రాచర్ల సామ్రాజ్యం
రాచర్ల సామ్రాజ్యం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధురాలు.[1] ఈమె ప్రముఖ సామాజిక కార్యకర్త గోరా సోదరి. 1946 నుంచి సుమారు 34 ఏళ్ళపాటు తూర్పు గోదావరి జిల్లా, సీతానగరంలో గల కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు ప్రాంతీయ కార్యాలయంలో వివిధ స్థాయిల్లో పనిచేసింది. 1972 లో కేంద్ర ప్రభుత్వం నుంచి తామ్ర పత్ర పురస్కారం అందుకున్నది. 2017 ఫిబ్రబరి 6 న విశాఖపట్నంలో అనారోగ్యంతో కన్ను మూసింది.
జీవిత విశేషాలు
మార్చుఆమె దేశభక్తుడు గోపరాజు వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919 ఏప్రిల్ 26న రాజమహేంద్రవరంలో జన్మించింది. హిందీలో రాష్ట్ర భాష, విశారద చదివింది. కాకినాడ సమీపంలోని రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావుతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు. కుమారుడు పుట్టిన మూడేళ్లకు (1937) భర్త మృతిచెందాడు. కుమారుడికి ఐదేళ్ల వయసు వచ్చాక కన్నవారింటిలో ఉంచి ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నది. 1944లో ఆమెను విజయవాడలో అరెస్టు చేసి రాయవెల్లూరు జైలుకు పంపారు.[2] జైలు నుంచి బయటకు వచ్చాక గాంధీ ఆశ్రమం వార్దా సేవాగ్రామ్‌లో శిక్షణ పొందింది. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంలో 1980 వరకు పనిచేసింది. 1972లో కేంద్రం నుంచి తామ్రపత్రం అందుకున్నాది. సామ్రాజ్యం చివరి వరకు బాపూజీ ఆశయాలను అనుసరించింది.[3]
మరణం
మార్చుఆమె గోరా చివరి సోదరి. ఆమె 2017 ఫిబ్రవరి 6న తన 98వ యేట ఆయాసంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచింది.[4]
మూలాలు
మార్చు- ↑ "స్వాతంత్ర్య సమరాంధ్ర వీరవనితలు" (PDF).[permanent dead link]
- ↑ "Veteran freedom fighter Racharla Samrajyam passes away".
- ↑ "రాచర్ల సామ్రాజ్యం కన్నుమూత". 7 February 2017.[permanent dead link]
- ↑ "Freedom fighter passes away". 7 February 2017.