11. Nath, Amarendra, Tejas Garge and Randall Law, 2014. Defining the Economic Space of the Harappan Rakhigarhi: An Interface of the Local Subsistance Mechanism and Geological Provenience Studies, in Puratattva 44, Indian Archaeological Society, New Delhi, pp. 84 academia.edu
  12. Jane McIntosh, The Ancient Indus Valley: New Perspectives. Understanding ancient civilizations. ABC-CLIO, 2008 ISBN 1576079074 p76
  13. "Former Archaeological Survey director sentenced to jail for fraud". Hindustan Times. 15 October 2015. Retrieved 6 January 2016.
  14. Wright, Rita P. (2009), The Ancient Indus: Urbanism, Economy, and Society, Cambridge University Press, p. 107, ISBN 978-0-521-57219-4 Quote: "Rakhigarhi will be discussed briefly in view of the limited published material" (p 107)
  15. Sinopoli, Carla M. (2015), "Ancient South Asian cities in their regions", in Norman Yoffee (ed.), The Cambridge World History, Cambridge University Press, p. 325, ISBN 978-0-521-19008-4CS1 maint: Extra text: editors list (link) Sinopoli, Carla M. (2015), "Ancient South Asian cities in their regions", in Norman Yoffee (ed.), The Cambridge World History, Cambridge University Press, p. 325, ISBN 978-0-521-19008-4 Quote: "Excavations have also occurred at Rakhigarhi, but only brief notes have been published, and little information is currently available on its form and organization. (page 325)"
  16. Nath, Amarendra (31 December 2014). "Excavations at Rakhigarhi [1997-98 to 1999-2000]" (PDF). Archaeological Survey of India. p. 306. Retrieved 22 February 2016.
  17. Possehl, Gregory L. (2002). The indus civilization : a contemporary perspective (2. print. ed.). Walnut Creek, CA: AltaMira Press. pp. 63, 71, 72. ISBN 9780759101722.
  18. "Harappan Surprises". Frontline. 13 June 2014. Retrieved 14 March 2018.
  19. "Chandigarh Newsline, 2/23/2007, 'Rakhigarhi is the Largest Harappan Site Ever Found'". Archived from the original on 2007-02-25. Retrieved 2018-06-13.
  20. Archaeological Survey of, India. "Indian Archaeology 1997-98" (PDF). Excavation at Rakhigarhi. Archaeological Survey of INdia. Retrieved 17 July 2012.
  21. "Rakhigarhi, the biggest Harappan site". The Hindu. 27 March 2014.
  22. Possehl, Gregory L. (2002), The Indus Civilization: A Contemporary Perspective, Rowman Altamira, p. 72, ISBN 978-0-7591-0172-2 Quote: "The site is about 17 meters in height. The southern face of the mounds is rather abrupt and steep. The northern side slopes down to the surrounding plain. The contours of the site have led the excavator to divide up the place into five mounds (RGR-1 through 5). RGR-6, a Sothi-Siswal site known as Arda, was probably a separate settlement. I have visited Rakhigarhi and believe that it is 80 hectares in size."
  23. Coningham, Robin; Young, Ruth (2015), The Archaeology of South Asia: From the Indus to Asoka, c.6500 BCE–200 CE, Cambridge University Press, p. 183, ISBN 978-0-521-84697-4 Quote: Mohenjo-daro covered an area of more than 250 hectares, Harappa exceeded 150 hectares, Dholavira 100 hectares and Ganweriwala and Rakhigarhi around 80 hectares each."(p 183)
  24. Kenoyer, Jonathan M. (1998), Ancient Cities of the Indus Valley Civilization, Oxford University Press, p. 49, ISBN 978-0-19-577940-0Quote: "Within a few hundred years the thriving town had grown six times larger, covering an area of over 1 50 hectares. ... civilization: Mohenjo-daro (+200 ha), Harappa (+ 150 ha), Ganweriwala and Rakhigarhi (+80 ha) and Dholavira (100 ha)"(page 49)
  25. Allchin, F. R.; Erdosy, George (1995), The Archaeology of Early Historic South Asia: The Emergence of Cities and States, Cambridge University Press, p. 78, ISBN 978-0-521-37695-2 Quote: "Rakhigarhi at 80 hectares is the largest site followed by Banawali at 25 hectares."
  26. Heitzman, James (2008), The City in South Asia, Routledge, p. 35, ISBN 1-134-28962-6 Quote: "They include Mohenjodaro (with a city core of about 100 hectares, and suburbs possibly covering more than 200 hectares) in Sind; Harappa (more than 150 hectares) in the center of Pakistani Punjab; Dholavira (more than 100 hectares) in Gujarat; Ganweriwala (82 hectares) in Pakistani Punjab near the border with Rajasthan; and Rakhigarhi (between 80 and 105 hectares) in Haryana."
  27. "Dig this! 5,000-yr-old skeletons found in Hisar". Hindustan Times. 15 April 2015. Archived from the original on 12 ఆగస్టు 2015. Retrieved 13 జూన్ 2018.
  28. "Dig this! 5,000-yr-old skeletons found in Hisar". Hindustan Times. 15 April 2015. Archived from the original on 12 ఆగస్టు 2015. Retrieved 13 జూన్ 2018.
  29. "Mysteries of Rakhigarhi's Harappan Necropolis: In burials from 4,000 years ago, women both exalted, condemned". Indian Express. 26 March 2018.
  30. "Ancient granary found in Haryana". The Hindu. 2 May 2014.
  31. McIntosh, Jane R. (2008). The ancient Indus Valley : new perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. p. 293. ISBN 9781576079072.
  32. "Scientists to study parasite eggs in Harappan graves". The Times of India. 12 January 2014.
  33. "Biomedical Studies on Archaeology". 19 February 2014. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 13 జూన్ 2018.
  34. "Harappan site of Rakhigarhi: DNA study finds no Central Asian trace, junks Aryan invasion theory". 13 June 2018. Archived from the original on 13 జూన్ 2018. Retrieved 14 జూన్ 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  35. Harappan museum at Rakhigarhi
"https://te.wikipedia.org/w/index.php?title=రాఖీగఢీ&oldid=4357437" నుండి వెలికితీశారు